Home /News /business /

BUSINESS IDEAS YOU CAN EARN 50 THOUSAND RUPEES BY POULTRY FARM BUSINESS IN VILLAGES SK

Business Ideas: రిస్క్‌ లేని బిజినెస్.. రోజుకు 4 గంటలు చాలు.. నెలకు రూ.50వేలు పక్కా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas | Poultry farm: మీరు ఒకవేళ బిజినెస్ చేయాలని భావిస్తుంటే.. అందుకు కోళ్ల పెంపకం మంచి ఆప్షన్. మరి బ్రాయిలర్ కోళ్ల ఫామ్‌కు ఎంత పెట్టుబడి అవసరం?ఎంత ఆదాయం వస్తుంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  ఈ కాలంలో చాలా మంది ఉద్యోగాల కంటే సొంత వ్యాపారం పైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ప్రైవేట్స్ జాబ్స్‌లో ఒత్తిడి ఎక్కువ. అంతేకాదు ఊరికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది యువత బిజినెస్‌పై దృష్టిసారిస్తున్నారు. డబ్బు లేకున్నా.. లోన్ తీసుకొని అయినా.. వ్యాపారం (Business Ideas in Telugu) చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు పౌల్ట్రీ ఫామ్ (Poultry Farm) బిజినెస్ చక్కటి అవకాశం. దీనికి రోజుకు 4 గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నా ఇబ్బందేం లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

  Ola Bike: మోడీ గుడ్ న్యూస్, ఓలా షాకింగ్ న్యూస్.. ఎలక్ట్రికల్ బైక్ ధరలు భయంకరంగా పెంపు

  పెట్టుబడి ఎంత?
  సాధారణంగా 10 వేల కెపాసిటీ ఉన్న కోళ్ల షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. షెడ్డు గోడలు, ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే వస్తాయి. ఏదో ఊరికి దూరంగా పొలాల్లో నిర్మించుకుంటే ఉపయోగం ఉండదు. రోడ్డు సౌకర్యం ఉన్నచోటే పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. షెడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత మీరు ఏదేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వెన్‌కాబ్, సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రీమెంట్ చేసుకోవచ్చు. సదరు కంపెనీ వారే మీకు బ్రాయిలర్ కోడి పిల్లలు ఇస్తారు. రవాణా ఖర్చులు కూడా వారివే. ఆ తర్వాత వాటికి అవసరమైన దాణా, రోగాల బారినపడకుండా ఇంజెక్షన్స్ కూడా వారే సప్లై చేస్తారు. మీరు కేవలం వాటిని పెంచి.. ఇవ్వాల్సి ఉంటుంది. అలా పెంచినందుకు.. కమిషన్ ఇస్తారు. కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత.. కంపెనీ వారే వాహనాన్ని మీ షెడ్డు వద్దకు పంపించి.. కోళ్లను తీసుకెళ్తారు.  ఆదాయం వివరాలు:
  మీరు ఒకవేళ 10 వేల సామర్థ్యంతో పౌల్ట్రీ ఫామ్ పెట్టారని అనుకుందాం. దాదాపు 45 రోజులకు బ్యాచ్ పూర్తవుతుంది. కోళ్లు ఒకటిన్నర నుంచి రెండు కేజీల బరువు పెరుగుతాయి. ఎలాంటి మోర్టాలిటీ లేకుండా అన్ని బతికి.. ఒక్కొక్కటి 2 కేజీల చొప్పున పెరిగాయని భావిస్తే.. అప్పుడు మీ షెడ్‌లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 20వేల కేజీలు. కంపెనీ వారు ఒక్కొ కేజీకి రూ.3 చొప్పున కమిషన్ చెల్లిస్తే.. మీకు రూ.60వేలు వస్తాయి. ఖర్చులకు రూ.10 వేలు పోయినా.. రూ.50వేలు మిగులుతాయి. కొన్ని కంపెనీలు రూ.4 కూడా ఇస్తాయి. అప్పుడు బ్యాచ్‌కు రూ.80 వేల వరకు వస్తాయి. ఈ లెక్కన నెలకు రూ.50వేలు మిగులుతాయి. మీరు సమయం కేటాయించి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. కోడి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తే... తక్కువ సమయంలో బాగా బరువు పెరుగుతాయి. అప్పుడు మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముంది.

  ఆ మహిళా రైతుల ఆదాయం ఏడాదికి రూ.30 లక్షలు.. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఇదే.. తెలుసుకోండి

  మీరు పౌల్ట్రీ కంపెనీలతో కాంట్రాక్ట్ ఒప్పందం కాకుండా... సొంతంగా కూడా బిజినెస్ చేయవచ్చు. అంటే సొంతంగా కోడిపిల్లలు కొని.. వాటిన పెంచి. .మీరే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఐతే దీనికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కారణంతో కోడిపిల్లలు మరణిస్తే.. భారీగా నష్టం వస్తుంది. ఒకవేళ మార్కెటింగ్ చేసుకోలేకపోయినా ఇబ్బందులు తప్పవు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఇందులోనే ఎక్కువ లాభాలు వస్తాయి. ఒక్క బ్యాచ్‌లోనే లక్షల్లో సంపాదించవచ్చు. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే.. కంపెనీలతో కలిసి పనిచేయడం ఉత్తమం. అన్నీ వారే ఇస్తారు. మీరు జస్ట్.. కోళ్లను పెంచి.. ఇస్తే చాలు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు