రాకేష్ జున్‌జున్‌వాలా ఈ స్టాక్ లో షేర్లు కొనేశాడట...త్వరపడండి...

బిపిఓ కంపెనీ Firstsource Solutions షేర్లు 7 శాతం లాభపడ్డాయి. అయితే, ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు విలువ 10 శాతం వరకు పెరిగింది. దీని స్టాక్ శుక్రవారం షేరుకు రూ .43.15 వద్ద ముగిసింది. అసలు సంగతి ఏంటంటే... రాకేశ్ జున్ జున్ వాలా ఈ కంపెనీలో తన వాటాను పెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: July 12, 2020, 5:02 PM IST
రాకేష్ జున్‌జున్‌వాలా ఈ స్టాక్ లో షేర్లు కొనేశాడట...త్వరపడండి...
రాకేష్ జున్ జున్ వాలా
  • Share this:
రాకేశ్ జున్ జున్ వాలా ఈయన్ని వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన పట్టిందల్లా బంగారమే అని స్టాక్ మార్కెట్లో పేరుంది. ఆయన పెట్టుబడి ఏ కంపెనీలో ఉంటే, ఆ కంపెనీ వైపే స్టాక్ మార్కెట్ కదులుుతుంది. రాకేష్ జున్ జున్ వాలా కంపెనీ పనితీరు, భవిష్యత్తును ముందే పసిగట్టేసి. అందులో వాటాలను పెంచుకోవడమో...తగ్గించుకోవడమో చేస్తారు. కొత్త కంపెనీలో డబ్బు పెట్టుబడి పెంచినప్పుడల్లా, ఆ సంస్థ జాక్ పాట్ గా మారుతుంది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఇలాంటి సంఘటన జరిగింది. శుక్రవారం, బిపిఓ కంపెనీ Firstsource Solutions షేర్లు 7 శాతం లాభపడ్డాయి. అయితే, ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు విలువ 10 శాతం వరకు పెరిగింది. దీని స్టాక్ శుక్రవారం షేరుకు రూ .43.15 వద్ద ముగిసింది. అసలు సంగతి ఏంటంటే... రాకేశ్ జున్ జున్ వాలా ఈ కంపెనీలో తన వాటాను పెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త తెలుసుకున్న ఇన్వెస్టర్లు వెంటనే, ఈ కంపెనీ స్టాక్‌పై విరుచుకుపడ్డారు, ఈ కారణంగా స్టాక్ మూమెంట్ ఊపందుకుంది.

Firstsource Solutionsలో రాకేశ్ జున్ జున్ వాలా వాటా ఇప్పుడు 2.88 శాతానికి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ 57 లక్షల షేర్లను కొనుగోలు చేశాడు. ఆయనకు ఈ కంపెనీలో 2 కోట్ల షేర్లు ఉన్నాయి. మార్చి 31 నాటికి ఆయనకు కంపెనీలో 2.06 శాతం వాటా ఉంది.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వాటాను పెంపుదల..
మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు కూడా ఈ సంస్థలో వాటాను పెంచాయి. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల వాటా 7.46 శాతంగా ఉంది, ఇప్పుడు అది 7.78 శాతానికి పెరిగింది. అయితే, ఎఫ్‌పిఐ తన వాటాను 9 శాతం నుంచి 7.64 శాతానికి తగ్గించింది. అయితే మార్చి 2020 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 6.8 శాతం తగ్గి రూ .91.5 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో కంపెనీ రూ .98.2 కోట్ల లాభం ఆర్జించింది. ఈ సంస్థ సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పిఎస్‌జి గ్రూప్‌కు చెందినది.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading