హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: మీరు ఎక్కడున్నా నెలకు లక్ష ఈజీగా సంపాదించగలిగే.. అద్భుతమైన వ్యాపారం

Business Ideas: మీరు ఎక్కడున్నా నెలకు లక్ష ఈజీగా సంపాదించగలిగే.. అద్భుతమైన వ్యాపారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas | Solar Power Plant: మీ ఇంటిలో ఖాళీగా ఉన్న పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సోలార్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఒక అంచనా ప్రకారం... మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 30 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

ఇంకా చదవండి ...

  మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేని వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారా? ఐతే మీరు కరెంట్‌తో వ్యాపారం (Business Ideas) చేయవచ్చు. థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant), హైడ్రో పవర్ ప్లాంట్ (Hydro Power plant) పెట్టాలంటే.. వందల కోట్లు ఖర్చువుతుంది కదా? అది మనం ఎలా చేయలగమని అనుకుంటున్నారా? అంత పెద్ద ప్లాంట్ అవసరం లేదు.. ఇంట్లో ఉంటూనే ఈజీగా చేయగలిగే.. వ్యాపారం గురించి తెలుసుకుందాం. కేవలం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే సోలార్ పవర్ ప్లాంట్ (Solar Power Plant)..! సౌర విద్యుత్‌ను అమ్మి..నెలకు చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు.

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ ప్యానెల్‌ల(Solar Panels)కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సౌర విద్యుత్తు పథకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు బ్యాంకులు కూడా సోలార్ ప్యానెళ్లకు సులభ వాయిదాల్లో రుణాలు అందజేస్తున్నాయి. దీనికి సబ్సిడీ కూడా లభిస్తుంది. మీ ఇంటిలో ఖాళీగా ఉన్న పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సోలార్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఒక అంచనా ప్రకారం... మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 30 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

  పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటే.. మీరు ఏదేని కంపెనీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక విద్యుత్ సంస్థల నుండి లైసెన్స్ పొందాలి. . విద్యుత్తు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కిలోవాట్‌కు 60-80 వేల రూపాయల వరకుపెట్టుబడి పెట్టాలి. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని ఇస్తుంది. సబ్సిడీ లేకుండా సోలార్ ప్యానెళ్లను అమర్చాలంటే ఒక కిలో వాట్‌కు దాదాపు రూ.లక్ష ఖర్చు అవుతుంది. సోలార్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత.. దానిని యూనిట్ చొప్పున అమ్ముకోవచ్చు. పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ప్రైవేట్ సంస్థలకు విద్యుత్‌ను విక్రయించవచ్చు. తద్వారా మీకు భారీగా ఆదాయం వస్తుంది.

  Price Cut: గుడ్ న్యూస్... లీటర్‌పై రూ.20 వరకు తగ్గింపు... ఇంటి బడ్జెట్‌పై తగ్గిన భారం

  Solar power system for house, solar system for home in india government subsidy, solar power system for home price, solar system for home price in india, 1kw solar system for home price in india, 3kw solar system for home price in india, solar plant for home government subsidy, సోలార్ పవర్ సిస్టమ్, సోలార్ పవర్ యూనిట్, సౌర విద్యుత్ యూనిట్, సౌర విద్యుత్ ఎలా ఏర్పాటు చేయాలి, ఇంటికి సోలార్ పవర్
  (ప్రతీకాత్మక చిత్రం)

  Gold Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..

  సోలార్ ప్యానెళ్లను కొనుగోలు చేయడానికి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అథారిటీని సంప్రదించవచ్చు. లేదంటే ప్రైవేట్ కంపెనీలు, డీలర్ల వద్ద కూడా సౌర పలకను కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పుపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే... రోజుకు దాదాపు 10 యూనిట్ల చొప్పున.. నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మీరు 100 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తే... 1500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు మీ అవసరాలకు వాడుకొని.. మిగతా కరెంటును అమ్ముకోవచ్చు.గతంలో సోలార్ ప్లాంట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం చొరవ తీసుకోవడంతో రుణాలను మంజూరు చేస్తున్నాయి. సోలార్ ప్యానెళ్ల జీవితకాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. లోన్ తీసుకొని పెద్ద మొత్తంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. నెలకు ఈజీగా లక్ష రూపాయలు సంపాదించవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు