హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఈ బిజినెస్‌తో రోజుకు ఈజీగా రూ.4వేల ఆదాయం.. ఇలా స్టార్ట్ చేయండి

Business Ideas: ఈ బిజినెస్‌తో రోజుకు ఈజీగా రూ.4వేల ఆదాయం.. ఇలా స్టార్ట్ చేయండి

Business Ideas | Corn flakes Unit: ఈ బిజినెస్‌తో రోజుకు రూ.4వేలు సంపాదించవచ్చు. కాస్త దృష్టి పెట్టి వ్యాపారం బాగా చేస్తే.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. దీనికి పెద్దగా శిక్షణ కూడా అవసరం లేదు.

Business Ideas | Corn flakes Unit: ఈ బిజినెస్‌తో రోజుకు రూ.4వేలు సంపాదించవచ్చు. కాస్త దృష్టి పెట్టి వ్యాపారం బాగా చేస్తే.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. దీనికి పెద్దగా శిక్షణ కూడా అవసరం లేదు.

Business Ideas | Corn flakes Unit: ఈ బిజినెస్‌తో రోజుకు రూ.4వేలు సంపాదించవచ్చు. కాస్త దృష్టి పెట్టి వ్యాపారం బాగా చేస్తే.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. దీనికి పెద్దగా శిక్షణ కూడా అవసరం లేదు.

  మీరు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? తక్కువ పెట్టుబడితే.. ఎలాంటి శిక్షణలేని.. బాగా లాభాలు తెచ్చే బిజినెస్ గురించి వెతుకుతున్నారా? మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. దీని ద్వారా మీరు రోజుకు రూ.4వేలు సంపాదించవచ్చు. కాస్త దృష్టి పెట్టి వ్యాపారం బాగా చేస్తే.. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. దీనికి పెద్దగా శిక్షణ కూడా అవసరం లేదు. అదే కార్న్‌ఫ్లేక్స్ వ్యాపారం. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

  కార్న్‌ఫ్లేక్స్ వ్యాపారం ప్రారంభించేందుకు కొన్ని యంత్రాలు, నిల్వ చేసుకునేందుకు గిడ్డంగి కావాలి. అందుకోసం 2000 నుంచి 3000 చదరపు అడుగుల స్థలాన్ని అవసరం ఉంటుంది. మెషినరీతో పాటు విద్యుత్ సదుపాయం, GST నంబర్, ముడిసరుకును సిద్ధంగా ఉంచుకోవాలి. మొక్కజొన్నలు బాగా పండే ప్రాంతంలో కార్న్‌ఫ్లేక్స్ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది. దూరప్రాంతం నుంచి మొక్కజొన్న తెచ్చి వాటి కార్న్‌ ఫ్లేక్స్‌ చేస్తే సమయంతో పాటు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే దిగుబడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తే లాభ దాయకంగా ఉంటుంది.

  Business Ideas: రైతులకు వరం.. పచ్చని పొలాల్లో పసందైన వ్యాపారం.. రూ.10 లక్షల ఆదాయం

  మీడియా కథనాల ప్రకారం.. ఒక కిలో కార్న్ ఫ్లేక్స్ తయారీకి దాదాపు రూ. 30 ఖర్చు అవుతుంది. మార్కెట్‌లో ఈజీగా కిలో రూ. 70కి అమ్ముడవుతోంది. ఒక రోజులో 100 కిలోల కార్న్ ఫ్లేక్స్ అమ్మితే.. రూ.7వేల వరకు డబ్బు వస్తుంది. అందులో తయారీ ఖర్చులు రూ.30వేలు పోగా... దాదాపు రూ. 4000 లాభం వస్తుంది. ఇలా నెలకు రూ. 1,20,000 వరకు సంపాదించుకోవచ్చు.

  ఐతే కార్న్‌ఫ్లేక్స్ తయారీ యూనిట్‌కు ఎంత ఖర్చవుతుందన్నది.. మీరు పెట్టే యూనిట్‌ను బట్టి ఉంటుంది. చిన్నస్థాయిలో ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చవుతుంది. అదే పెద్దస్థాయిలో పెడితే ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. కార్న్‌ఫ్లేక్స్ యూనిట్‌కు ప్రారంభంలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐతే దీనికి ముద్ర పథకం కింద రుణ సదుపాయం కూడా ఉంది.

  ఈ స్టార్టప్‌కు కేంద్ర ప్రభుత్వం 90శాతం వరకు రుణాలు ఇస్తుంది. అంటే ప్రారంభంలో మీరు కేవలం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మిగిలిన డబ్బు ప్రభుత్వం నుంచి రుణం రూపంలో లభిస్తుంది.

  ఫ్లిప్‌కార్ట్‌ లో ఆఫర్ల జాతర.. ఈ స్మార్ట్‌ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. వివరాలివే

  వ్యాపారం బాగా జరిగితే..యూనిట్ పెట్టిన తొలి ఏడాదిలోనే పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది.   ఆ తర్వాత ఏడాది నుంచి వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. అప్పుడు మీకొచ్చే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఈ వ్యాపారం చేస్తూ కోట్లల్లో సంపాదించే వారు కూడా చాలా మంది ఉన్నారు. పక్కా ప్రణాళికతో.. క్రమశిక్షణతో.. బిజినెస్ చేస్తే.. మీరు కూడా కోట్లు సంపాదించవచ్చు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు