హోమ్ /వార్తలు /బిజినెస్ /

ప్రధాని మోదీ అందిస్తున్న రూ.6000 అకౌంట్లో పడలేదా...అయితే వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి....

ప్రధాని మోదీ అందిస్తున్న రూ.6000 అకౌంట్లో పడలేదా...అయితే వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి....

నరేంద్ర మోదీ (File)

నరేంద్ర మోదీ (File)

బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ కార్డులో ఏదైనా పొరపాటు జరగడం లేదా బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు లింక్ లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే తమకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చింది.

  గడిచిన 18 నెలల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) పథకం కింద 10 కోట్ల 9 లక్షల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేసి మోదీ ప్రభుత్వం ఓ కొత్త రికార్డు సాధించింది. అయితే ఈ పథకం కింద మరో 4 కోట్ల 40 లక్షల మందికి సహాయం అందించాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు. కాగా ఇప్పటికీ ప్రయోజనం పొందని రైతులు, వారి బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ కార్డులో ఏదైనా పొరపాటు జరగడం లేదా బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు లింక్ లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే తమకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చింది.

  corona drug, corona vaccine, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, unlock, lockdown6, corona warrior, extend the lockdown, corona update, fight with corona virus, covid19, నరేంద్ర మోదీ, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్2,
  (File)

  కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో, పిఎం కిసాన్ కింద అందుకున్న 2000 రూపాయల వాయిదాలను ఈ పథకం యొక్క అర్హత కలిగిన రైతులకు పంపుతామని ప్రభుత్వం మార్చి 27 న హామీ ఇచ్చింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఒక వేళ మీకు డబ్బు అందకపోతే మీకు 2000 రూపాయలు ఎందుకు రాలేదని కూడా తనిఖీ చేయాలి. PM కిసాన్ సైట్‌లో మీరే స్వయంగా స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఏటా 6 వేల రూపాయలను మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

  Kisan Credit Card loans, Kisan Credit Card loan subsidy, Kisan Credit Card loan last date, how to apply for kisan credit card, kisan credit card loan details, kisan credit card online apply, కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ చివరి తేదీ, కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేయాలి
  (ప్రతీకాత్మక చిత్రం)

  ఈ పథకం ద్వారా దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ చాలా మందికి రిజిస్ట్రేషన్ పరంగా పలు సమస్యలు ఎదురయ్యాయి. అంతేకాదు రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం ద్వారా లబ్ది పొందారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో పాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ల లింక్ లో లోపాల వల్ల మరికొంత మందికి ఈ పథకం అందలేదు. దీంతో మంత్రిత్వ శాఖ రైతుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోని రైతులు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు.

  pm kisan status check, Pradhan mantri kisan samman nidhi scheme, pm kisan scheme aadhaar correction, pm kisan online registration and correction, pm kisan aadhaar correction, పీఎం కిసాన్ స్టేటస్ చెక్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌, పీఎం కిసాన్ ఆధార్ కరెక్షన్, పీఎం కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కరెక్షన్, ప్రధాన మంత్రి కిసాన్ స్కీమ్ ఆధార్ కరెక్షన్
  (ప్రతీకాత్మక చిత్రం)

  PM-KISAN హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606

  పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266

  పిఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్: 155261

  పిఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011—23381092, 23382401

  పిఎం కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ ఉంది: 0120-6025109

  ఇమెయిల్ ID: pmkisan-ict@gov.in

  అయితే ప్రభుత్వం ఈ డబ్బును మూడు విడతలుగా బదిలీ చేస్తుంది, మొదటి విడత కింద డిసెంబర్ 1 నుండి మార్చి 31 మధ్య వస్తుంది, రెండవ విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 మధ్య రైతుల ఖాతాకు మరియు మూడవ విడత ఆగస్టు 1 మరియు నవంబర్ 30 మధ్య నగదు బదిలీ అవుతుంది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business, PM Kisan Scheme

  ఉత్తమ కథలు