Business Ideas: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ టీషర్టులు వేసుకోవడం సర్వ సాధారణమైంది. తక్కువ పెట్టుబడితో టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేయడం ఒక చిన్నపాటి బిజినెస్ గా మారింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ కోసం, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం, కార్పొరేట్ ప్రమోషన్స్ కోసం, స్పోర్ట్స్ కోసం, పొలిటికల్ ర్యాలీలు, 5కె, 2కె రన్, గణేష్ ఉత్సవాల ఊరేగింపులు, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో టీ షర్ట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి టీషర్ట్స్‌పై ఫ్రింట్ చేసే మిషన్ రూ.12 వేల నుండి రూ.18 వేల లోపు మాత్రమే ఖర్చు అవతుంది. పెద్ద ఎత్తున టీషర్ట్లు ఆర్డర్ వస్తే రూ.75 వేల నుండి రూ.లక్ష విలువ కలిగి ఉన్న మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం టీషర్ట్లపైనే కాకుండా ప్లేట్లపై, మగ్స్‌పై, తలకు పెట్టుకునే టోపీలపై కూడా ప్రింటింగ్ వేయడానికి ఆర్డర్లు తెచ్చుకుంటే మరంత ఆదాయం వస్తుంది. అలాగే సెల్‌ఫోన్ కవర్లపై, గిఫ్ట్ ఆర్టికల్స్‌పై కూడా ఫ్రింటిగ్స్ చేసే అవకాశం ఉంది. మహిళలు ఇంటి వద్ద ఉండి ఉపాధి పొందే మార్గం ఇది.
మార్కెటింగ్ కోసం ఆన్లైన్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయించవచ్చు. గూగల్ సెర్చ్‌లో ఇండియామార్ట్ వెబ్సైట్లో క్లిక్ చేస్తే సెర్చిబార్లో టీషర్ట్ ఫ్రింటింగ్ మిషన్లు అవి ఎక్కడ దొరుకుతాయి వాటి ధర మన్నిక లాంటి విషయాలు తెలుస్తాయి.
లాభం పొందండిలా...
- ఈ బిజినెస్ లో ప్రతి నెల రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకూ సంపాదించుకోవచ్చు.
- టీ షర్ట్ ప్రింటింగ్ కోసం టెఫ్లాన్ షీట్ ఖరీదు రూ.400, సబ్లిమేషన్ టేప్ ఖరీదు రూ. 200
- ప్రింటింగ్ మెషీన్ ధర్ రూ. 13వేల నుంచి ప్రారంభమవుతుంది.
- సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇంక్ ధర రూ. 2000 ఉంటుంది.
- టీషర్ట్స్ ధర రూ. 30 నుంచి రూ.150 మధ్య క్వాలిటీని బట్టి బల్క్ గా లభిస్తుంటాయి.
- మొత్తం పెట్టుబడి రూ. 50 వేల లోపే ఉంటుంది.
- ప్రింటింగ్ అయిన తర్వాత టీషర్ట్ విలువ. మార్కెట్లో రూ.250 నుంచి రూ.500 వరకూ పలుకుతుంది.
- మార్కెట్ లో టీషర్టు అమ్మకాలను ఆన్ లైన్ ద్వారాను, లేదా ఆఫ్ లైన్ ద్వారాను చేయవచ్చు.
- అంతేకాదు ఈవెంట్స్ ద్వారా ఆర్డర్లు తెచ్చుకొని ప్రింట్స్ వేసి అమ్మవచ్చు.
- ఒక్కో టీషర్ట్ మీద ప్రింటింగ్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి.
- ఉదాహరణకు ఒక ప్లేన్ టీషర్టు విలువ రూ. 100 ఉంటే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత మార్కెట్లో రూ.200 దాకా పలుకుతుంది. అంటే డబుల్ లాభం వస్తుంది. ఈ లెక్కన వంద టీషర్టులను విలువ రూ.10 వేలు అయితే వాటిని ప్రింట్ చేసి మార్కెట్లో అమ్మితే రూ.20 వేలు మీకు వస్తాయి. అంటే మీ లాభం సుమారు రూ. 10 వేలు దాకా రావచ్చు. ఇతరత్రా ఖర్చులు తీసివేసినా. కనీసం రూ. 8 వేలు మీకు మిగిలే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు కనీసం రూ. 50 వేల నుంచి రూ.1 లక్ష దాకా ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లే.
బిజినెస్ టిప్: ఈవెంట్ మేనేజ్ మెంట్ ఒప్పందం కుదుర్చొని ముందస్తు బల్క్ ఆర్డర్స్ తెచ్చుకొని ప్రింట్స్ వేసి ఇస్తే మీకు కంటిన్యూగా ఆదాయం వస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.