హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రూ.10వేల పెట్టుబడితో అద్భుతమైన వ్యాపారం.. ప్రతి నెలా రూ.50వేల ఆదాయం

Business Ideas: రూ.10వేల పెట్టుబడితో అద్భుతమైన వ్యాపారం.. ప్రతి నెలా రూ.50వేల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas | Pollution check center: కాలుష్య తనిఖీ కేంద్రాన్ని తెరవాలంటే ముందుగా స్థానిక రవాణా కార్యాలయం (RTO) నుంచి లైసెన్స్ పొందాలి. అందుకోసం మీ సమీపంలోని RTO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనిని పెట్రోల్ పంప్, ఆటోమొబైల్ వర్క్‌షాప్ వద్ద ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

  మీకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదా? వ్యాపారం చేద్దామంటే పెట్టుబడికి (Business Investment) డబ్బులు లేవా? మరేం పర్లేదు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే వ్యాపారలు చాలానే ఉన్నాయి. అందులో పొల్యూష్ చెకింగ్ సెంటర్ ఒకటి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మోటారు వాహనాల చట్టం కారణంగా.. కాలుష్య పరీక్ష కేంద్రాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి పెట్టుబడి ఎక్కువగా అవసరం లేదు. తక్కువ డబ్బుతోనే ప్రారంభించవచ్చు. రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. లాభాలు మాత్రం బాగా ఉంటాయి. నెలా నెలా అదిరిపోయే ఆదాయం వస్తుంది.

  బైక్ లేదా ఇతర వాహనాలు కలిగిన ప్రతి పౌరుడికి పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం.. పొల్యూషన్ సర్టిఫికేట్ (Pollution Under control Certificate)  లేని వారికి భారీ జరిమానా పడుతుంది. ఎవరైనా వ్యక్తి పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) లేకుండా.. వాహనాన్ని నడుపుతూ.. పట్టుబడితే వారికి రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు. నడిపేది చిన్న వాహనమైనా.. పెద్ద వాహనమైనా... పొల్యూషన్ సర్టిఫికేట్ పత్రాన్ని మాత్రం తప్పకుండా తీసుకోవాలి. లేదంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాహనదారులు పొల్యూషన్ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కాలుష్య పరీక్షా కేంద్రాన్ని తెరవడం ద్వారా బాగా డబ్బు సంపాదించవచ్చు.

  Credit Card Rules: ఆ విషయంలో ఆలస్యం జరిగితే రోజూ రూ.500 చెల్లించనున్న బ్యాంకులు

  కేవలం 10 వేల రూపాయల పెట్టుబడితోనే పొల్యూషన్ చెక్ కేంద్రాన్ని (Mobile Checking Centers)  ప్రారంభించవచ్చు. ఇందుకోసం గది ఉండాల్సిన అవసరం లేదు. వాహనాల్లో కూడా మొబైల్ పొల్యూషన్ చెక్ కేంద్రం నడుపుకోవచ్చు. రోడ్డుపక్కల ఇలాంటివి మనం చూస్తుంటాం. కాలుష్య పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన తొలి రోజు నుండి ఈ వ్యాపారంలో మీ సంపాదన ప్రారంభమవుతుంది. ఇందులో మీరు రోజుకు 1-2 వేల రూపాయలు సంపాదించవచ్చు. తద్వారా ప్రతి నెలా 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.

  Kia Electric Car: కియా నుంచి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యే

  కాలుష్య తనిఖీ కేంద్రాన్ని తెరవాలంటే ముందుగా స్థానిక రవాణా కార్యాలయం (RTO) నుంచి లైసెన్స్ పొందాలి. అందుకోసం మీ సమీపంలోని RTO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనిని పెట్రోల్ పంప్, ఆటోమొబైల్ వర్క్‌షాప్ వద్ద ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కాకుండా స్థానిక అధికారల యంత్రాంగం నుంచి నో అబ్జెక్షన్ సెంటర్ (NOC) తీసుకోవలసి ఉంటుంది. కాలుష్య తనిఖీ కేంద్రాలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రుసుము ఉంటుంది. మీరు కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు