లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారతదేశంలోనే అతిపెద్ద బీమారంగ కంపెనీ. అసలు ఎల్ఐసీ గురించి తెలియని గ్రామం ఉండదు. అంతలా విస్తరించింది ఈ సంస్థ. ఎల్ఐసీలో అనేక వర్గాలకు అన్ని రకాల పాలసీలు, ప్లాన్స్ ఉంటాయి. ఎల్ఐసీ సీనియర్ సిటిజన్ల కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY. 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం రూపొందించిన ప్లాన్ ఇది. ఈ పాలసీ గడువు గతంలోనే ముగిసింది. కొంతకాలం క్రితం ప్రభుత్వం పెన్షన్ రేటును సవరించి 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. దీంతో ఈ పాలసీలో చేరడానికి మరో రెండేళ్ల వరకు గడువుంది.
Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి
SBI Alert: జూన్ 30 లోగా ఈ పనిచేయండి... కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక
ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పాలసీలో ఏటా 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది ఇమ్మీడియట్ పెన్షన్ ప్లాన్. అంటే ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వెంటనే పెన్షన్ మొదలవుతుంది. ప్రతీ నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఓసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. పాలసీ గడువు పదేళ్లు. ఆ తర్వాత ముందు పాలసీ కోసం చెల్లించిన మొత్తం తిరిగి వస్తుంది. ఉదాహరణకు ఈ పాలసీలు ఒకేసారి రూ.15,00,000 డబ్బులు చెల్లిస్తే నెలకు రూ.9,250 పెన్షన్ వస్తుంది. ఇలా పదేళ్ల పాటు పెన్షన్ తీసుకోవచ్చు. పాలసీ గడువు ముగియగానే రూ.15,00,000 వెనక్కి వస్తాయి.
Card Transactions: ఆన్లైన్ షాపింగ్‌కు మీ కార్డు పనిచేయట్లేదా? అకౌంట్లో ఈ సెట్టింగ్స్ మార్చండి
EPFO Insurance: ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు రూ.7,00,000 వరకు బీమా
ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పాలసీ తీసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. గరిష్టంగా 75 శాతం వరకు లోన్ ఇస్తారు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీసం రూ.1,62,162 చెల్లించాలి. వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000,సంవత్సరానికి రూ.12,000 పెన్షన్ వస్తుంది. గరిష్టంగా రూ.15,00,000 చెల్లించొచ్చు. వారికి నెలకు రూ.9,250 చొప్పున పెన్షన్ లభిస్తుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బులు వచ్చినవారు సేవింగ్స్ చేసుకొని నెలనెలా ఆదాయం పొందాలనుకుంటే వారికి ఇది ఉపయోగపడే ప్లాన్.
ఎల్ఐసీ ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పాలసీని ఎల్ఐసీ వెబ్సైట్లో తీసుకోవచ్చు. ఇది సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న ప్లాన్ మాత్రమే. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 60 ఏళ్ల వయస్సు ఉండాలి. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి తిరిగి ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LIC, Pension Scheme, Personal Finance