మీకు ఉద్యోగం లేదా? బిజినెస్ చేయడానికి పెట్టుబడి లేదా? తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఐతే అందుకు అగర్ బత్తీల వ్యాపారం సరైనది నిపుణులు చెబుతున్నారు. దాదాపు ప్రతి ఇళ్లలో అగరబత్తీలు వినియోగిస్తారు. ప్రతి రోజూ పూజ చేసే సమయంలో దేవుడి విగ్రహాలు, చిత్రపటాల ముందు అగరబత్తీలను వెలిగిస్తారు. అందుకే వీటికి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. అగరబత్తుల వ్యాపారం తక్కువ డబ్బుతో ప్రారంభమవుతుంది. మన అగర్బత్తి తయారీ యంత్రం ధర రూ. 35000 నుంచి రూ. 175000 వరకు ఉంటుంది. ఈ యంత్రంతో మీరు 1 నిమిషంలో 150 నుండి 200 అగరుబత్తీలను తయారు చేయవచ్చు. అగర్బత్తి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ముడిపదార్థాలు ఏమేం అవసరం? ఎంత ఆదాయం వస్తుంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే.. భారీగా పడిపోయిన బంగారం రేటు
అగరబత్తిని తయారు చేయడానికి ముందుగా యంత్రాలు అవసరం. ఇందులో అనేక రకాల యంత్రాలను ఉపయోగిస్తారు. మిక్సర్, డ్రైయర్, ప్రధాన ఉత్పత్తి యంత్రం ఉన్నాయి. మిక్సర్ యంత్రం ముడి పదార్థాన్ని పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రధాన ఉత్పత్తి యంత్రం వెదురుపై పేస్ట్‌ను చుట్టడానికి పని చేస్తుంది. చివరిది డ్రైయర్.. ఇది అగర్బత్తీలను ఆరబెడుతుంది. అగర్బత్తి తయారీ యంత్రాలు కూడా సెమీ నుంచి పూర్తిగా ఆటోమేటిక్ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన యంత్రంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. లాభం కూడా తక్కువగా వస్తుంది. అందుకే ఆటోమేటిక్ మెషీన్‌తో చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ అంగర్బత్తీలను తయారు చేయవచ్చు. ఆటోమేటిక్ యంత్రం ధర 90000 నుంచి 175000 రూపాయల వరకు ఉంటుంది. ఆటోమేటిక్ మెషీన్ ఒక రోజులో 100 కిలోల అగరుబత్తీలను తయారు చేస్తుంది.
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో ఈ వివరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు
అగర్బత్తీ తయారీ మెషీన్‌ను ఎంచుకున్న తర్వాత.. ముడి సరుకుపై దృష్టిపెట్టాలి. ముడిసరుకు సరఫరా కోసం మార్కెట్లోని మంచి సరఫరాదారులను సంప్రదించాలి. ఏదైనా అగర్బత్తి పరిశ్రమలో వ్యాపారం చేస్తున్న వ్యక్తుల నుంచి సహాయం తీసుకోవచ్చు. ముడి పదార్థాన్ని ఎల్లప్పుడూ అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి. ఎందుకంటే దానిలో కొంత భాగం వృధా అవుతుంది. అగరబత్తుల తయారీకి గమ్ పౌడర్, బొగ్గు పొడి, వెదురు, నర్గీస్ పౌడర్, సుగంధ నూనె, నీరు, సెంట్లు, పూల రేకులు, గంధపు అమ్మాయి, జిలాటిన్ పేపర్, షా డస్ట్, ప్యాకింగ్ మెటీరియల్ వంటి పదార్థాలు అవసరమవుతాయి. వీటిని సరఫరా చేసే కంపెనీల వివరాలను ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి.
అగరబత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి. బొగ్గు పొడి 1 కిలో- రూ. 13, జిగాట్ పౌడర్ 1 కిలో 60 రూపాయలు , వైట్ చిప్స్ పౌడర్ 1 కిలో 22 రూపాయలు, చందనం పొడి 1 కిలో 35 రూపాయలు, వెదురు కర్ర 1 కిలో 116 రూపాయలు, పెర్ఫ్యూమ్ 1 ముక్క 400 రూపాయలు, DEP 1 లీటర్ 135 రూపాయలు, పేపర్ బాక్స్ 1 డజన్ 75 రూపాయలు, చుట్టే పేపర్ 1 ప్యాకెట్ రూ. 35, కుప్పం డస్ట్ 1 కిలో రూ.85కి లభిస్తున్నాయి.
మీరు ఉపయోగించే యంత్రాన్ని బట్టి అగరుబత్తీలు తయారీకి పట్టే సమయం మారుతుంది. ఆటోమేటిక్ మెషీన్‌ని ఉపయోగిస్తే.. 1 నిమిషంలో 150 నుండి 200 అగరుబత్తీలను తయారు చేయవచ్చు. ఒకవేళ మాన్యువల్ మెషీన్ లేదా చేతితో తయారు చేయాలనుకుంటే తక్కువ సంఖ్యలో అగరబత్తీలు వస్తాయి. ఎంత అనేది సిబ్బంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇంట్లో కూడా 13,000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కానీ ఆటోమెటిక్ మెషీన్‌తో అగరబత్తీలు తయారీ ప్రారంభించాలనుకుంటే.. అన్ని ఖర్చులతో కలిపి రూ. 5 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది.
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓలో పాలసీ హోల్డర్స్, ఉద్యోగులకు రాయితీ.. మెగా పబ్లిక్ ఆఫరింగ్ వివరాలిలా
అగర్బత్తీలు తయారుచేసిన తర్వాత ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారుల దృష్టిలో పడాలంటే ప్యాకింగ్ కూడా ఎంతో ముఖ్యం. ప్యాకింగ్ కోసం మంచి ప్యాకేజింగ్ నిపుణుడిని సంప్రదించండి. ప్రజల మతపరమైన మనోభావాలను స్పృశించేలా అది ఉండాలి. అప్పుడే మీ ఉత్పత్తిని కొనేందుకు ముందుకొస్తారు. అగరుబత్తీలను మార్కెట్ చేయడానికి.. వార్తా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వొచ్చు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా వద్దనుకుంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. లేదంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఆన్లైన్ వేదికల్లోనూ విక్రయించవచ్చు. ఐతే ఇతర వ్యాపారాలతో పోల్చితే ఇందులో మార్జిన్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఏటా 30 లక్షల వార్షిక వ్యాపారం చేస్తే అంటే 10శాతం లాభం ఉంటుంది. ఖర్చులన్నీ పోగా.. 3 లక్షలు సంపాదించవచ్చు. అంటే ప్రతి నెలా 25 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Personal Loan