హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం... కొనండి ఇలా

Gold: మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం... కొనండి ఇలా

Gold: మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం... కొనండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Gold: మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం... కొనండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Gold | బంగారం ధర మళ్లీ రూ.55,000 మార్క్ దాటుతోంది. రికార్డ్ ధర వైపు పరుగులు తీస్తోంది. అయినా మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం కొనొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతోంది. రికార్డ్ ధర వైపు గోల్డ్ పరుగులు తీస్తోంది. రెండేళ్ల క్రితం బంగారం గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. 2020 ఆగస్ట్ 7న హైదరాబాద్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 ధరకు చేరుకోగా, 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130 కి చేరుకుంది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.55,000 మార్క్‌కు దగ్గర్లో ఉంది. దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం ధర భారీగా పెరిగింది. నవంబర్ 4 నుంచి బంగారం భారీగా పెరిగింది. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.50,250 ధరకు చేరుకుంది. రూ.4,150 పెరిగింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.54,820 ధరకు చేరుకుంది. రూ.4,530 పెరిగింది.

మరి బంగారం ధర ఇంతలా పెరుగుతుంటే భారీ డిస్కౌంట్‌తో గోల్డ్ కొనే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? అస్సలు వదులుకోరు. ఈ అవకాశం ఉందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,820. పన్నులు కలిపితే రూ.55,000 పైనే చెల్లించాలి. గోల్డ్ బాండ్ రూపంలో కొంటే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల్ని సుమారు రూ.5,000 డిస్కౌంట్‌తో కొనొచ్చు. అంటే సుమారు రూ.50,000 ధరకే 10 గ్రాముల గోల్డ్ బాండ్ వస్తుంది.

SBI Alert: ఎస్‌బీఐ కొత్త సర్వీస్... మీరూ వాడుకోండి ఇలా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తరచూ సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని అమ్ముతూ ఉంటుంది. ఒక గ్రామ్ గోల్డ్ బాండ్ ధర ఎంతో ప్రకటిస్తుంది. మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ఏ ధరలో ఉంటే, గోల్డ్ బాండ్ కూడా అదే ధరలో లభిస్తుంది. అయితే ఆర్‌బీఐ దగ్గర గోల్డ్ బాండ్స్ కొన్నవాళ్లు, కొంతకాలం తర్వాత సెకండరీ మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో అమ్ముతుంటారు. డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు సెకండరీ మార్కెట్లో గోల్డ్ బాండ్స్ కొనొచ్చు.

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో SGBDEC25XI అంటే 2025 డిసెంబర్‌లో మెచ్యూర్ అయ్యే సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాము రూ.5001 ధరకు లభిస్తోంది. అంటే 10 గ్రాముల ధర రూ.50,010. అంటే రూ.50,000 ధరకే 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ కొనొచ్చు. అదే మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ బిస్కిట్ కొనాలంటే రూ.55,000 పైనే చెల్లించాలి. బంగారంపై ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ పొందాలనుకునేవారు ఫిజికల్ గోల్డ్ కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందొచ్చు.

Aadhaar Update: ఏ ప్రూఫ్ లేకపోయినా ఆధార్ అప్‌డేట్ చేయండి ఇలా

సావరిన్ గోల్డ్ బాండ్ సర్టిఫికెట్ రూపంలో వస్తుంది. 24 క్యారెట్ స్వచ్ఛత ఉంటుంది. ప్రతీ గోల్డ్ బాండ్‌కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. సెకండరీ మార్కెట్లో గోల్డ్ బాండ్స్ కొనేవారు అవి ఎప్పుడు మెచ్యూర్ అవుతాయో చెక్ చేసి కొనాలి.

First published:

Tags: Gold Prices, Investment Plans, Personal Finance, Sovereign Gold Bond Scheme

ఉత్తమ కథలు