హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: తేనేటీగల పెంపకంతో సొంతూరిలోనే నెలకు రూ.70వేల ఆదాయం.. ఇలా చేయండి

Business Ideas: తేనేటీగల పెంపకంతో సొంతూరిలోనే నెలకు రూ.70వేల ఆదాయం.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: నేషనల్ బీ బోర్డ్ (NBB) నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోంది. అందులోభాగంగా తేనెటీగల పెంపకం వ్యాపారానికి ప్రభుత్వం 80 నుండి 85 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రస్తుతం చాలా మంది యువత వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చెందిన వారు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. మీరు పల్లెల్లో ఉండి.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలిచ్చే వ్యాపారం (Business Ideas) కోసం చూస్తున్నట్లయితే.. తేనెటీగల పెంపకం (Beekeeping) మంచి ఆప్షన్. నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా.. సొంతూరిలో ఉంటూ నామమాత్రపు ఖర్చుతో నెలకు రూ. 70వేల నుంచి లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు. పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య హాయిగా బిజినెస్ చేయవచ్చు.

  Money: ప్రభుత్వం దసరా కానుక.. 14 కోట్ల మంది అకౌంట్లలోకి డబ్బులు?

  పంట పొలాల మధ్య తేనెటీగల పెంపకాన్ని 'బీ కీపింగ్' అంటారు. 'పంట ఉత్పాదకత పెంపు కోసం తేనెటీగల పెంపకం' పేరుతో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ పథకాన్ని తీసుకొచ్చింది. తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, పంట ఉత్పాదకతను పెంచడం, శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించడం ఈ పథక ఉద్దేశ్యం. నేషనల్ బీ బోర్డ్ (NBB) నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తేనెటీగల పెంపకం వ్యాపారానికి ప్రభుత్వం 80 నుండి 85 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది.

  రూ.5 వేల పొదుపుతో రూ.3.5 లక్షలు.. ఈ బ్యాంకులతో భారీ లాభం!

  తేనెటీగల పెంపకాన్ని మొదట 10 పెట్టెలతో ప్రారంభివచ్చు. ఒక బాక్సులో 40 కిలోల తేనె దొరికితే.. మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టెకు ఖర్చు రూ.3500 వస్తే మొత్తం ఖర్చు రూ.35,000 అవుతుంది. ఖర్చులు పోనూ.. నికర లాభం రూ.1,05,000 వరకు ఉంటుంది. తేనెటీగల సంఖ్య పెరుగుదలతో ప్రతి సంవత్సరం ఈ వ్యాపారం 3 రెట్ల మేర పెరుగుతుంది. అంటే 10 పెట్టెలతో ప్రారంభించిన వ్యాపారం ... ఏడాదికి 25 నుంచి 30 బాక్సుల వరకు ఉంటుంది. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. తేనెటీగల పెంపకంతో కేవలం తేనె, మైనం మాత్రమే కాదు.. బీస్వాక్స్, రాయల్ జెల్లీ, పుప్పొడి లేదా బీ గమ్, పుప్పొడి వంటి ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పత్తులన్నింటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

  ఒకవేళ మీరు తేనెటీగల పెంపకం పెద్ద ఎత్తున చేయాలనుకుంటే.. 100 పెట్టెలను తీసుకొని ప్రారంభించవచ్చు. ఒక పెట్టెలో ఏడాదికి 40 కిలోల తేనె వస్తుందనుకంటే.. మొత్తం తేనె 4000 కిలోలు అవుతుంది. 400 కిలోల తేనెను కిలో రూ.350కి విక్రయిస్తే రూ.14,00,00,000 వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వస్తే మొత్తం ఖర్చు రూ.3,40,000 అవుతుంది. కూలీ, ప్రయాణం వంటి ఇతర ఖర్చులకు రూ. 1,75,000 పోగా.. నికర లాభం రూ.10,15,000 వస్తుంది. పంట పూత దశలో ఉన్న సమయంలో తేనె ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది. ఇలా ప్రతినెలా రూ.70వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందవచ్చు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Honey

  ఉత్తమ కథలు