Home /News /business /

BUSINESS IDEAS PUNE WOMAN MEGHA BAFNA INVEST RUPEES 3500 TO SELL SALADS NOW EARN RUPEES 1 5 LAKH PROFIT PER MONTH NK

Business Ideas: పెట్టుబడి రూ.3500.. నెలకు రూ.లక్షన్నర లాభం

Business Ideas: పెట్టుబడి రూ.3500.. నెలకు రూ.లక్షన్నర లాభం

Business Ideas: పెట్టుబడి రూ.3500.. నెలకు రూ.లక్షన్నర లాభం

Business Ideas: కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందో, లాభం వస్తుందో లేదో అనే డౌట్ ఉంటుంది. కానీ ఆల్రెడీ అలా చేసి సక్సెస్ అయిన వారు ఉంటే... ఆ వ్యాపారం మనమూ చెయ్యవచ్చు.

  Business Ideas: సొంతవ్యాపారం చెయ్యాలని అందరికీ ఉంటుంది... మరి కొందరే ఎందుకు విజయం సాధిస్తున్నారు? ఎందుకంటే వారిలో పట్టుదల, శ్రమ, సంకల్పబలం బాగా ఉండబట్టే. పుణెకు చెందిన మేఘా బఫ్నా (Megha Bafna) ఈ విషయంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట్లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫుల్ టైమ్ ఉద్యోగం చేసిన ఆమె... 15 ఏళ్ల తర్వాత దాన్ని వదిలేశారు. ఏదైనా తనకు నచ్చిన వ్యాపారం చెయ్యాలి అనుకున్నారు. 2017లో సలాడ్ వ్యాపారం ప్రారంభించారు. సొంత వ్యాపారవేత్త కావాలి అన్నదే టార్గెట్‌గా శ్రమించారు. జస్ట్ నాలుగేళ్లలో దేశం మొత్తం ఆమె గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరారు.

  తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఆమె కాలికి సర్జరీ జరిగి... 18 నెలలు బెడ్ పైనే ఉన్నారు. ఆ తర్వాత కూడా ఫ్యూచర్‌లో కాలికి ఏమైనా కావచ్చని డాక్టర్లు హెచ్చరించారు. అందువల్ల ఎక్కువగా తిరగకూడని బిజినెస్ ఏదైనా చెయ్యాలని ఆమె అనుకున్నారు. ఆమె రియలెస్టేట్ జాబ్ చేసినప్పుడు... మధ్యాహ్నం లంచ్ సమయంలో... చాలా మంది ఆమె చేసిన సలాడ్లను ఇష్టంగా తినేవారు. మరింతగా కావాలని అడిగేవారు. దాంతో... ఆమె ఆ సలాడ్ల వ్యాపారమే చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు.

  రూ.3,500 పెట్టుబడి:
  ఇండియాలో జంక్ ఫుడ్ అంతటా దొరుకుతుంది. సలాడ్ లాంచి మంచి ఫుడ్ మాత్రం ఎక్కడోగానీ దొరకట్లేదు. అందుకే ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఈ వ్యాపారానికి ఆమె శ్రీకారం చుట్టారు. భర్త సహకారంతో వ్యాపారం ప్రారంభించి దాని గురించి ఫేస్‌బుక్, వాట్సాప్‌లో బాగా ప్రచారం చేశారు. ప్రారంభంలో రూ.3,500 పెట్టుబడి పెట్టారు. మొదట్లో ఆరు రకాల సలాడ్లు చేసేవారు. ఎన్నో సవాళ్లూ వచ్చేవి. తెల్లారి 4 గంటలకే లేచి... సలాడ్లకు కావాల్సిన గింజలను నానబెట్టి... మార్కెట్‌కి వెళ్లి మరిన్ని కూరగాయలు కొని... ఇంటికి వచ్చి... వాటిని కడిగి, కట్ చేసి... ఇలా సలాడ్లు చేయడం ప్రారంభించారు.

  ఇలా ఈ వ్యాపారం చేస్తూనే... ఇంట్లో పిల్లాణ్ని స్కూలుకు పంపడం, వంట చెయ్యడం, రెగ్యులర్ పనులు కూడా చేసుకున్నారు. టైమ్ సరిపోయేది కాదు. సలాడ్ల తయారీలో క్వాలిటీ విషయంలో ఒక్కశాతం కూడా రాజీపడలేదు ఆమె. హానికారక ప్లాస్టిక్ ఎక్కడా వాడేవారు కాదు. ఫలితంగా ఒకసారి సలాడ్ కొనుక్కున్న వారు మళ్లీ మళ్లీ రకరకాల సలాడ్లకు ఆర్డర్ ఇస్తున్నారు. ఫలితంగా నాలుగేళ్లలో వ్యాపారం బాగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 300 ఆర్డర్లు వస్తున్నాయి.


  ఇది కూడా చదవండి: Youtube Money: యూట్యూబ్ ద్వారా నెలకు రూ.50,000 సంపాదన.. ఇలా చేస్తే చాలు

  కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు మేఘా... ఫ్రీ శాంపిల్ ప్యాక్స్ ఇస్తున్నారు. వాటిని తిన్నవారు... కస్టమర్ అయిపోతున్నారు. అలా ఆమె వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దగ్గర 30 మంది పనిచేస్తున్నారు. రోజూ 27 రకాల సలాడ్లు చేస్తున్నారు. వారమంతా సలాడ్ సప్లై చెయ్యడానికి ఆమె రూ.620 తీసుకుంటున్నారు. అలాగే... సలాడ్, మీల్, సూప్ కాంబో అయితే వారానికి రూ.1,200 తీసుకుంటున్నారు. నెలకు రూ.లక్షన్నర లాభం వస్తోంది. త్వరలోనే తన వ్యాపారాన్ని ముంబైకి విస్తరిస్తానని ఆమె కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Business Ideas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు