హోమ్ /వార్తలు /బిజినెస్ /

Royal Enfield: నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే డ్రీమ్ బుల్లెట్ బైక్ మీదే

Royal Enfield: నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే డ్రీమ్ బుల్లెట్ బైక్ మీదే

Royal Enfield: నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే డ్రీమ్ బుల్లెట్ బైక్ మీదే
(image: Royal Enfield)

Royal Enfield: నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే డ్రీమ్ బుల్లెట్ బైక్ మీదే (image: Royal Enfield)

Royal Enfield | రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఈఎంఐ ఆప్షన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. నెలకు కేవలం రూ.3,500 ఈఎంఐతో డ్రీమ్ బుల్లెట్ బైక్ కొనే అవకాశం ఇస్తోంది రాయల్ ఎన్‌ఫీల్డ్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

బుల్లెట్ బైక్... కుర్రకారు డ్రీమ్ బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి ఎక్కి చక్కర్లు కొట్టాలని కుర్రాళ్లు కలలు కంటారు. అయితే బడ్జెట్ కారమంగా ఈ బైక్ అందరికీ అందుబాటులో ఉండదు. కాస్త ఎక్కువ సంపాదిస్తున్నవారు, డబ్బున్నవారు మాత్రమే ఈ బైక్ కొంటుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్ కొనాలంటే లక్షన్నర పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతమొత్తం ఒకేసారి చెల్లించి కొనలేనివారికి ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ (Royal Enfield Bullet) సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈఎంఐ ఆప్షన్స్ అందిస్తోంది. ఈఎంఐ రూ.5,000 లోపే ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్‌రోడ్ ధర రూ.1,88,000 వరకు ఉంటుంది. కేవలం రూ.9,000 డౌన్‌పేమెంట్ చెల్లించి ఈఎంఐలో బుల్లెట్ బైక్ సొంతం చేసుకోవచ్చు. 60 నెలలు, 48 నెలలు, 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. 60 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.3,525 ఈఎంఐ, 48 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.4,131 ఈఎంఐ, 36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే రూ.5,156 ఈఎంఐ చెల్లించాలి.

EPFO Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వారికి ఊరట కల్పించిన ఈపీఎఫ్ఓ

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఫీచర్స్ చూస్తే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 346సీసీ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌లోని ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ టెక్నాలజీ గరిష్టంగా 28 Nm టార్క్, 19.36 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లతో పాటు సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లీటర్‌కు 37 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఓనిక్స్ బ్లాక్, బుల్లెట్ సిల్వర్, రీగల్ రెడ్, జెట్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఈఎస్ మోడల్ కూడా ఉంది.

Govt Loan: చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు లోన్ ఇస్తున్న మోదీ ప్రభుత్వం

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇటీవల సూపర్ మెటార్ 650 మోడల్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ మెటార్ 650, సూపర్ మెటార్ 650 టూరర్ మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇందులో 648cc ట్విన్ ఇంజిన్‌ ఉంది. ఇది 47 bhp పవర్‌ను, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 241 కిలోల బరువు ఉంటుంది. 15.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ కెపాసిటీ ఉండటం విశేషం. ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్‌స్టెల్లార్ గ్రే, ఇంటర్‌స్టెల్లార్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.

First published:

Tags: Bullet bike, Royal Enfield, Two wheeler

ఉత్తమ కథలు