Business Ideas: లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడంతో పాటు, నెమ్మదిగా ప్రజా జీవితం మామూలు స్థితికి వస్తోంది. అయితే కరోనా కాలంలో ఉద్యోగాలకు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాల ద్వారా వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేకాదు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం పీఎం స్వనిధి స్కీం కింద రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాలతో మీరు స్ట్రీట్ వెండర్ గా మారి డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది స్ట్రీట్ వెండర్ పని చాలా చిన్న చూపు చూస్తుంటారు. కానీ ఇందులో ఆదాయం చాలా ఉంటుందని ఎంతో మంది అనుభవ పూర్వకంగా చెబుతున్నారు. ప్రస్తుతం స్విగ్గీ లాంటి సంస్థలు సైతం స్ట్రీట్ వెండర్స్ తో చేతులు కలిపి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందిస్తోంది. అయితే ప్రస్తుతం బార్బిక్యూ అనే కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఇది కొత్త తరహా వ్యాపారం అనే చెప్పవచ్చు. ఇందులో మంచి లాభాలు పొందే వీలుంది. అంతేకాదు ప్రస్తుతం వ్యాపారానికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా నగరాల్లో ఈ వ్యాపారానికి డిమాండ్ ఉంది. ప్రధానంగా మంచి రెస్టారెంట్ స్థాయి రుచిని మనం స్ట్రీట్ ఫుడ్ ద్వారా అందించగలిగితే చాలు మీకు లాభం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది.
ఇక ఈ స్ట్రీట్ బార్బిక్యూ వ్యాపారానికి కావాల్సిన రా మెటిరియల్...
రెండు చార్ కోల్ స్టౌలు..(బొగ్గుల కుంపటి)
బొగ్గు..
చికెన్ స్టిక్స్...
స్టెయిన్ లెస్ స్టీల్ ఫుడ్ స్టాల్...( లేదా ఫుడ్ ట్రక్)
మొత్తం ఖర్చు సుమారు రూ. 20 వేల వరకూ ఖర్చు రావచ్చు..
బిజినెస్ ప్లాన్ ఇదే...
ఈ వ్యాపారం కోసం కావాల్సింది. మీరు చేసే వంటకం పట్ల నైపుణ్యం పెంచుకోవాలి. అందుకోసం మంచి నాణ్యమైన చికెన్,అలాగే మసాలా దినుసులను వాడాలి. నిల్వ వస్తువులను వాడకూడదు. వీలైతే ఫుడ్ ట్రక్ మోడల్ ద్వారా కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మంచి చోటు చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అంతేకాదు మీరు ఎంత మంచి ఫుడ్ తయారు చేస్తే అంత లాభం వస్తుంది.

ప్రతీకాత్మకచిత్రం
ఎవరికి సూట్ అవుతుంది...
ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు సాయంత్రం ఓ నాలుగు గంటల పాటు కష్టపడేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ వ్యాపారం చేయవచ్చు.
లాభం ఎంత...
ఇందులో లాభం విషయానికి వస్తే...మీరు రోజు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోనూ ఇందులో సుమారు 40 శాతం వరకూ లాభం లభిస్తుంది. సాయంత్రం వేళల్లో ఈ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంటుంది.
బిజినెస్ టిప్...
ఈ వ్యాపారాన్ని ఐటీ కంపెనీలు, అలాగే కాలేజీల సమీపంలో ఏర్పాటు చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది. దీంతో పాటు క్యాటరింగ్ సర్వీసులతో ఒప్పందాలు చేసుకుంటే, లైవ్ కిచెన్ ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు.
ధరలు ఇలా...
ఒక చికెన్ వింగ్స్ ఒక స్టీక్ 100 రూపాయలు చార్జ్ చేయవచ్చు. అలాగే ఒక స్టీక్ కు మూడు లెగ్ పీసులు సర్వ్ చేయడం ద్వారా మరో వంద రూపాయలు, బోన్ లెస్ కబాబ్ రూ.100 లకు 3 స్టీక్స్, తందూరి చికెన్ ఒక స్టీక్ రూ.50 వరకూ చార్జ్ చేయవచ్చు. ఈ లెక్కన రోజుకు 5 వేల నుంచి 10 వేల వరకూ సంపాదించవచ్చు. ఇక వీకెండ్స్ లో మరింత ఎక్కువగా సంపాదన ఉంటుంది. ఈ లెక్కన దాదాపు మీరూ. నెలకు 50 వేల నుంచి రూ. 1 లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు.