హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: నిమ్మగడ్డితో అనూహ్య లాభాలు.. రూ.20వేల పెట్టుబడితో.. రూ.4 లక్షల ఆదాయం

Business Ideas: నిమ్మగడ్డితో అనూహ్య లాభాలు.. రూ.20వేల పెట్టుబడితో.. రూ.4 లక్షల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: ఒక సంవత్సర కాలంలో హెక్టారు పంట నుంచి 325 లీటర్ల మేర నిమ్మగడ్డి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ నూనెను మార్కెట్లో 1200-1500 విక్రయింవచ్చు. తద్వారా రూ.4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో.. తక్కువ పెట్టుబడితో.. చేయగలిగే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. సొంత ఊరిలో వ్యవసాయం చేస్తూనే.. లక్షలు సంపాదించవచ్చు. ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉద్యోగం (Business Ideas) మానేసి... చక్కగా పొలం పనులు చేసుకుంటున్నారు. జాబ్‌లో వచ్చే శాలరీ కంటే.. ఇంకా ఎక్కువే ఆర్జిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య.. గ్రామీణ వాతావరణంలో.. హాయిగా బతుకుతున్నారు. ఐతే సంప్రదాయ పంటలు కాకుండా... వాణిజ్య పంటలు పండిస్తే.. మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే దీనిని సాగుచేయవచ్చు.

Business Ideas: ఈ పంటను పండిస్తే రైతులకు భారీగా లాభాలు.. 6 నెలల్లో రూ.10 లక్షలు పక్కా..!

లెమన్‌గ్రాస్‌ (Lemon Grass Farming) నుంచి వచ్చే నూనెకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. నిమ్మగడ్డి నూనెను సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దీనికి మార్కెట్‌లో మంచి ధర రావడానికి ఇదే కారణం. నిమ్మగడ్డి సాగులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దీనిని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా నాటవచ్చు. బంజరు భూమిల్లో కూడా పండించవచ్చు. నిమ్మగడ్డి సాగుతో కేవలం ఒక హెక్టారుతో ఏడాదికి దాదాపు 4 లక్షల రూపాయల లాభం పొందవచ్చు.

Stock Market: 5 రూపాయల స్టాక్ అద్భుతాలు చేసింది.. లక్షకు రెండున్నర కోట్ల లాభం

నిమ్మగడ్డిని నాటడానికి ఫిబ్రవరి-జూలై ఉత్తమైన సమయం. ఒకసారి నాటితే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు కోత కోస్తారు. గడ్డి నుంచి సువాసన వస్తుందంటే.. అది కోతకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. నిమ్మగడ్డిని కోసిన తర్వాత దానిని నుంచి నూనెను వెలికి తీయాలి. మీరు నిమ్మగడ్డిని మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఎండిన తర్వాత పొడి చేసి అమ్ముకోవచ్చు. లేదంటే నూనె తీసే యంత్నాన్ని కొనుగోలు చేసి.. నిమ్మగడ్డి నుంచి నూనె తీయవచ్చు. నిమ్మగడ్డి నూనెతో ఎంతో సువాసనతో ఉంటుంది. ఆ నూనెను మార్కెట్లో విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయి. ప్రస్తుతం ఒక లీటర్ నిమ్మగడ్డి నూనె ధర రూ.1000-1500 పలుకుతోంది.

ఒక హెక్టారు భూమిలో నిమ్మగడ్డిని సాగు చేస్తే మొదట్లో రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. ఒకసారి పంట వేస్తే.. ఆరేళ్ల వరకు మనం నిమ్మగడ్డిని కోయవచ్చు. ఏటా మూడు లేదా నాలుగు సార్లు పంట చేతికి వస్తుంది. ఒక్కో కోతకు 100 నుంచి 150 లీటర్ల నూనె వస్తుంది. మొత్తంగా ఒక సంవత్సర కాలంలో హెక్టారు పంట నుంచి 325 లీటర్ల మేర నిమ్మగడ్డి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ నూనెను మార్కెట్లో 1200-1500 విక్రయింవచ్చు. తద్వారా రూ.4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు. ఎక్కువ భూమిలో సాగుచేస్తే.. ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Agriculture, Business, Business Ideas, Farmers

ఉత్తమ కథలు