హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా..? ఇలా వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం

Business Ideas: మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా..? ఇలా వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం

Rabbit Farming: కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. ఏడాది కాలంలోనే మీరు పెట్టుబడిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

Rabbit Farming: కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. ఏడాది కాలంలోనే మీరు పెట్టుబడిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

Rabbit Farming: కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. ఏడాది కాలంలోనే మీరు పెట్టుబడిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

    మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా? ఇంట్లో పిల్లి, కుక్క, కుందేళ్లు వంటి జంతువులను పెంచుకోవడమంటే ఆసక్తా? ఐతే మీరు వీటికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇలా చేస్తే పెంపుడు జంతువుల పట్ల మీ అభిరుచి నెరవేరుతుంది. దానితో పాలు లక్షల రూపాయల సంపాదన కూడా వస్తుంది. ప్రస్తుతం దేశంలో కుందేళ్ల పెంపకం బాగా వృద్ధి చెందుతోంది. ఉన్నత చదువులు చదివిన యువత కూడా పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాన్ని మానేసి.. సొంతూరికి వెళ్తున్నారు. తమ గ్రామంలోనే కుందేళ్ల పెంపకం చేపట్టి లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా అలాంటి కోవలోకి వస్తే.. ఎంచక్కా కుందేళ్ల పెంపకం ప్రారంభివచ్చు.

    కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. కుందేళ్ల పెంపకానికి టిన్ షెడ్ కోసం మరో 1.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేజ్‌ విలువ మరో రూ.1-1.25 లక్ష వరకు ఉంటుంది. కుందేలు పెంపకానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కుందేలు బోనులను శుభ్రం చేయడానికి, వాటికి మేత వేయడానకి ఒక సహాయకుడిని పెట్టుకుంటే సరిపోతుంది. ఏడాది కాలంలోనే మీరు పెట్టుబడిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

    Investment For Children: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారా ? ఈ విషయాలు గురించి తెలుసుకోండి

    ఒక ఆడ కుందేలు 30 రోజుల గర్భధారణ కాలం తర్వాత 6-7 పిల్లలకు జన్మనిస్తుంది. మనం ఐదు పిల్లలకు జన్మనిస్తుందని అనుకుందాం. అలాగే ఏడాదికి ఒక కుందేలు ఏడుసార్లు గర్భం దాల్చుతుంది. ఇలా ఏడు ఈతల్లో 5 చొప్పున లెక్క వేసుకుంటే.. ఒక కుందేళ్లు ప్రతి ఏటా 35 పిల్లలకు జన్మనిస్తుంది. మీ యూనిట్‌లో ఉండే మొత్తం 7 కుందేళ్లు కలిపి 235 పిల్లలు జన్మనిస్తాయి. పుట్టిన తర్వాత కుందేలు పిల్ల 45 రోజులలో 2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఆ తర్వాత మీరు వాటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు.

    Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఇంట్లో హాయిగా కూర్చునే లక్షల్లో సంపాదన

    ఒక బ్యాచ్ కుందేలు పిల్లలను అమ్మి దాదాపు రూ.2 లక్షల వరకు సంపాదించవచ్చు. కుందేళ్లను కొందరు మాంసం కోసం కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు పెంచుకునేందుకు కొనుక్కుంటారు. పట్టణాలు, నగరాల్లో కుందేళ్లను పెంచుకునే వారు ఎక్కువగా కనిపిస్తారు. పెంచుకునే కుందేళ్లు కాస్త ఎక్కువ ధర పలుకుతాయి. మాంసం కోసం వాడేవి తక్కువ ధరకు అమ్ముడవుతాయి. అంతేకాదు కుందేళ్ల ఉన్నిని కూడా అమ్ముకోవచ్చు. ఇలా ఏడాదిలో కుందేళ్ల పిల్లలను అమ్మడం ద్వారా దాదాపు 10 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. పశుగ్రాసం, నిర్వహణకు 2 నుంచి 3 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏటా రూ.8 లక్షల వరకు నిరక లాభం పొందవచ్చు.

    మీకు కుందేలు పెంపకం గురించి మరింత సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్‌లో మరిన్ని వివరాలు సేకరించవచ్చు. ఇప్పటికే కుందేళ్లు పెంచుతున్న వారి వద్దకు వెళ్లి మీ కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఫ్రాంచైజీలను కూడా కలవచ్చు. కుందేళ్ల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు శిక్షణ కూడా అందుబాటులో ఉంటుంది.

    First published:

    Tags: Business, Business Ideas, Personal Finance

    ఉత్తమ కథలు