BUSINESS IDEAS START GARLIC FARMING IN YOUR LAND YOU CAN EARN 10 LAKHS IN JUST 6 MONTHS SK
Business Ideas: ఈ పంటను పండిస్తే రైతులకు భారీగా లాభాలు.. 6 నెలల్లో రూ.10 లక్షలు పక్కా..!
ప్రతీకాత్మక చిత్రం
Business Ideas | Garlic Farming: ఎకరాకు రూ.40000 వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మీరు ఒక ఎకరం భూమిలో రియా అటవీ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా సులభంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
మన దేశంలో ఎంతో మంది రైతులు పెట్టిన పెట్టుబడి రాక.. నష్టపోతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐతే సంప్రదాయ పంటలు కాకుండా.. వాణిజ్య పంటలు పండిస్తే... బాగా లాభాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ పంట గురించి ఇవాళ తెలుసుకుందాం. వెల్లుల్లి సాగు (Garlic Farming)తో అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు (Business Idea) సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే 6 నెలల సమయంలోనే.. ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు. వెల్లుల్లి.. వాణిజ్య పంట. భారతదేశంలో దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సుగంధ ద్రవ్యంగానే కాకుండా..ఔషధంగానూ ఉపయోగిస్తారు. అందుకే ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది.
వెల్లుల్లిని ఊరగాయ, కూరగాయలు, చట్నీ, మసాలా రూపంలో ఉపయోగిస్తారు. అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, కీళ్లనొప్పులు, నపుంసకత్వము, రక్త వ్యాధులకు కూడా వెల్లుల్లిని వాడుతారు. యాంటీ బ్యాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఔషధాల తయారీలో కూడా వీటిని వినియోగిస్తారు. నేటి కాలంలో వెల్లుల్లిని కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా.. అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిని ప్రాసెస్ చేసి పౌడర్, పేస్ట్, చిప్స్ రూపంలో విక్రయిస్తున్నారు. తద్వారా రైతులు అధిక లాభం పొందుతున్నారు.
సాధారణంగా రైతులు వానాకాలం ప్రారంభంలో విత్తనాలు వేస్తారు. కానీ వెల్లుల్లి సాగుకు వర్షాకాలం అనుకూలమైనది కాదు. వానాకాలం ముగిసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి సాగును ప్రారంభించాలి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ పంటను సాగు చేయాలి. వెల్లుల్లిని దాని మొగ్గల నుంచి పండిస్తారు. వెల్లుల్లిలో చాలా రకాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారులను సంప్రదించి.. మంచి మేలు రకం సాగు చేయాలి. రియా వాన్ రకం వెల్లుల్లికి మార్కెట్లో మంచి రేటు ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. ఇతర వెల్లుల్లి రకాల కంటే రియావన్ నాణ్యత బాగుంటుంది. ఒక్కో వెల్లుల్లి గడ్డ 100 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్క గడ్డలో 6 నుంచి 13 మొగ్గలు ఉంటాయి.
పంట వేసిన తర్వాత.. నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. వెల్లుల్లి ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. క్వింటాల్‌కు 10000 నుంచి 21000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40000 వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మీరు ఒక ఎకరం భూమిలో రియా అటవీ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా సులభంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ప్రాసెస్ చేసి.. వెల్లుల్లి పేస్ట్, పొడి రూపంలో విక్రయిస్తే.. ఇంకా అధిక లాభాలు వస్తాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.