హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: లేడీస్ ఇంటి వద్దే రూ. 50 వేల పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం పొందండిలా...

Business Ideas: లేడీస్ ఇంటి వద్దే రూ. 50 వేల పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం పొందండిలా...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: రెడీ టు కుక్‌ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌’ దేశ, విదేశాల్లో ఇడ్లీ, దోశ పిండి అమ్మి రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తోంది.

Business Ideas: తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్(Business) ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పవచ్చు. ప్రపంచంలో ప్రతీ సీజన్, ప్రతీ రోజు, ప్రతీ క్షణం, ప్రతీ ప్రాంతంలోనూ గిరాకీ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే, అది ఆహార బిజినెస్ అనే చెప్పాలి. అయితే ఇందుకు ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఫుడ్ బిజినెస్ లో విజయం సాధించగలం. నిజానికి ఫుడ్ బిజినెస్ అనగానే అందరికీ రెడీ టు ఈట్ ఒక్కటే మార్గం అనుకుంటారు. అందులో భాగంగా హోటల్స్, టిఫిన్ సెంటర్స్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలా కొన్ని రకాల వ్యాపారాలకే పరిమితం అవుతుంటారు. కానీ అలా కాకుండా, ఈ సారి కొత్త తరహా వ్యాపారంపై దృష్టి పెడదాం. అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేసే వీలుంది. గతేడాది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థ ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌ జీ పెట్టుబడి పెట్టారు. ఈ మాట వినగానే అందరి చూపు రెడీ టు కుక్‌ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌’ పై పడింది. ఇది దేశ, విదేశాల్లో ఇడ్లీ, దోశ పిండిని విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ వెను సీఈఓ పీసీ ముస్తఫా కష్టం కనిపిస్తుంది. అయితే ఇడ్లీ, దోశ పిండితో ఇంతలా అద్భుతం చేయవచ్చా అనే సందేహం కలగవచ్చు. కానీ ఇది అక్షరాలా సత్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువత ఈ వినూత్న ఐడియాను అందిపుచ్చుకుంటే చక్కటి ఉపాధి అవకాశమవుతుంది. (స్వయం ఉపాధి)

ఇడ్లీ, దోశ పిండి తయారీ మార్కెట్లో అవకాశాలు...ఇవే...

ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ టిఫిన్స్ అనేవి నేడు అత్యంత ముఖ్యం అయిపోయాయి. చాలా మంది బ్యాచిలర్స్, ఉద్యోగులు తమ టిఫిన్స్ కోసం బయట ఉన్న టిఫిన్ సెంటర్స్, తోపుడు బండ్లు లేదా ఇతర స్టాల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే అలా బయట ఆహారం తీసుకుంటే శుభ్రతకు గ్యారంటీ లేదు. కాగా ఇంటి దగ్గర ప్రతీరోజూ టిఫిన్ చేసుకుందామంటే అంత సమయం చేతికి చిక్కటం లేదు. ముఖ్యంగా భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగులు అయితే మార్నింగ్ టిఫిన్ అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అందుకే ఇడ్లీ, దోశెల పిండి వ్యాపారం చేసే వారికి ఇది సువర్ణావకాశం అనే అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇడ్లీ, దోశ పిండి తయారు చేసి డోర్ డెలివరీ చేస్తే ఇది అద్భుతమైన వ్యాపారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతీ రోజు పాల పాకెట్స్ తరహాలో ఒక కేజీ, ఇడ్లీ, దోశ పిండిని డోర్ డెలివరీ చేసినట్లయితే ఆటోమేటిగ్గా మార్కెట్ విస్తరిస్తుంది.

ఇడ్లీ, దోశ పిండి తయారీ పరిశ్రమకు కావాల్సిన పరికరాలు...

- వెట్ గ్రైండర్‌: మీరు పెట్టాలనుకున్న పెట్టుబడి, వ్యాపారం సైజును బట్టి ఇది ఎంపిక చేసుకోవాలి. మార్కెట్లో వెట్ గ్రైండర్స్ 5 లీటర్ల కెపాసిటీ నుంచి 20 లీటర్ల కెపాసిటీ వర్కు కమర్షియల్ కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు 20 లీటర్ల వెట్ గ్రైండర్ తీసుకుంటే దీనితో మనం 80 నిమిషాల్లో 14 కేజీల పిండి రుబ్బవచ్చు. ధర కూడా రూ.50 నుంచి 60 వేల మధ్య ఉంటుంది. అదే చిన్న సైజు యూనిట్ అయితే మీకు 5 లీటర్ల వెట్ గ్రైండర్ రూ.5 నుంచి రూ.10 వేలతో లభిస్తుంది.

- అలాగే పిండి భద్రపరుచుకోవాడానికి, పప్పు నానబెట్టడానికి పెద్ద పెద్ద పాత్రలు కావాల్సి ఉంటుంది. కమర్షియల్ స్కేల్ వ్యాపారానికి 20 లీటర్లు అంతకన్నా పెద్ద అల్యూమినియం పాత్రలు కావాలి.

- అలాగే ప్యాకేజింగ్ మిషిన్ (idli dosa batter filling machines) కూడా కొనుగోలు చేసుకుంటే ప్యాకింగ్ సమయం కూడా సేవ్ అవుతుంది. మార్కెట్లో ప్యాకేజింగ్ కెపాసిటీని బట్టి వీటి ధర రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంది. అయితే మీ యూనిట్ చిన్నది పరిమితం అయితే ప్యాకేజింగ్ మిషిన్ అవసరం లేదు.

Gold Loan, COVID-19 Loan, Loan on cars, Credit Card Loans, Loan on PPF, Loan on Insurance, Loan on Mutual funds, Loan on Fixed deposit, గోల్డ్ లోన్, కోవిడ్ 19 లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, పీపీఎఫ్ లోన్
ప్రతీకాత్మక చిత్రం

- ప్యాకేజింగ్ కవర్ మెటీరియల్(Laminated Material Idly Dosa Batter Pouches, For Industrial) ఇడ్లీ, దోశ పిండిని ప్యాక్ చేసేందుకు మనకు మాయిశ్చర్ ప్రూఫ్(Moisture Proof) కవర్లు లభిస్తాయి. ఇవి 500 గ్రాములు, 1, 2 కేజీల పిండి పట్టే కవర్లు లభిస్తాయి. వీటిని 10,000 నుంచి లక్ష కవర్ల వరకూ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు.

ఇడ్లీ, దోశె పిండితో లాభం పొందండిలా...

- ఒక కేజీ మినపప్పు ధర రూ.80 నుంచి  రూ.100(హోల్ సేల్) (ధర ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడే బల్క్ గా కొనుగోలు చేసుకోవాలి)

- మూడు కేజీల ఇడ్లీ రవ్వ ధర రూ. 120 (రూ.80+120=రూ.200)

- ఒక కేజీ మినపప్పు, మూడు కేజీల ఇడ్లీ రవ్వతో, నీరు కలిపితే 6 కేజీల పిండి తయారు చేయవచ్చు.

- 1 కేజీ పిండి రూ.60 చొప్పన అమ్మితే, 6X60=రూ.360 లభిస్తుంది. అంటే రూ.200 పెట్టుబడి ఖర్చు పోగా మనకు రూ.160 లాభం వస్తుంది.

- 30 డోర్స్ ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే...ఒక్కో ఆర్డర్‌కి కనీసం 2 కేజీల ఆర్డర్ దక్కితే, 6 కేజీల పిండికి రూ.160 లాభం వస్తే, 60 కేజీల పిండికి రూ.1600 లాభం వస్తుంది.

- అంటే రోజుకి 60 కేజీల పిండి అమ్మితే మనకు లాభం రూ.48000 వస్తుంది. కరెంటు, ఇతర చార్జీలు పోగా, మినిమం మనకు రూ. 40,000 వరకూ ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది.

బిజినెస్ టిప్...

పాల ప్యాకెట్ల వ్యాపారులతో కలిసి కమీషన్ ప్రాతిపదికన డోర్ డెలివరీ చేస్తే ఆర్డర్లు పెరిగి మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే నాణ్యతా ప్రమాణాలు కంటిన్యూ చేస్తే మీ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలు కావడం గ్యారంటీ..

First published:

Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Money, Money making, Online business

ఉత్తమ కథలు