మీరు హోండా యాక్టీవా కొనాలనుకుంటున్నారా? హోండా కంపెనీ టూవీలర్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. మీరు ఫైనాన్స్ తీసుకున్నా, క్రెడిట్ కార్డుతో కొన్నా ఆఫర్స్ పొందొచ్చు. ఎక్కువ మంది కస్టమర్లు ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకోవడం మామూలే. ఐడీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే కస్టమర్లు సగం ఈఎంఐ చెల్లించొచ్చు. అంటే మొదటి మూడు నెలలు సగం ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి పూర్తి ఈఎంఐ చెల్లించాలి. లోన్ టెన్యూర్ 36 నెలల వరకు ఎంచుకోవచ్చు. అంతేకాదు... ఐడీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల నుంచి 95 శాతం వరకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. అంటే కస్టమర్లు 5 శాతం డౌన్‌పేమెంట్ చెల్లిస్తే చాలు. హోండా యాక్టీవా 6జీ, షైన్, ఎస్పీ125, లివో, సీడీ110 డ్రీమ్, యాక్టీవా 125, డియో, గ్రేజియా లాంటి వాహనాలన్నింటికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది.
Loan: మీ దగ్గర కారు ఉందా? లోన్ ఇస్తామంటున్న కార్స్24
Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి
క్రెడిట్ కార్డుతో టూవీలర్ కొనేవారికి కూడా ఆఫర్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డుతో హోండా టూవీలర్ కొని ఆఫర్ పొందొచ్చు. ఎస్బీఐ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ భారతదేశంలోని కొందరు డీలర్ల దగ్గర మాత్రమే అందుబాటులో ఉంది. హోండా గత రెండు వారాల్లో లివో, సీడీ 110 డ్రీమ్, గ్రేజియా బీఎస్6 మోడల్స్‌ని లాంఛ్ చేసింది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ.
Published by:Santhosh Kumar S
First published:July 22, 2020, 12:06 IST