బిజినెస్ ఐడియాస్ లో మరో లాభదాయక వ్యాపారం గురించి చర్చిద్దాం. ఇప్పటికే బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలోని మరో అవకాశం గురించి తెలుసుకుందాం. కోడిగుడ్ల వ్యాపారం అని చీప్‌గా చూడొద్దు. ఇది నిరంతరం ఆదాయ వనరుగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా కోడిగుడ్లను అందరూ వినియోగిస్తారు. పైగా వీటి డిమాండ్ కూడా ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఎగ్ బిజినెస్ మోడల్ లో మనం చేయాల్సింది. హోల్ సేల్ డీలర్ల వద్ద కోడిగుడ్లను కొనుగోలు చేసి, వాటిని కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కు సప్లై చేసే ఎగ్ సప్లయర్ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
ఎగ్ సప్లయర్ బిజినెస్ స్టార్ట్ చేయండిలా...
ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది. 10X10 గది కావాల్సి ఉంటుంది.
ఒక మినీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ అవసరం ఉంటుంది.
ఫారంగేట్ వద్ద ఒక కోడిగుడ్డు ధర రూ.4 ఉంటే, మార్కెట్లో ఒక్కో ఎగ్ ధర రూ. 5 వరకూ అమ్మవచ్చు.
అంటే ఒక కోడి గుడ్డు మీద రూ.1 దాకా లాభం ఉంటుంది.
ఈ బిజినెస్ లో ముందుగా హోల్ సేలర్లు, రిటైల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు రూ.1 లాభాన్ని పంచుచోవాల్సి ఉంటుంది.
ముందుగా హోల్ సేలర్ ఫారం గేట్ దగ్గర కోడిగుడ్డును రూ.4 చొప్పన ఒక ట్రేను కొనుగోలు చేస్తే (రూ.4 X 30గుడ్లు) రూ. 120 ఖర్చు అవుతుంది.
అయితే ఒక ట్రే కోడి గుడ్లు మార్కెట్ రేట్ లో రూ.150 పలుకుతుంది. అంటే ఒక ట్రే మీద మనకు రూ.30 లాభం వస్తుంది.
అయితే వచ్చిన రూ.30 లాభంలో హోల్ సేలర్ వాటా రూ.14, సప్లయర్ వాటా రూ.6, రిటైల్ అమ్మకం దారు వాటా రూ.10 (ఒక ట్రే మీద లాభం రూ.30 =రూ.14+రూ.6+రూ.10)
అంటే ఎగ్ సప్లయర్ కు ఒక ట్రే మీద రూ.6 లాభం వస్తుంది.
ఒక ఏరియాలోని 20 షాపుల్లో 5 ట్రేల చొప్పన 100 ట్రేలను సప్లయ్ చేస్తే
మనకు 100 ట్రేల మీద కమీషన్ రూ.6 చొప్పన రూ.600 లాభం వస్తుంది.
అలా నెలకు రూ.18000 ఆదాయం పొందవచ్చు (రూ.600x30 రోజులు=రూ.18000)
20 షాపులకు కోడిగుడ్లను సప్లయ్ చేయడానికి పట్టే సమయం రోజుకి 2 నుంచి 3 గంటలు
అదనంగా రెస్టారెంట్లు, హాస్టల్స్, అలాగే ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తే మీ ఆదాయం రూ.50 వేలు దాకా పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Money, Money making, Online business, Save Money