లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్... ఎల్ఐసీ. భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లో ఒక ఎల్ఐసీ పాలసీ తప్పనిసరిగా ఉంటుంది. మరి మీరు కూడా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకోసం ఏజెంట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో నేరుగా మీరే పాలసీ తీసుకోవచ్చు. ఇది డిజిటల్ ప్రపంచం. ఆన్లైన్లో పాలసీ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆన్లైన్లో ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఎల్ఐసీ జీవన్ శాంతి, ఎల్ఐసీ జీవన్ అక్షయ్ VI, ఎల్ఐసీ క్యాన్సర్ కవర్, ఎల్ఐసీ ఇ-టర్మ్, ఎల్ఐసీ నవజీవన్ లాంటి పాలసీలు డిస్కౌంట్‌పై లభిస్తాయి. ప్రధానమంత్రి వయవందన యోజన పాలసీకి డిస్కౌంట్ వర్తించదు.
Read this:
SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్డేట్ చేయండి

image: LIC
ఆన్లైన్లో ఎల్ఐసీ పాలసీ ఎలా తీసుకోవాలి?
ముందుగా మీరు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్
https://eterm.licindia.in/onlinePlansIndex/login.do ఓపెన్ చేయాలి.
అందులో ఉన్న పాలసీల్లో మీరు తీసుకోవాలనుకుంటున్న పాలసీపై క్లిక్ చేయాలి.
పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఓసారి చదవాలి.
ఆ తర్వాత Buy Online క్లిక్ చేయాలి.
Proceed బటన్ క్లిక్ చేసి పేరు, ఇతర వివరాలన్నీ నమోదు చేయాలి.
చివరగా పేమెంట్ చేస్తే మీరు ఆన్లైన్లో పాలసీ కొనే ప్రక్రియ పూర్తైనట్టే.
ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే 2 శాతం వరకు రిబేట్ లభిస్తుంది.
Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
YouTube: యూట్యూబ్ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు
Credit Card Benefits: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? 10 లాభాలు ఇవే...