రూ. 10 లక్షలు కావాలా...అయితే రోజుకు 74 రూపాయలు పొదుపు చేస్తే చాలు...మీ సొంతం..

LIC కొత్త జీవన్ ఆనంద్ పాలసీ...మీకు సేవ్ చేసే అవకాశాన్ని ఇవ్వడమే కాక, భద్రతను కూడా అందిస్తుంది. మీరు పథకం కింద బోనస్‌లను కూడా పొందుతారు. పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Krishna Adithya | news18-telugu
Updated: July 13, 2020, 12:49 PM IST
రూ. 10 లక్షలు కావాలా...అయితే రోజుకు 74 రూపాయలు పొదుపు చేస్తే చాలు...మీ సొంతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజుకు 74 రూపాయలు పొదుపు చేస్తే చాలు..మీరు 10 లక్షల రూపాయలు పొదుపు చేసుకునే పథకం గురించి ఇప్పుడు తెలసుకుందాం. LICలో కొన్ని పథకాలు భద్రత కోసం ఉద్దేశించి ఉంటే, కొన్ని పథకాలు పొదుపు కోసం ఉద్దేశించినవి ఉంటాయి. అయితే పొదుపుతో పాటు భద్రతను కూడా ఇస్తాయి. LIC కొత్త జీవన్ ఆనంద్ పాలసీ...మీకు సేవ్ చేసే అవకాశాన్ని ఇవ్వడమే కాక, భద్రతను కూడా అందిస్తుంది. మీరు పథకం కింద బోనస్‌లను కూడా పొందుతారు. పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఈ పథకాన్ని ఎవరు తీసుకోవచ్చు:

18 సంవత్సరాలు ఉంటే, మీరు ఎల్ఐసి యొక్క కొత్త జీవన్ ఆనంద్ పథకాన్ని తీసుకోవచ్చు. అదే సమయంలో, ఈ పథకాన్ని తీసుకోవడానికి మీకు 50 ఏళ్లు మించకూడదు.

బీమా చేసిన మొత్తం:
ఈ పథకం కింద కనీసం రూ. 1 లక్ష వరకూ డిపాజిట్ చేయవచ్చు. అదే సమయంలో, గరిష్ట పరిమితి లేదు. అంటే, మీకు కావలసినంత కూడా చేయవచ్చు. మెచ్యూరిటీ వ‌య‌సు గ‌రిష్ఠంగా -75 సంవ‌త్స‌రాలు
క‌నిస్ఠ ట‌ర్మ్ పాల‌సీ - 15 సంవ‌త్స‌రాలు, గ‌రిష్ఠ ట‌ర్మ్ పాల‌సీ - 35 సంవ‌త్స‌రాలుగా నిర్ణయించారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి జూన్ 4, 2020 న పాల‌సీ తీసుకున్నాడు అనుకుందాం...పాల‌సీ తీసుకున్న‌ప్పుడు వ‌య‌సు 30 సంవ‌త్స‌రాలు అయితే, బీమా హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌లు టార్గెట్ ఎంపిక చేసుకున్నాడు అనుకుందాం..అప్పుడు పాల‌సీ ట‌ర్మ్ 25 సంవ‌త్స‌రాలు, ప్రీమియం చెల్లింపు కాలం 25 సంవ‌త్స‌రాలు, వార్షిక ప్రీమియం రూ. 41,206, మెచ్యూరిటీ 2045 జూన్ 4కు ముగుస్తుంది. అంటే  చెల్లించే మొత్తం బీమా హ‌మీ రూ.10 ల‌క్ష‌లు + 25 సంవ‌త్స‌రాల బోన‌స్‌ మీకు లభిస్తుంది.ఎంత మొత్తం ల‌భిస్తుంది ?
ఎంపిక చేసుకున్న‌ గ‌డువు ముగిశాక హామీ మొత్తం, బోన‌స్ క‌లిపి ఎల్ఐసీ పాల‌సీదారుడికి అందిస్తుంది. తాజాగా వెయ్యి రూపాయ‌ల హామీపై బోన్‌స‌ర్ రేటును రూ.42 గా ప్ర‌క‌టించింది. అంటే 2045 నాటికి రూ.10 ల‌క్ష‌ల పాల‌సీకి రూ.42 వేల బోన‌స్ ల‌భిస్తుంది. బోన‌స్ అనేది సంస్థ నే నిర్ణ‌యిస్తుంది. ఇదే రేటు మ‌రో 25 ఏళ్లు కొన‌సాగితే చెల్లించాల్సిన మొత్తం రూ.10.5 ల‌క్ష‌లు (రూ.42 వేలు. 25 సంవ‌త్స‌రాలు = రూ.10.5 ల‌క్ష‌లు) అంటే మొత్తం రూ.20.5 ల‌క్ష‌లు వ‌స్తాయి. 2036 లో ల‌భించే మొత్తం హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌లు + బోన‌స్ రూ.10.5 ల‌క్ష‌లు .

పాల‌సీ చివ‌రి ప్రీమియం 2045 లో చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. రిస్క్ క‌వ‌ర్ ఎలాంటి ప్రీమియం చెల్లించ‌క‌పోయినా కొన‌సాగుతుంది. రూ.10 ల‌క్ష‌లు పాల‌సీ దారుడి మ‌ర‌ణం త‌ర్వాత నామినీకి చెల్లిస్తారు. అందుకే ఇది ఎండోమెంట్‌+ జీవిత బీమా ప‌థ‌కం

పన్ను ప్రయోజనాలు-
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద ప్రీమియం చెల్లించడానికి పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. మరణం సమయంలో అందుకున్న మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading