హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఆవు పేడతో అద్భుతమైన వ్యాపారం.. ఇంట్లో కూర్చునే నెలకు రూ. లక్ష వరకు ఆదాయం

Business Ideas: ఆవు పేడతో అద్భుతమైన వ్యాపారం.. ఇంట్లో కూర్చునే నెలకు రూ. లక్ష వరకు ఆదాయం

Cow Dung Business: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత అక్కడి రైతుల నుంచి కిలో చొప్పున పేడను కొని.. దానితో పిడకల వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మనదేశంలో చాలా మంది ఈ వ్యాపారం చేసి నెలకు రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

Cow Dung Business: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత అక్కడి రైతుల నుంచి కిలో చొప్పున పేడను కొని.. దానితో పిడకల వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మనదేశంలో చాలా మంది ఈ వ్యాపారం చేసి నెలకు రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

Cow Dung Business: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత అక్కడి రైతుల నుంచి కిలో చొప్పున పేడను కొని.. దానితో పిడకల వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మనదేశంలో చాలా మంది ఈ వ్యాపారం చేసి నెలకు రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

  హైదరాబాద్ (Hyderabad) వంటి మహానగరాల్లో ఉండే వారికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ.. పల్లెల్లో ఉండే వారికి పేడ (Dung) గురించి బాగా తెలుసు. రోడ్లపైనే కుప్పలు కుప్పలుగా పేడ కనిపిస్తుంది. గ్రామాల్లో రైతులు పంట పొలాలతో పాటు పాడిపశువులను కూడా పెంచుతారు. అందుకే పల్లెటూర్లలో పశువుల పేడ విరివిగా లభిస్తుంది. రోడ్ల మీద.. వీధుల్లో.. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఆ పేడను ఇంటి ముందు కల్లాపి చల్లడానికి చాలా మంది వాడుతారు. కొందరైతే ఎరువుగా ఉపయోగించి పొలాల్లో చల్లుతారు. ఐతే చాలా మంది ఇప్పటికీ పశువుల పేడను పనికి రాని దానిగా భావిస్తున్నారు. కానీ పేడతో లక్షలు (Cow Dung Busiess) సంపాదిస్తున్న వారు మనదేశంలో చాలా మందే ఉన్నారని మీకు తెలుసా..?

  హిందువులు ఆవును దేవతగా కొలుస్తారు. అందుకే ఆవు మూత్రంతో పాటు పేడ (Cow Dung)ను కూాడా పవిత్రమైనదిగా భావిస్తారు. మార్కెట్లో ఆవు పేడతో తయారుచేసిన పిడకలకు మంచి డిమాండ్ ఉంది. పూజల్లో భాగంగా చేసే యజ్ఞాలు, హోమాల్లో పిడకలను వాడుతారు.ఇంట్లో పిడకలతో పొగ వేస్తే క్రిమికాటకాలు రావని విశ్వసిస్తారు. అందుకే చాలా మంది పిడకలను కొంటారు. పట్టణాలు, నగరాల్లో అందులో బాటులో ఉండవు. అందువల్ల అలాంటి వారి కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈకామర్స్ సైట్లలోనే పిడకలను విక్రయిస్తున్నారు. పరిమాణం, నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మంచి నాణ్యమైన పిడకల ధర రూ. 150-300 వరకు పలుకుతోంది. మరికొందరేమో 10 పిడకలను, 20 పిడకలను ప్యాక్ చేసి అమ్ముతున్నారు.

  Business Ideas: తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అదిరిపోయే ఐడియా ఇదిగో

  పిడకలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. పలు కంపెనీలు గ్రామీణ ప్రాంతాల మహిళల నుంచి పిడకలను తమకు నచ్చిన విధంగా చేయించుకొని.. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో మహిళలే గ్రూప్‌లుగా ఏర్పడి.. పిడకలను తయారుచేసి వారే స్వయంగా విక్రయిస్తున్నారు.కేవలం పిడకలు మాత్రమే కాదు.. పేడతో దీపాలు, కుండీలు, విగ్రహాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మహిళల సాధికారత కోసం గోధన్ న్యాయ్ యోజన వంటి పథకాలను తీసుకొచ్చింది. పేడతో ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటీవల ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పేడతో తయారుచేసిన సూట్‌కేసులోనే బడ్జెట్ ప్రతులను అసెంబ్లీకి తీసుకెళ్లారు.

  Crude Oil: భలే మంచి చౌక బేరం.. రష్యా నుంచి ముడి చమురు.. డిస్కౌంట్ ఎంతో తెలుసా?

  మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంట్లో కూర్చునే పిడకలను తయారుచేసి.. మార్కెట్లో విక్రయించవచ్చు. చూడచక్కని డిజైన్‌లో... పరిశుభ్రమైన.. నాణ్యమైన పిడకలను చేసి.. ఆన్‌లైన్ వేదికగా కూడా అమ్మవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత అక్కడి రైతుల నుంచి కిలో చొప్పున పేడను కొని.. దానితో పిడకల వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మనదేశంలో చాలా మంది ఈ వ్యాపారం చేసి నెలకు రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు