Home /News /business /

BUSINESS IDEAS START GINGER FARMING AND EARN UP TO RS 15 LAKHS KNOW HOW SS

Business Idea: ఈ బిజినెస్‌తో ఇంత లాభం ఉంటుందా? ఇలా చేస్తే రూ.15 లక్షల ప్రాఫిట్

Business Idea: ఈ బిజినెస్‌తో ఇంత లాభం ఉంటుందా? ఇలా చేస్తే రూ.15 లక్షల ప్రాఫిట్
(ప్రతీకాత్మక చిత్రం)

Business Idea: ఈ బిజినెస్‌తో ఇంత లాభం ఉంటుందా? ఇలా చేస్తే రూ.15 లక్షల ప్రాఫిట్ (ప్రతీకాత్మక చిత్రం)

Business Idea | కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా... తక్కువ పెట్టుబడితో వ్యాపారం (Low Investment Business) చేయాలనుకుంటున్నారా? ఓ వ్యాపారం ద్వారా రూ.15 లక్షల వరకు లాభం పొందొచ్చు. ఆ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోండి.

    కొన్ని వ్యాపారాలు చూడటానికి చిన్న బిజినెస్ లాగానే అనిపిస్తాయి. కానీ వాటిలో వచ్చే లాభాల గురించి తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. పొటాటో చిప్స్ బిజినెస్‌తో రూ.40,000 వరకు ఎలా సంపాదించొచ్చో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇలాంటి బిజినెస్ ఐడియాలు (Business Ideas) చాలానే ఉంటాయి. ఇలాంటి వ్యాపారాల గురించి లోతుగా తెలుసుకొని ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి. అలాంటిదే ఓ బిజినెస్ ఐడియా. అల్లం సాగుతో (Ginger Farming) రూ.15 లక్షల వరకు సంపాదించొచ్చు. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ప్రతీ ఇంటిలో అల్లం వినియోగం పెరిగిపోయింది. ఛాయ్ దగ్గర్నుంచి వంటల వరకు అల్లం వాడకం పెరిగిపోయింది. దీంతో అల్లానికి డిమాండ్ కూడా పెరుగుతోంది. సాధారణంగా వంటల్లో, సూప్స్‌లో, ఛాయ్‌లో అల్లం వినియోగిస్తూనే ఉంటారు. అల్లంలో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి కోవిడ్ 19 మహమ్మారి తర్వాత అల్లం వాడకం ఎక్కువైంది.

    ప్రతీ ఇంట్లో నిత్యం ఉపయోగించే అల్లానికి డిమాండ్ తగ్గదు. కాబట్టి ఇది ఎవర్‌గ్రీన్ బిజినెస్. అల్లం సాగుతో వేలల్లో కాదు... లక్షల్లో సంపాదించొచ్చు. మరి అల్లం సాగుతో మంచి బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోండి. అల్లం విత్తడానికి గతంలో వేసిన అల్లం పంట దుంపలనే ఉపయోగిస్తుంటారు. అల్లం సాగు ప్రధానంగా వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. నేరుగా అల్లం సాగు చేయొచ్చు. లేదా బొప్పాయి, ఇతర చెట్లతో కలిపి సాగు చేయొచ్చు. ఒక హెక్టారులో 12 నుండి 15 అల్లం దుంపల్ని నాటొచ్చు. అంతర పంటల సాగులో విత్తనాలు తక్కువగా ఉంటాయి.

    Business Idea: చీప్‌గా చూడొద్దు... నెలకు రూ.40,000 లాభం ఇచ్చే బిజినెస్ ఐడియా ఇది

    అల్లం నాటేప్పుడు ఒక్కో వరుసగా 30 నుంచి 40 సెంటీమీటర్లు, ఒక్కో మొక్కకు 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఇది కాకుండా మధ్య దుంపలను నాలుగైదు సెంటీమీటర్ల లోతులో విత్తిన తర్వాత తేలికపాటి మట్టి లేదా ఆవు పేడతో కప్పాలి. అల్లం పండటానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. ఒక హెక్టార్‌కు 150 నుంచి 200 క్వింటాళ్ల అల్లం పండించొచ్చు. ఒక ఎకరాలో 120 క్వింటాళ్ల అల్లం దిగుబడి వస్తుంది. ఒక హెక్టార్‌లో అల్లం పండించడానికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.

    Business Idea: కేవలం రూ.15 వేలతో వ్యాపారం... ట్రెండింగ్‌లో బిజినెస్ ఐడియా

    లాభం విషయానికి వస్తే హెక్టార్‌లో 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు అల్లం పండిస్తే మార్కెట్‌లో కిలో అల్లం రూ.80 వరకు ఉంటుంది. కనీసం రూ.50 నుంచి రూ.60 చొప్పున లెక్కేసినా హెక్టార్‌కు రూ.25 లక్షల వరకు వస్తుంది. స్థానిక మార్కెట్ల దగ్గర్నుంచి పెద్ద మార్కెట్ల వరకు అల్లం సరఫరా చేయొచ్చు. అందులో ఖర్చులు తీసేస్తే రూ.15 లక్షల వరకు లాభం ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business Ideas, Business plan, Small business

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు