Business Ideas: చీప్‌గా చూడొద్దు...పేపర్ ప్లేట్స్ బిజినెస్‌తో నెలకు ఎంత సంపాదనో తెలుసా...

ప్రతీకాత్మక చిత్రం

పేప‌ర్ ప్లేట్ల త‌యారీ బిజినెస్‌కు ఒక ఫ్యాక్టరీ లేదా యూనిట్ అవసరం లేదు. వీలుంలేం మ ఇంట్లోని చిన్న స్థలం ఉంటే షెడ్ వేసుకొని ఈ మెషిన్ల‌ను పెట్టుకోవచ్చు. లేకపోతే చిన్న షాపులను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవ‌చ్చు.

  • Share this:
    ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎంతో  చాలా మంది భోజ‌నాల‌కు పేపర్ ప్లేట్స్ ను భారీగా వాడుతున్నారు. అంతేకాదు హోటల్స్ లో కూడా వీటినే వాడుతున్నారు. అలాగే వీధిలో చిరుతిళ్ల బండ్లు సైతం పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతున్నారు. ఇక పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసేందుకు ప్రస్తుతం మార్కెట్లో చాలా మంది వ్యాపారులు ఉన్నారు. అయినప్పటికీ ఈ బిజినెస్ ద్వారా నెల‌కు వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు, అలాగే నిరుద్యోగ యువత, స్వయం సహాయక బృందాలకు ఇది మంచి ఉపాధి వనరు. ఈ బిజినెస్ వారికి చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి. అయితే ఈ బిజినెస్ లో ఎంత వరకూ పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఎంత వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చో.. తెలుసుకుందాం.

    పేప‌ర్ ప్లేట్ల త‌యారీ బిజినెస్‌కు ఒక ఫ్యాక్టరీ లేదా యూనిట్ అవసరం లేదు. వీలుంలేం మ ఇంట్లోని చిన్న స్థలం ఉంటే షెడ్ వేసుకొని ఈ మెషిన్ల‌ను పెట్టుకోవచ్చు. లేకపోతే చిన్న షాపులను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవ‌చ్చు. ఈ మెషిన్లకు విద్యుత్ అందించేందుకు సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా స‌రిపోతుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ప్రారంభించాలంటే అన్నింటికన్నా ప్రధానమైనది పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసే మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్‌లో రూ.60 వేల ప్రారంభ ధ‌ర నుంచి దొరుకుతున్నయి. సింగిల్ హైడ్రాలిక్ పేప‌ర్ ప్లేట్ మెషిన్ ధ‌ర సుమారుగా రూ.60వేల వరకూ ఉంది. ఇక డ‌బుల్ హైడ్రాలిక్ మెషిన్ విషయానికి వస్తే దీని ధ‌ర రూ.1.20 ల‌క్ష‌ల దాకా ఉంది. వీటిని ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇండియా మార్ట్ లాంటి వెబ్ సైట్స్ లో ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. వీటి ఇన్ స్టాలేషన్ కోసం కొన్ని కంపెనీలు తమ సర్వీస్ మ్యాన్ ను సైతం పంపుతున్నాయి. ఇదిలా ఉంటే పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయడం కోసం ముడి స‌రుకును కొనుగోలు చేయడం అవసరం. గ్రీన్‌, సిల్వ‌ర్ త‌దిత‌ర రంగుల్లో ఉండే చ‌తుర‌స్రాకార షీట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు.

    ప్లేట్లు తయారు చేసే విధానం...

    హైడ్రాలిక్ మెషిన్‌లో హెడ్ కింద స‌ద‌రు ప్లాస్టిక్ తో ల్యామినేట్ చేసిన షీట్‌ను ఉంచితే.. మెషిన్ దాన్ని రౌండ్‌గా క‌ట్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని ప్లేట్‌లా మార్చుతుంది. అయితే ఇందులో సింగిల్ హైడ్రాలిక్ మెషిన్ తో  రోజుకు 5వేల ప్లేట్లు తయారు చేయవచ్చు. అలాగే డబుల్ హైడ్రాలిక్ మెషిన్ తో అయితే రోజుకు 8వేల వ‌ర‌కు పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసుకునే వీలుంది.

    ఈ వీడియో చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి....





    లాభం పొందడం ఎలా..

    ప్రస్తుతం మార్కెట్లో ఒక్కోప్లేటును 20పైస‌ల ధ‌ర‌కు హోల్‌సేల్‌గా విక్ర‌యించవ‌చ్చు. దీంతో 5వేల ప్లేట్ల‌కు రోజుకు రూ.1000 దాకా లభిస్తాయి. అలాగే 8వేల ప్లేట్ల‌కు రోజుకు రూ.1600 దాకా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే వీటిలో ఖ‌ర్చులు పోను రోజుకు రూ.800 నుంచి రూ.1400 వ‌ర‌కు మిగిలే చాన్స్ ఉంది. అంటే సుమారు నెల‌కు రూ.24వేల నుంచి రూ.42వేల వ‌ర‌కు సంపాదించే వీలుంది.
    Published by:Krishna Adithya
    First published: