Home /News /business /

Business Ideas: ఖర్చు లేని వ్యాపారం... కోట్లలో ఆదాయం... ఇలా ప్రారంభించండి

Business Ideas: ఖర్చు లేని వ్యాపారం... కోట్లలో ఆదాయం... ఇలా ప్రారంభించండి

Business Ideas: కొన్ని వ్యాపారాలకు పోటీ ఉండదు. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. అలాంటి కంపెనీ ఉందని చాలా మందికి తెలియదు కూడా. లాభాలు మాత్రం కోట్లలో ఉంటాయి. అలాంటి ఓ వ్యాపార ఐడియాను ఇప్పుడు తెలుసుకుందాం.

Business Ideas: కొన్ని వ్యాపారాలకు పోటీ ఉండదు. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. అలాంటి కంపెనీ ఉందని చాలా మందికి తెలియదు కూడా. లాభాలు మాత్రం కోట్లలో ఉంటాయి. అలాంటి ఓ వ్యాపార ఐడియాను ఇప్పుడు తెలుసుకుందాం.

Business Ideas: కొన్ని వ్యాపారాలకు పోటీ ఉండదు. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. అలాంటి కంపెనీ ఉందని చాలా మందికి తెలియదు కూడా. లాభాలు మాత్రం కోట్లలో ఉంటాయి. అలాంటి ఓ వ్యాపార ఐడియాను ఇప్పుడు తెలుసుకుందాం.

  Business Ideas: పర్యావరణానికి మేలు చేసే కంపెనీని స్థాపిస్తే... ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. పైగా... అలాంటి కంపెనీకి భారీ లాభాలు వస్తుంటే... ఇక ఆ వ్యాపారానికి తిరుగుండదు. అలాంటి వ్యాపారాలు ఓ 20 దాకా ఉన్నాయి. వాటిలో ఒకటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్. ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటారు. కాబట్టి... ప్లాస్టిక్ వేస్ట్ అనేది వేల టన్నుల్లో ఉంటుంది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వేస్టుగా పడి ఉంటోంది. దాన్ని రీసైక్లింగ్ చేసే కంపెనీలు ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే... ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ (e-waste) రీసైక్లింగ్ కంపెనీని ప్రారంభిస్తే... కోట్లలో లాభాలు సంపాదించవచ్చు.

  ఇండియాలో ఏటా 94.6 లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ వస్తోంది. అందులో 40 శాతం సేకరించకుండా తుక్కులాగే ఉండిపోతోంది. అదే సమయంలో... ఇండియాలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్ వస్తోంది. ఈ ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్టును సేకరించడం కొంత కష్టమే అయినప్పటికీ... గట్టిగా ప్రయత్నిస్తే... ఈ వ్యాపారానికి తిరుగే ఉండదు. 40 ఏళ్ల రాజ్‌కుమార్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఐటీ సెక్టార్‌లో పనిచేసిన ఆయన... ఈ-వేస్ట్ పెరిగిపోతుండటాన్ని కళ్లారా చూశారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు... ఇలా ఎన్నో. వాటిలో చాలా వరకూ రీసైకిల్ కావట్లేదు.

  ఇవి చదవండి.. Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

  దాంతో ఆయన దేశవాళీ వేస్ట్ మేనేజ్‌మెంట్ అనే కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా ప్లాస్టిక్, ఈ-వేస్ట్ ను తిరిగి ఉపయోగపడేలా రీసైకిల్ చెయ్యడమే కాదు.. పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించినట్లు అవుతుందని భావించారు. రాజస్థాన్... కుష్ఖేరాలో తన ప్లాంట్ ప్రారంభించారు. ఆ తర్వాత హర్యానా... గురుగ్రామ్‌లో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పారు. ఈ రెండు చోట్లా... ఈ-వేస్ట్, వాడేసిన బ్యాటరీలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, వాడేసిన ఆయిల్స్ వంటివాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు.

  ఈ రెండు కంపెనీలకూ... 200కు పైగా కంపెనీలతో టై-అప్ ఉంది. ఐటీ, హెవీ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్, కన్సూమర్ గుడ్స్, ఫైనాన్షియల్ సెక్టార్, కన్సల్టింగ్, ఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్స్ రంగాల కంపెనీలు... తమ ఈ-వేస్ట్‌ను, ప్లాస్టిక్ వేస్టును రాజ్ కుమార్ కంపెనీలకు అమ్ముకుంటున్నాయి. తద్వారా ఆయన మళ్లీ రీసైక్లింగ్ చేస్తున్నారు.

  ఇప్పటివరకూ కుమార్ తన కంపెనీలపై రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టారు. సంవత్సరానికి 23 కోట్లు టర్నోవర్ సాధిస్తున్నారు. దేశవాళీ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా సంవత్సరానికి 1000 మెట్రిక్ టన్నుల వేస్టును రీసైకిల్ చేస్తున్నారు.

  రిజిస్ట్రేషన్ ఇలా:
  ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి... రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే... లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు.

  ముద్ర రుణాలు:
  మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది.

  ఇది కూడా చదవండి: World Environment Day: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. కొన్ని షాకింగ్ నిజాలు

  మంచి లాభాలు:
  చాలా కంపెనీలు వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను స్టోర్‌రూంలో పడేసి ఉంచుకుంటాయి. అలాంటి వాటిని తక్కువ ధరకే కొనడం ద్వారా... రీసైక్లింగ్ చేయవచ్చు. తిరిగి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ముడిపదార్థాలుగా అమ్మవచ్చు. తద్వారా పర్యావారణానికి మేలు చేస్తూ... కోట్లలో లాభాలు పొందవచ్చని రాజ్ కుమార్ తెలిపారు.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business Ideas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు