హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: కిలో రూ.1000.. రైతులను కోటీశ్వరులు చేసే అద్భుతమైన పంట.. డబ్బే డబ్బు

Business Ideas: కిలో రూ.1000.. రైతులను కోటీశ్వరులు చేసే అద్భుతమైన పంట.. డబ్బే డబ్బు

Business Ideas | Black Turmeric Farming: సాధారణ పసుపుతో పోల్చితే.. నల్ల పసుపు దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ రేటు ఎక్కువగా ఉండడం వల్ల అధిక లాభాలు వస్తాయి. నల్ల పసుపు ధర కిలోకు 1000 వరకు పలుకుతుంది. రూ.4వేలకు అమ్మిన రైతులు కూడా ఉన్నారు

ఇంకా చదవండి ...

  ఈ కాలంలో ఎంతో మంది ఉద్యోగాలను వదులుకొని వ్యవసాయం   (Agriculture) వైపు అడుగులు వేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కొలువులను కాదనుకొని రైతుగా మారుతున్నారు. సొంతూరిలో.. పచ్చటి పొలాల మధ్య తిరుగుతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా వ్యసాయం చేయాలనుకుంటున్నారా? ఐతే రైతులకు భారీగా లాభాలు తెచ్చిపెట్టి.. కోటీశ్వరులను చేసే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో నల్ల పసుపు (Black Turmeric) ఒకటి. నల్ల పసుపులో ఉండే ఔషధ గుణాల వల్ల దానికి ధర ఎక్కువ. ఈ పంటను పండిస్తూ ఎంతో మంది రైతులు కోట్లు సంపాదిస్తున్నారు. మరి దీనిని ఎలా సాగు చేయాలి? ఎంత రేటు పలుకుతుంది?ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

  Goa Trip: ఫ్రెండ్స్‌తో గోవా వెళ్తున్నారా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్

  నల్ల పసుపు మొక్క కూడా సాధారణ పసుపు మొక్కలానే ఉంటుంది. ఐతే ఆకుల మధ్యలో నల్లటి గీతలు ఉంటాయి. దంపలు లోపలి నుంచి పసుపు రంగులో కాకుండా.. నలుపు లేదా ఉదా రంగులో కనిపిస్తాయి. నల్ల పసుపు సాగుకు జూన్ నెల ఎంతో అనువుగా ఉంటుంది. ఫ్రైబుల్ లోమ్ నేలల్లో బాగా పండుతుంది. ఐతే పంటను సాగు చేసే సమయంలో వర్షపు నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక హెక్టార్ పొలంలో దాదాపు 2 క్వింటాళ్ల నల్ల పసుపు విత్తనాలను నాటాల్సి ఉంటుంది. ఈ పంటకు నీటిని పారించాల్సిన అవసరం లేదు. క్రిమి సంహాకర మందులు వాడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పంటకు ఎలాంటి చీడ, కీటకాల బెద ఉండదు. ఆవుపేడతో తయారైన ఎరువును వేస్తే.. నల్ల పసుపు పంట దిగుబడి బగా వస్తుంది.

  Oil Prices: వచ్చే నెలలో భారీగా పెరగనున్న వంటనూనె ధరలు.. సామాన్యులకు బిగ్ షాక్ తప్పదా

  మార్కెట్లో సాధారణ పసుపు ధర కిలోకు రూ.60 -100 వరకు పలుకుతుంది. అదే నల్ల పసుపు ధర ఎక్కువగా ఉంటుంది. కిలోకు రూ.800-1000 వరకు వెళ్తుంది. దీనిని చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.ఉత్పత్తి తక్కువగా ఉండడం.. డిమాండ్ ఎక్కువగా ఉండడం.. దీని ధర అత్యధికంగా ఉంటుంది. కరోనా తర్వాత నల్ల పసుపు వినియోగం పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్‌గా దీనిని వినియోగిస్తారు. నల్ల పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఆయుర్వేదం, హోమియోపతి వంటి అనేక మందుల తయారీలో నల్ల పసుపును ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పలు రకాల పూజల్లో కూడా దీనిని వాడుతారు.

  ప్రతీకాత్మక చిత్రం

  ఒక ఎకరలో నల్లపుసుపు సాగుచేస్తే.. 50-60 క్వింటాళ్ల పచ్చి పసుపు వస్తుంది. బాగా ఎండిన తర్వాత 12-15 క్వింటాళ్ల ఎండు పసుపు ఈజీగా లభిస్తుంది. సాధారణ పసుపుతో పోల్చితే.. నల్ల పసుపు దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ రేటు ఎక్కువగా ఉండడం వల్ల అధిక లాభాలు వస్తాయి. నల్ల పసుపు ధర కిలోకు 1000 వరకు పలుకుతుంది. రూ.4వేలకు అమ్మిన రైతులు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు ఎకరం పొలం నుంచి 15 క్వింటాళ్ల పసుపును ఉత్పత్తి చేశారనుకుందాం. హోల్‌సేల్‌గా కిలోకు రూ.500కి అమ్ముకున్నా.. 7.5 లక్షల ఆదాయం వస్తుంది. రూ.1000కి అమ్మితే.. రూ.15 లక్షలు వస్తాయి. అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో 100 గ్రాముల నల్ల పసుపు రూ.500కి విక్రయిస్తున్నారు. మీరు కూడా ప్రాసెస్ చేసి.. బ్రాండింగ్ చేసి.. అదే రేటుకు అమ్మవచ్చు.ఇలా చేస్తే ఇంకా అధిక ఆదాయం వస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు