హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఈ బిజినెస్ ట్రై చేసి చూడండి.. తక్కువ సమయంలోనే లక్షాధికారులవడం పక్కా

Business Ideas: ఈ బిజినెస్ ట్రై చేసి చూడండి.. తక్కువ సమయంలోనే లక్షాధికారులవడం పక్కా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. అదే సేంద్రీయ ఎరువుల తయారీ. మరి పెట్టుబడి ఎంత? ఆదాయం ఎంతొస్తుంది? ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.

ఇంకా చదవండి ...

  ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలను వదిలిపెట్టి.. వ్యవసాయం (Agriculture) వైపు అడుగులు వేస్తున్నారు. అది కూడా సేంద్రీయ వ్యావసాయానికి (Organic Farming) ప్రాధాన్యత ఇస్తున్నారు. క‌ృత్రిమ ఎరువులతో పండించిన పండ్లు, కూరగాయలు తింటే రోగాలు వస్తున్నాయని.. జనాలు కూడా సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులను కొంటున్నారు. రేటు ఎక్కువైనా సరే వాటినే తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మీరు కూడా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. అదే సేంద్రీయ ఎరువుల తయారీ.

  hatsApp: వాట్సప్ నుంచి మీకు డబ్బులు వస్తాయి... ఇలా చేయండి

  మారుతున్న జీవనశైలిని సేంద్రీయ ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సేంద్రియ ఎరువు వాడకం వల్ల పంట నాణ్యతను మెరుగవడమే కాదు.. భూమిలో సత్తువ కూడా పెరుగుతుంది. భూములు సారవంతమవుతాయి. సేంద్రియ ఎరువుతో పండించిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన పండ్లు, కూరగాయలు తింటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ మధ్య చాలా మంది ఆర్గానిక్ ఫుడ్‌పై దృష్టిసారించారు. మార్కెట్‌లో ఆర్గానిక్ పంట ఉత్పతులకు డిమాండ్‌తో పాటు రేటు ఎక్కువగా ఉండడంతో.. రైతులు కూడా సేంద్రియ ఎరువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి సేంద్రీయ ఎరువుల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసా?

  సేంద్రీయ ఎరువుల వ్యాపారానికి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. లేదంటే చిన్న స్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. చిన్న స్థాయిలో సేంద్రీయ ఎరువుల వ్యాపారానికి రూ.1-5 లక్షలు కావాలి. సేంద్రీయ ఎరువు తయారీ కోసం ఖాళీగా ఉండే ఏదేని భూమి కావాలి. ఆ తర్వాత కొన్ని యంత్రాలు కావాలి. ఇందులో బయో రియాక్టర్, బయో ఫెర్మెంటర్, ఆటో క్లేవ్, బాయిలర్, ఆర్‌ఓ ప్లాంట్, కంపోస్ట్ కుట్టు యంత్రం, కంప్రెసర్, ఫ్రీజర్, కన్వేయర్లు వంటివి ఉంటాయి. సేంద్రీయ ఎరువును తయారు చేయడానికి మీకు గొర్రెల ఎరువు, కోళ్ల ఎరువు, ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, రాక్ ఫాస్ఫేట్ ముడి పదార్థంగా అవసరం అవుతాయి. ఎరువుల తయారీ ప్లాంట్‌కు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తోపాటు ఎరువుల లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.

  Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ఆలోచన ఉందా..? అయితే ఇంతకంటే మంచి తరుణం ఉండదు.. కారణం ఏంటంటే..

  సేంద్రీయ ఎరువులతో (Organic Fertilizers) ఎంత ఆదాయం వస్తుందనేది.. మీ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పెద్ద పరిశ్రమ అయితే.. ఎక్కువ లాభం వస్తుంది. చిన్న స్థాయిలో స్టార్ట్ చేస్తే.. కాస్త తక్కువ ఉంటుంది. సేంద్రీయ ఎరువుల వ్యాపారంలో మీరు ఖర్చుపై 20-21 శాతం లాభం పొందవచ్చు. అంటే మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే.... మొత్తం సంపాదన రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. అందులో ఖర్చులన్నీ పోను.. నికర లాభం రూ. 1 లక్ష వరకు వస్తుంది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు