Buy Now- Pay Later: కరోనా (Corona pandemic) కారణంగా గ్లోబల్ పేమెంట్ సిస్టమ్స్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యావసరాలు మొదలుకొని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Electronic Gadgets) వరకు ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. పైగా ఎలాంటి వడ్డీ లేకుండా లేదా తక్కువ వడ్డీతో బిల్లుల చెల్లింపుతో కాల వ్యవధి ఉండే వాటిపై కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇ-కామర్స్ సంస్థలు ఇటీవల కాలంలో ‘ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి’ (బై నౌ పే లేటర్.. BNPL) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. ఇటీవల కాలంలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫైనాన్షియల్ మోడల్‌గా మారింది.
వడ్డీ లేకుండా లేదా తక్కువ వడ్డీతో..
మనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, వాటి బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తరువాత చెల్లించే విధానాన్ని బై నౌ పే లేటర్ అంటారు. ఈ విధానంలో ఎలాంటి వడ్డీ లేకుండా లేదా తక్కువ వడ్డీతో బిల్లును చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ కింద కస్టమర్‌లకు వడ్డీ రహిత స్వల్పకాలిక రుణాలను అందిస్తారు. దీంతో వారు వారు కొనుగోళ్లు చేయవచ్చు. కొన్నాళ్ల తరువాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రీపేమెంట్ టెన్యూర్ ముగిసిన తరువాత కూడా అనేక BNPL సర్వీస్ ప్రొవైడర్లు సమాన నెలవారీ వాయిదాలలో (EMIs) చెల్లింపును కూడా అవకాశం కల్పిస్తున్నాయి.
శాతవాహన ఎక్స్‌ప్రెస్ కు మరో 3 అదనపు స్టాపేజ్ లు.. ఆగే స్టేషన్లు ఇవే
వాటితో పోల్చితే బెటర్..
సాధారణంగా క్రెడిట్ కార్డ్స్ లేదా ఇతర క్రెడిట్ లైన్స్ కంటే BNPL ప్లాన్స్ సులభంగా ఆమోదం పొందుతాయి. పైగా వడ్డీ లేకపోవడం, లేదా తక్కువ వడ్డీ ఉండడంతో లోన్స్ కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.
అర్హత ప్రమాణాలు
మనదేశంలో BNPL లోన్స్‌కు అర్హత పొందాలంటే, ఒక వ్యక్తి టైర్-1 లేదా టైర్-2 సిటీలో నివసిస్తూ ఉండాలి. అతని వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నెల జీతం పొందుతున్న వ్యక్తి అయి ఉండాలి. వారికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో పాటు KYC డాక్యుమెంట్ కలిగి ఉండడం తప్పనిసరి.
లాభాలు
BNPL ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం వల్ల కస్టమర్లకు తక్షణం క్రెడిట్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ సరళమైనది, పారదర్శకంగా, సురక్షితమైనది. ఇది నో-కాస్ట్ EMI ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
ప్రతికూలతలు
BNPL వల్ల రకాల రిస్క్స్ ఉంటాయి. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. తక్కువ మొత్తంలో చెల్లించే అవకాశం ఉన్న వారు వారి స్తోమత కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఒక వ్యక్తి తిరిగి చెల్లింపు వ్యవధిలోపు మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే, రుణదాత చెల్లించని మొత్తానికి వడ్డీని వసూలు చేయవచ్చు. భారీ ఆలస్య చెల్లింపు రుసుమును విధించవచ్చు. దీంతో కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి అవకాశం లేకపోలేదు. ఇతర లోన్స్ మాదిరిగానే, ఈ విధానంలో కూడా చెల్లించడంలో ఆలస్యమైతే కస్టమర్ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
బీఎన్‌పీఎల్ ప్రధాన బ్రాండ్స్
భారత్‌లో బీఎన్‌పీఎల్ ప్రధాన బ్రాండ్స్‌గా LazyPay, Simpl, Amazon Pay Later, Flipkart Pay Later, ZestMoney వంటివి సర్వీస్ అందిస్తున్నాయి. ఈ బ్రాండ్‌లలో చాలా వరకు ఒకే విధమైన ఆపరేషనల్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. కస్టమర్లు కొనుగోలు చేసే సమయంలో బై నౌ పే లేటర్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత బిల్లు మొత్తంలో కొంత డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలినది నిర్ణీత వ్యవధిలో వడ్డీ రహిత ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్రాండ్స్ బట్టి నిబంధనలు మారుతూ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, E-commerce, Online shopping