Home /News /business /

BUSINESS IDEAS SBIS RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE HELPED LAKHS OF PEOPLE IN RURAL INDIA EARN A LIVING MK

Business Ideas: ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రెయినింగ్...వ్యాపారానికి లోన్...నిరుద్యోగులకు బంపర్ ఆఫర్...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

SBI Rural Self Employment Training Institutes (RSETIs): నిరుపేదలు, ఉన్నత విద్యను అభ్యసించలేని చాలా మందికి నేడు స్వయం ఉపాధే దిక్కు అవుతోంది. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని స్వశక్తితో ముందుకు సాగే ఉత్సాహం ఉన్న యువతీ, యువకులకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బాసటగా నిలుస్తోంది.

ఇంకా చదవండి ...
SBI : ఉద్యోగమా లేదా స్వయం ఉపాధా...ఇలా రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియక యువత నేడు సతమతం అవుతున్నారు. నేటీ పోటీ ప్రపంచంలో చదువు పూర్తికాగానే ఉద్యోగం రావడం అంత తేలికైన విషయం కాదు! ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ పడుతున్నారు. నిరుపేదలు, ఉన్నత విద్యను అభ్యసించలేని చాలా మందికి నేడు స్వయం ఉపాధే దిక్కు అవుతోంది. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని స్వశక్తితో ముందుకు సాగే ఉత్సాహం ఉన్న యువతీ, యువకులకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బాసటగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న సంస్థల్లో (SBI RSETI) ముందు స్థానంలో ఉంది. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలను నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. దేశంలోని గ్రామీణ యువత నిరుద్యోగం మరియు ఉపాధి కోల్పోయే సమస్యను పరిష్కరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 151 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉపాధి లేక బాధపడుతున్న యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. ఉచితంగా వివిధ రకాల శిక్షణలు ఇవ్వడమే కాకుండా వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తున్నది. వేలకు వేలు ఖర్చుచేసి నేర్చుకునే కోర్సులను ఉచితంగా అందిస్తుండడంతో యువతీ, యువకులు ఉత్సాహంగా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. సంస్థ అందుబాటులో ఉంచిన స్వయం ఉపాధి శిక్షణలలో తమకు నచ్చినది ఎంపిక చేసుకుని మెళకువలు నేర్చుకుంటున్నారు. కోర్సుల్లో చేరిన వారికి శిక్షణతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌లను కూడా నేర్పిస్తున్నారు. ఇది శిక్షణానంతరం యువతీ, యువకులు ఉద్యోగ ప్రయత్నాలకు, వ్యాపారాలు చేసుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతోంది.

శిక్షణ పొందేందుకు అర్హత...
గ్రామీణ నిరుద్యోగ యువత 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, 3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు సమర్పించాలి. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఔత్సాహికులు ఆయా జిల్లాలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ని సంప్రదించి శిక్షణ సంస్థ కార్యాలయం వివరాలు తెలుసుకోవచ్చు.

బ్యాంకు రుణాలు
ఈ సంస్థలో శిక్షణ పొందిన యువతకు అర్హులైన వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు సహకారం అందిస్తుంది. శిక్షణ పొందిన యువతకు సంస్థ ప్రతినిధులు. సంవత్సరం పాటు ప్రతి మూడు నెలలకొకసారి సూచనలను, సలహాలను అందిస్తారు

ఉచిత వసతి, భోజన సదుపాయం...
స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా నిరుద్యోగులు తాము ఎంచుకున్న రంగంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ సంస్థ ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తోంది. ప్రతిరోజు ఉదయం శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ లక్షణాలను, బిజినెస్‌ అపర్చునిటీ, వ్యాపార దక్షత, యోగా, ధ్యానం, స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై అనుభజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇస్తారు.శిక్షణనిచ్చే కోర్సుల వివరాలు...
పాడి పరిశ్రమ, ఉమెన్స్‌ టైలరింగ్‌, ఆర్టిఫిషియల్‌ జువెల్లరీ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషన్‌, ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌, ఘరేలు విద్యుత్‌, ఉపకరణాలు, బ్యూటీ పార్లర్‌, ఎలక్ర్టికల్‌ మోటార్‌ రివైండింగ్‌, నెట్‌ వర్కింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వ్యవసాయ అనుబంధ వృత్తులు, ఉమెన్స్‌ బ్యూటిపార్లర్‌, ఎంబ్రాయిడరీ, పాబ్రిక్‌ పెయింటింగ్‌, కొవ్వొత్తుల తయారీ, అగరబత్తి తయారీ, వెదురుతో చేసిన చేతి వృత్తులు, జనపనార ఉత్పత్తుల తయారీ, అప్పడాలు, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయారీ, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, టూవీలర్‌ మోకానిజం, హౌస్‌వైండింగ్‌, ఎల్‌ఎంవీ డైవింగ్‌, ఏసీ, ఫ్రింజ్‌ రిపేరింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌ వర్కింగ్‌, పాడి పశువులు, వానపాముల పెంపకం తదితర కోర్సులు అందుబాటులో ఉంచారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Bank loans, Business, Business Ideas, Money, Money making, Save Money, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు