• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BUY NOW PAY LATER SCHEMES ARE GETTING POPULAR AFTER COVID 19 PANDEMIC BUT THESE ARE DANGEROUS HERE FULL DETAILS NS GH

Explainer- Buy now, pay later: బై నౌ, పే లేటర్ స్కీంలకు పెరుగుతున్న ఆదరణ.. అసలు అవి మంచివేనా? ఎలా పనిచేస్తాయంటే..

Explainer- Buy now, pay later: బై నౌ, పే లేటర్ స్కీంలకు పెరుగుతున్న ఆదరణ.. అసలు అవి మంచివేనా? ఎలా పనిచేస్తాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

చాలా ఫిన్ టెక్ కంపెనీలు బై నౌ, పే లేటర్ ఆప్షన్ ని వినియోగదారులకు అందిస్తున్నాయి. దీని ద్వారా ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువులకు కొన్ని రోజుల తర్వాత పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే..

  • Share this:
ఇంతకుముందు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే దాని గురించి కొన్ని నెలలో సంవత్సరాలో డబ్బు పోగు చేసుకొని కొనేవారు చాలామంది. కానీ ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్లు, క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని కొనడం చాలా సింపుల్ గా మారిపోయింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చాలా ఫిన్ టెక్ కంపెనీలు బై నౌ, పే లేటర్ ఆప్షన్ ని ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువులకు కొన్ని రోజుల తర్వాత పేమెంట్ చేసే వీలుంటుంది. ఈ ఆప్షన్ రెండు మూడు సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చినా కోవిడ్-19 వల్ల ఈ ఆప్షన్ చాలా ఫేమస్ గా మారిపోయింది. ఈ సంస్థలకు ఎక్కువగా టైర్ 2, టైర్ 3 సిటీల్లోనే వినియోగదారులున్నారట. జెస్ట్ మనీ సంస్థ తమ వినియోగదారుల్లో 68 శాతం మంది ఈ నగరాల్లో ఉన్నట్లు టైర్ 1 సిటీల్లో ఉన్నవారు కేవలం 32 శాతమే అని వెల్లడించింది. పూణెలో ఉండే షాలిని కూడా చాలా మందిలాగే కరోనా సమయంలో ఆన్ లైన్ షాపింగ్ కి అలవాటు పడ్డారు.

ఈ సమయంలోనే బై నౌ, పే లేటర్ ఆప్షన్ పై ఆమె ఫోకస్ పెట్టింది. దీని ద్వారా చిన్న, పెద్ద వస్తువులు కొని దాన్ని తర్వాత ఈఎంఐగా మార్చుకునే వీలు కలిగిందని ఆమె వెల్లడిస్తోంది. ఆమెలాగే చాలామంది మిలినియల్స్ ఈ ఆప్షన్ ని ఎంచుకొని కొత్త వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. జెస్ట్ మనీ నిర్వహించిన అధ్యయనం మేరకు ఈ పథకాన్ని ఎంచుకున్న వినియోగ దారుల సగటు వయసు 34 సంవత్సరాలుగా ఉందట. 2020 రిపోర్ట్ ప్రకారం ఈ పథకాన్ని చాలామంది వాటిని ఆన్ లైన్ ఎడ్యుకేషన్, ఖరీదైన స్మార్ట్ ఫోన్లను కొనడం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలుతో పాటు ప్రయాణాలకు కూడా ఉపయోగించారట.

జెస్ట్ మనీ సీఈఓ లిజీ చాప్ మాన్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ పథకాన్ని ఎక్కువ మంది ఉపయోగించారు. ఈ అలవాటు అలాగే కొనసాగుతుంది. ఈ పథకం చాలామందికి నచ్చుతోంది. అన్నారు. ఈ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ముంబై, బెంగళూరు, దిల్లీ లాంటి నగరాలకు చెందిన వారు ఉపయోగిస్తున్నారట. సగటు ట్రాన్సాక్షన్లు 43,000 గా ఉండడం విశేషం. కరోనా లాక్ డౌన్ వల్ల అవసరాలు పెరిగాయి. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో ఒక్కసారిగా పెట్టుబడి పెట్టకుండా ఇలా కొద్దిగా కట్టుకునే పద్ధతులను చాలామంది ఇష్టపడుతున్నారు.

బై నౌ, పే లేటర్ ఎలా పనిచేస్తుందంటే..
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ స్కీమ్ ల ద్వారా వస్తువులను ఇప్పుడు కొని భవిష్యత్తులో వాటి బిల్లు చెల్లించే వీలుంటుంది. దీనికి గాను ముందు ఓ ఫిన్ టెక్ కంపెనీలో ఎన్ రోల్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ఆఫర్ చేసే ఆన్ లైన్ స్టోర్ల నుంచి వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత పదిహేను నుంచి నెల రోజుల తర్వాత మీరు ఆ వస్తువుకి సంబంధించిన బిల్లును చెల్లించే వీలుంటుంది. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం కొద్దిగా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ మీ బిల్ అమౌంట్ ని బట్టి ఉంటుంది. మరీ ఎక్కువ ఖరీదు పెట్టి కొనే కొన్ని వస్తువులకు నో కాస్ట్ ఈఎంఐ రూపంలో కూడా చెల్లించే ఆప్షన్ ని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.

ఇందులో ఉన్న కొన్ని పాపులర్ సంస్థలుగా అమెజాన్ పే, ఈపే లేటర్, కిష్ట్, లేజీ పే, సింపుల్, స్లైస్, జెస్ట్ మనీ వంటివి చెప్పుకోవచ్చు. వీటిని లాగిన్ అయ్యి మీరు వాటి సేవలను పొందవచ్చు. ఒకేసారి ఎక్కువ సంస్థల సేవలను కూడా పొందే వీలుంటుంది. లాగిన్ కాగానే మీ క్రెడిట్ ప్రొఫైల్ ని బట్టి మీకు కొంత క్రెడిట్ లిమిట్ ని ఆ సంస్థలు అందిస్తాయి. ఈ ఆప్షన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. వీటితో పాటు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్, గో ఐబిబో, క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ సంస్థల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సంస్థలు క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు అందించే సేవలను అందిస్తాయి.

ఎంత ఖర్చవుతుంది?
ఈ సంస్థలు అచ్చం క్రెడిట్ కార్డు లాంటి సేవలనే అందిస్తాయి. కొన్ని పదిహేను రోజులు మరికొన్ని నెల రోజుల గడువును అందిస్తాయి. ఉదాహరణకి మీరు సింపుల్ యాప్ లో 2500 కొనుగోలు చేసి పదిహేను రోజుల తర్వాత బిల్లు చెల్లించలేకపోతే పెనాల్టీగా రూ.250 + జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. కిష్ట్ యాప్ లో ఈ వడ్డీ 21 శాతంగా ఉంది. ఇందులో ఆరు నెలల పాటు ఈఎంఐలు పెట్టుకునే వీలుంటుంది. లేజీ పేలో కూడా పదిహేను రోజుల తర్వాత బిల్ చెల్లించే వీలుంటుంది. సెటిల్ మెంట్ తేదీలో వాటిని ఈఎంఐగా మార్చుకోవడం లేదా మొత్తం చెల్లించడం చేయవచ్చు. దీంట్లో వడ్డీ 15 నుంచి 32 శాతంగా ఉంటుంది. ఈపేలేటర్ సంస్థ 36 శాతం వడ్డీని ఛార్జ్ చేస్తుంది.

జాగ్రత్త అవసరమే..
ఈ ఛార్జీలు చాలామందికి తక్కువగానే అనిపిస్తుంటాయి కానీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి. ఒకసారి ఈ బిల్లులు చెల్లించడం మిస్ అయితే అది మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగం కోల్పోయి ఈఎంఐ కట్టలేకపోయిన చాలామంది తమ అప్పులు రోజురోజుకీ పెరిగిపోవడం చూసి వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కీములతో పోల్చితే బ్యాంకులు అందించే పర్సనల్ లోన్స్ చాలా తక్కువ వడ్డీకే లభిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 8.9 నుంచే 10.5 శాతం వరకు వడ్డీతో వీటిని అందిస్తున్నాయి. అయితే ఈ స్కీములలో ఒక్కసారి చెల్లింపులు ఆగిపోతే క్రెడిట్ స్కోర్ పై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

భవిష్యత్తులో తీసుకునే లోన్లపై ఇది ప్రభావం చూపుతుంది. అందుకే ఈ పద్ధతిలో వస్తువులు కొనే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు కదా అంటూ చాలామంది అవసరం లేకపోయినా చాలా వస్తువులు కొనేస్తుంటారు. కానీ ఆ తేదీలోపు కచ్చితంగా దీన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందుల పాలవ్వాల్సి ఉంటుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారు దీని బదులు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం మంచిది. దీనివల్ల మీకు వడ్డీ కూడా తగ్గుతుంది. అందుకే మీ ఫైనాన్సెస్ మ్యానేజ్ చేయడం మీకు తెలిసి ఉండాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
Published by:Nikhil Kumar S
First published: