Business Ideas: నష్టాలే లేని వ్యాపారం... తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు

నష్టాలే లేని వ్యాపారం... తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: కొన్ని కొన్ని వ్యాపారాలు ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. వాటిలో పెట్టుబడి చాలా తక్కువ సరిపోతుంది. లాభాలు మాత్రం భారీగా ఉంటాయి. పోటీ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ఓ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.

  • Share this:
    Business Ideas: మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే... తక్కువ పెట్టుబడిలోనే స్టార్ట్ చేసి... భారీ లాభాలు పొందాలి అనుకుంటే... ఈ వ్యాపారం మీకు బాగా సెట్ అవుతుంది. వ్యాపారం ఏంటంటే... "కొబ్బరిపొడి తయారీ ప్లాంట్" ఈ రోజుల్లో ఇదో మంచి వ్యాపారంగా పేరుంది. ఎందుకంటే... కొబ్బరి మన దేశంలో బాగా లభిస్తుంది. ఆలయాల్లో రోజూ వందల కొద్దీ కొబ్బరి కాయలు లభిస్తాయి. సౌత్ ఇండియాలో కొబ్బరి చెట్లు ఎక్కువ. అక్కడ మీకు కొబ్బరి కాయలు భారీ సంఖ్యలో లభిస్తాయి. ప్రపంచంలో కొబ్బరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా మూడోది. అందువల్ల కొబ్బరిపొడికి సంబంధించి ముడి సరుకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.

    మీకు తెలుసు... కొబ్బరిపొడిని వంటలు, స్వీట్లలో ఎక్కువగా వాడుతారు. సాధారణ కొబ్బరి కాయ కంటే... కొబ్బరిపొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి... సరుకు త్వరగా అమ్మేసుకోకపోతే పాడైపోతుందనే టెన్షన్ లేదు. మన దేశంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవడం మేలు.

    షాపుల్లో రూ.10కి కొబ్బరిపొడి ప్యాకెట్లు అమ్ముతుంటారు. లేదూ లూజు కొబ్బరి పొడి కూడా ఉంటుంది. అలాగే బేకరీలు కూడా కొబ్బరిపొడిని ఎక్కువగా వాడుతుంటాయి. అందువల్ల కొబ్బరిపొడి తయారుచేసి హోటళ్లు, షాపులు, బేకరీలకు హోల్‌సేల్ ధరకే అమ్మితే... మంచి లాభాలు వస్తాయి.

    రిజిస్ట్రేషన్:
    ఇది ఆహారానికి సంబంధించిన ప్లాంట్ కాబట్టి... రిజిస్ట్రేషన్ ముందే జరుపుకోవాలి. లైసెన్స్ ముందే పొందాలి. ఇందుకోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే... లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ అక్కడ తెలుసుకోవచ్చు.

    ముద్ర రుణాలు:
    మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది.

    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
    కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా తెచ్చింది. అందుకోసం MSME ఉద్యోగ్ ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దానికి లింక్ ఇది. (https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm) ఇక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక... స్థానిక మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందవచ్చు. అలాగే ఇది ఆహార వ్యాపారం కాబట్టి... దీనికి FSSAI లైసెన్స్ కావాలి. దీన్ని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దానికి లింక్ ఇది. https://www.fssai.gov.in ఇది పొందాక... GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏదైనా బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్ట్రాండర్స్ నుంచి BIS సర్టిఫికెట్ పొందాలి. ఈ సేవలన్నీ మీసేవ ద్వారా పొందవచ్చు.

    పెట్టుబడి:
    దీనికి పెట్టుబడి మధ్యస్థాయిలో అవసరం. ప్లాంట్, యంత్రాలు, భవనం, ఇతర ఖర్చుల కోసం పెట్టుబడి అవసరం. ఇక ముడి సరుకు, సిబ్బందికి జీతాలు, రవాణా, మార్కెటింగ్ ఖర్చులు అదనం. డబ్బు కోసం టెన్షన్ అవసరం లేదు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవచ్చు. లేదా... టెక్నాలజీ మిషన్ ఆన్ కోకోనట్ (TMOC) నుంచి కూడా లోన్ పొందవచ్చు. TMOC అనేది... కొబ్బరి అభివృద్ధి బోర్డు. ఇది ఇలాంటి వ్యాపారం చేసే వాళ్లను ప్రోత్సహిస్తుంది. దాని లింక్ ఇది. https://www.coconutboard.gov.in/



    కావాల్సిన యంత్రాలు:
    మీరు 1500 చదరపు అడుగుల స్థలంలో ప్లాంట్ ఏర్పాటుచేసుకోవచ్చు. అక్కడే కరెంటు, నీటి సదుపాయం ఉండేలా చేసుకోవాలి. మీకు హాట్ ఎయిర్ డ్రైయర్ విత్ బ్లోయర్, మోటర్ అవసరం. అలాగే... పాలిథిన్ సీలింగ్ యంత్రం కావాలి. 12 అంగుళాల డిసింటెగ్రేటర్ ఉండాలి. దానికి 10 H.P మోటర్ ఉండాలి. వైబ్రేటరీ షిఫ్టింగ్ యంత్రం కావాలి. ఇలా ఏమేం కావాలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలు ఇస్తాయి. వీటి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల దాకా పెట్టుబడి అవసరం. మీకు 40 నుంచి 45 శాతం లాభాలు వస్తాయి. మీ కొబ్బరిపొడి ఉత్పత్తిని స్థానిక సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాళ్లలో కూడా సప్లై చేస్తే... మీకు భారీ లాభాలు వస్తాయి.

    ఇది కూడా చదవండి: Business ideas: ఈ చిన్ని వ్యాపారంలో అద్భుత లాభాలు... శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ

    (Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    Published by:Krishna Kumar N
    First published: