ప్రస్తుతం చాలా మంది వ్యవసాయం (Agriculture)వైపు మొగ్గుచూపుతున్నారు. సంప్రదాయ ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలు పండించి అధిక లాభాలు గడిస్తున్నారు. నగరాల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్స్ (Software Job)చేసే టెకీలు కూడా.. తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి.. పల్లెబాట పడుతున్నారు. పచ్చని పొలాల్లో పనిచేస్తూ అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయం చేయాలని భావిస్తున్నారు. అందరూ పండించే పంటలు కాకుండా..భిన్నంగా ఆలోచిస్తున్నారా? ఐతే మలబార్ వేప సాగు మంచి ఆప్షన్. మన రైతులు ఏటా వేసే పంటలు, తోటలు కొన్ని నెలలల్లోనే కాపుకు వస్తాయి. వాటిని అమ్ముకొని డబ్బు పొందవచ్చు. కానీ మలబార్ వేప సాగు అలా కాదు. ఇది దీర్ఘకాలిక పంట. కోతకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ.. లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
భారతదేశంలోని తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ఎక్కువ మంది రైతులు మలబార్ వేప చెట్లను (Malabar Neem Farming)సాగు చేస్తున్నారు. ప్రస్తుతం క్రమంగా ఇతర రాష్ట్రాల రైతులు కూడా దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మిగతా చెట్లతో పోలిస్తే మలబార్ వేప మొక్కలు చాలా వేగంగా పెరిగి..ఎక్కువ లాభాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి సదుపాయం పుష్కలంగా ఉన్నచోట ఈ చెట్ల కేవలం ఐదేళ్లలోనే కోతకు వస్తాయి. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. కానీ కాస్త సమయం తీసుకుంటుంది.
Bonus Shares: ఒక్క షేరు కొంటే 5 షేర్లు ఫ్రీ.. ఈ 2 కంపెనీల బంపరాఫర్!
మలబార్ వేప చెట్లను ఏ రకమైన నేలలోనైనా పెంచవచ్చు. సారవంతమైన ఇసుక లోమ్ నేలలతో పాటు నిస్సార కంకర నేలల్లో కూడా ఈ చెట్లు ఏపుగా పెరుగుతాయి. మలబార్ వేపచెట్ల నుంచి వచ్చే కలపను అనేక రకాల వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మలబార్ వేప చెక్కను ఫర్నిచర్, ప్యాకింగ్ బాక్స్‌లు, క్రికెట్ స్టిక్స్ తయారు చేయడానికి ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి కాకుండా.. ఇది వ్యవసాయ సంబంధిత పనిముట్లు, షీట్లు, పెన్సిల్స్ తయారీలో వాడుతారు. ఈ చెట్లలో ఔషద గుణాలు కూడా ఉంటాయి. వీటికి చెద పురుగులు పట్టవు. అందువల్ల ఎక్కువ సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంటాయి.
మలబార్ వేప చెట్లు కోతకు వచ్చేందుకు సాధారణంగా 5 నుండి 8 సంవత్సరాలు పడుతుంది. నాలుగు ఎకరాల పొలంలో సుమారు 5 వేల చెట్లను నాటవచ్చు. ఇవి 5 నుంచి 8 ఏళ్లలో కోతకు వస్తాయి. ఆ దశలో ఉన్నప్పుడే మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి. మంచి రేటు వస్తుందనుకుంటేనే అమ్ముకోవాలి. లేదంటే ఆన్లైన్లో ఈ పంటను కొనే బయ్యర్లను కాంటాక్ట్ చేసి రేటు మాట్లాడుకోవచ్చు. 4 ఎకరాల పొలంలో మలబార్ వేప మొక్కలు పెంచడం ద్వారా 6-8 సంవత్సరాలలో 50 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఈ చెట్లను ఎంత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే అంత లాభం పెరుగుతుంది. 10 ఎకరాల్లో సాగుచేస్తూ.. కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business, Business Ideas, Farmers