Business Ideas: మోదీ ప్రభుత్వం ఇస్తున్న రుణంతో నెలకు రూ. 5 లక్షల సంపాదన...

Business Ideas: జొమాటో, స్విగ్గీ లాంటి అగ్రిగేటర్లు మార్కెట్లో ప్రవేశించడంతో, ఫుడ్ ప్యాకింగ్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. అటు హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్స్ కూడా బిజీగా మారడంతో ఆహార పదార్థాల ప్యాకింగ్ రంగంలో అవకాశాలు పెరిగాయి.

news18-telugu
Updated: September 23, 2020, 9:58 AM IST
Business Ideas: మోదీ ప్రభుత్వం ఇస్తున్న రుణంతో నెలకు రూ. 5 లక్షల సంపాదన...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఈ మధ్య కాలంలో ఫుడ్ బిజినెస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ లాంటి అగ్రిగేటర్లు మార్కెట్లో ప్రవేశించడంతో, ఫుడ్ ప్యాకింగ్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. అటు హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్స్ కూడా బిజీగా మారడంతో ఆహార పదార్థాల ప్యాకింగ్ రంగంలో అవకాశాలు పెరిగాయి. ఆహార ప‌దార్థాల‌ను సురక్షితంగా ప్యాక్ చేసేందుకు అల్యూమినియం ఫాయిల్స్‌ ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో అల్యూమినియం బ్యాక్సులను విరివిగా వాడుతున్నారు. ఇక ప్రయాణాల్లో కూడా వీటిని బాగా వినియోగిస్తున్నారు. దీంతో అల్యూమినియం బాక్సుల డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో వీటి తయారీ బిజినెస్ లాభాలను పంచిపెట్టే అవకాశంగా మారింది. అంతేకాదు నిరంతం ఉండే చక్కటి ఆదాయమార్గంగా మారింది. ఈ వ్యాపారానికి కావాల్సిన సదుపాయాలు, అలాగే మార్కెటింగ్, గురించి తెలుుకుందాం.

అల్యూమినియం ఫాయిల్ బాక్సుల‌ను రకరకాల సైజుల్లో తయారు చేయాల్సి ఉంటుంది. ఈ బిజినెస్‌ కోసం సుమారు రూ.8 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం. ఇక తయారీ యూనిట్ ఏర్పాటుకు స్థలం కావాల్సి ఉంటుంది. క‌నీసం 1000 నుంచి 1200 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం అవస‌రం అవుతుంది. ప‌నికోసం 5 మంది వ‌ర్క‌ర్లు అవ‌స‌రం అవుతారు. అలాగే ఈ ప‌రిశ్ర‌మకు అల్యూమినియం ఫాయిల్ ముడిప‌దార్థం కావాలి. దీన్ని 3003 హెచ్‌24 క్వాలిటీ ఉన్న‌ది ఎంపిక చేసుకుంటే మంచిది.

అల్యూమినియం ఫాయిల్ బాక్సుల త‌యారీకి ఫుల్లీ ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్ మెషిన్లు అవ‌స‌రం అవుతాయి. మీ పెట్టుబ‌డిని బట్టి మెషిన్ల ఎంపిక చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కంటెయిన‌ర్ మేకింగ్ మెషిన్ క‌నీస ధ‌ర రూ. 6 ల‌క్ష‌ల దాకా ఉంది. మెషిన్ తో ముందు ఫాయిల్స్‌ను త‌యారు చేసి క‌ట్ చేయాలి. ఆ తర్వాత మెషిన్ స‌హాయంతో బాక్సులుగా త‌యారు చేయాల్సి ఉంటుంది. బాక్సుల‌ను ప్యాక్ చేసి అమ్మ‌వ‌చ్చు.

ఈ బిజినెస్‌లో లాభం విషయానికి వస్తే రోజుకు 200 ప్యాకెట్ల అల్యూమినియం ఫాయిల్ బాక్సుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఒక్కో ప్యాకెట్‌లో 25 బాక్సులు ఉంటాయి. ఇక ఒక ప్యాక్‌ను రూ.160 కి అమ్మ‌వ‌చ్చు. దీంతో రోజుకు 200X160 = రూ.32వేలు సంపాదించవచ్చు. నెల‌కు అయితే 30X32000 = రూ.9.60 ల‌క్ష‌లు వ‌స్తాయి. స‌గం ఖ‌ర్చులు తీసేసినా స‌గం లాభం వ‌స్తుంది. అంటే రూ. 4 నుంచి 5 ల‌క్ష‌ల లాభం వ‌స్తుంది.

మీకు కావాల్సిన పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర పథకం కింద లోన్ పొందవచ్చు. సుమారు 10 లక్షల దాకా రుణం మీకు లభిస్తుంది. వివరాల కోసం మీ సమీపంలోని ఏదైనా ఒక జాతీయ బ్యాంకును సంప్రదించండి.

లోన్ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Mudra Loan
Published by: Krishna Adithya
First published: September 23, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading