Home /News /business /

BUY SAMSUNG PRODUCTS WITH UP TO RS 60000 CREDIT USING PAYTM POSTPAID PAYMENT METHOD SS

Samsung: సాంసంగ్ ఆఫర్... మొబైల్, టీవీ కొనేందుకు రూ.60,000 వరకు క్రెడిట్

Samsung: సాంసంగ్ ఆఫర్... మొబైల్, టీవీ కొనేందుకు రూ.60,000 వరకు క్రెడిట్
(image: Samsung India)

Samsung: సాంసంగ్ ఆఫర్... మొబైల్, టీవీ కొనేందుకు రూ.60,000 వరకు క్రెడిట్ (image: Samsung India)

Samsung Offer | సాంసంగ్ స్మార్ట్ టీవీ, సాంసంగ్ మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.60,000 క్రెడిట్‌తో ఈ వస్తువుల్ని కొనొచ్చు. తర్వాత డబ్బులు చెల్లించవచ్చు. ఇందుకోసం పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో (Paytm Postpaid) ఒప్పందం చేసుకుంది సాంసంగ్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత టీవీ మార్చేసి కొత్త స్మార్ట్ టీవీ (Smart TV) తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? సాంసంగ్ అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. డబ్బులు లేకపోయినా సరే రూ.60,000 వరకు సాంసంగ్ ప్రొడక్ట్స్ కొనే అవకాశం ఇస్తోంది. ఇందుకోసం పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో (Paytm Postpaid) సాంసంగ్ చేతులు కలిపింది. బయ్ నౌ పే లేటర్ పద్ధతిలో పేటీఎం పోస్ట్‌పెయిడ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా కస్టమర్లు సాంసంగ్ ప్రొడక్ట్స్ కొనే అవకాశం కల్పిస్తోంది. సాంసంగ్ ఆథరైజ్డ్ స్టోర్స్‌లో కస్టమర్లు పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు.

భారతదేశంలోని ఆథరైజ్డ్ స్టోర్లలో సాంసంగ్ ప్రొడక్ట్స్ కొనేప్పుడు కస్టమర్లు పేటీఎం అందించే పేమెంట్ మెథడ్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో పాటు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.60,000 వరకు క్రెడిట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ వాచీలు, రిఫ్రిజిరేటర్స్, ఇతర ప్రొడక్ట్స్ కొనొచ్చు.

SBI Free Service: ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు... వారికి ఉచితంగా ఎస్‌బీఐ సర్వీస్

పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా కస్టమర్లకు రూ.60,000 వరకు లిమిట్ లభిస్తుంది. ఈ లిమిట్ ఉపయోగించుకున్న తర్వాత తక్కువ వడ్డీకే ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇదే కాదు పేటీఎం నుంచి తక్కువ వడ్డీకే రూ.2,00,000 వరకు పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. పేటీఎం నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

IRCTC Luggage Rules: భారీ లగేజీతో రైలు ఎక్కుతున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి



పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఫీచర్స్ చూస్తే కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ను బట్టి క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.60,000 లిమిట్ పొందొచ్చు. కస్టమర్లకు క్రెడిట్ ఇచ్చేందుకు పేటీఎం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. రూ.60,000 లిమిట్ వాడుకున్న కస్టమర్లు తర్వాత మొత్తం ఒకేసారి చెల్లించవచ్చు. లేదా ఈఎంఐగా మార్చుకోవచ్చు. 30 రోజుల్లోపు చెల్లిస్తే వడ్డీ ఉండదు. యాక్టివేషన్ ఫీజ్ కూడా ఉండదు. 100 శాతం డిజిటల్ పద్ధతిలో ప్రాసెస్ పూర్తవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Paytm, Samsung, Smart TV, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు