Ujjwala Yojana: మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. అప్లై చేయండిలా..

ఉజ్వలా పథకం కోసం నమోదు చేసుకోవడం చాలా సులభం. ప్రధాన మంత్రి ఉజ్వలా పథకం కింద మహిళలు గ్యాస్ కనెక్షన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Krishna Adithya | news18-telugu
Updated: July 12, 2020, 5:55 PM IST
Ujjwala Yojana: మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. అప్లై చేయండిలా..
(credit - twitter - ANI)
  • Share this:
Pradhan Mantri Ujjwala Yojana: కరోనా సంక్షోభం మధ్యలో, దేశంలోని పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని మోడీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. ప్రధాని ఉజ్వలా పథకం కింద ఎవరైతే మూడవ సిలిండర్ తీసుకోలేదో వారు కూడా సెప్టెంబర్ వరకు దీనిని పొడగించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఒక పేద కుటుంబానికి చెందినవారు అయితే ఈ పథకాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోకపోతే, మీరు దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉజ్వలా పథకం కోసం నమోదు చేసుకోవడం చాలా సులభం. ప్రధాన మంత్రి ఉజ్వలా పథకం కింద బిపిఎల్ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ కనెక్షన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో సంబంధం ఉన్న అధికారిక వెబ్‌సైట్ pmujjwalayojana.com విజిట్ చేయడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ 1 మే 2016 న ప్రారంభించారు.

ప్రధాన్ మంత్రి ఉజ్వలా యోజన కోసం, మీరు ఒక దరఖాస్తు ఫారమ్ నింపి సమీపంలోని ఎల్పిజి పంపిణీదారునికి సమర్పించాలి. దరఖాస్తు ఫారంతో పాటు, మహిళ తన పూర్తి చిరునామా, జన ధన్ బ్యాంక్ ఖాతా, అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్‌ను కూడా అందించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును ప్రాసెస్ చేసిన తరువాత, దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అర్హత కలిగిన లబ్ధిదారునికి ఎల్‌పిజి కనెక్షన్‌లను జారీ చేస్తాయి. ఇక వినియోగదారుడు EMIని ఎంచుకుంటే, సిలిండర్‌పై రాయితీకి తగ్గట్టుగా EMI మొత్తం సర్దుబాటు చేయచేస్తారు.

మీరు ఉజ్వలా పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్ తీసుకున్నప్పుడు, స్టవ్‌తో మొత్తం ఖర్చు రూ .3,200. ఇందులో రూ .1,600 సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఇస్తుంది. చమురు కంపెనీలు మిగిలిన రూ .1,600 ఇస్తాయి, కాని వినియోగదారులు చమురు కంపెనీలకు రూ .1,600 ఇఎంఐగా చెల్లించాలి.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading