BUSINESS IDEAS LOW INVESTMENT AND HIGH INCOME START THIS PAPER PLATE MAKING BUSINESS AT HOME HERE IS THE PLAN IN INDIA NK
Business Ideas: తక్కువ పెట్టుబడి... భారీ లాభాలు.. నష్టాలు లేని వ్యాపార ఐడియా
తక్కువ పెట్టుబడి... భారీ లాభాలు.. నష్టాలు లేని వ్యాపార ఐడియా (ప్రతీకాత్మక చిత్రం)
Business Ideas: మనందరికీ వ్యాపారం ప్రారంభించాలని ఉంటుంది. కానీ ఎలా అన్న ప్రశ్న దగ్గరే ప్రయాణం ఆగిపోతుంది. న్యూస్18 సమగ్ర వివరాలతో వ్యాపార ఐడియాలు అందిస్తోంది. తాజా బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకుందాం.
Business Ideas:మీరు ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయారా... ప్రస్తుతం ఏ ఆదాయమూ లేక ఇబ్బంది పడుతూ... ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా... అయితే... ఇది మీకు బాగా సెట్టవుతుంది. పైగా ఈ వ్యాపారానికి వచ్చే 100 ఏళ్ల వరకూ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఇది ఏంటంటే... పేపర్ ప్లేట్ల తయారీ. ఈ కరోనా రోజుల్లో హోటళ్లు, ఫంక్షన్లలో పేపర్ ప్లేట్లే ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ఈ వ్యాపారానికి తిరుగులేని డిమాండ్ ఉంది. ఇండియాలో జనాభా ఎక్కువ. తరచూ పెళ్లిళ్లు, వేడుకలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల పేపర్ ప్లేట్ల వాడకం ఎక్కువే. కొన్నేళ్లుగా ఈ పరిశ్రమ విపరీతంగా పెరుగుతోంది. ఈ వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువే.
కావాల్సినవి:
దీనికి పెద్దగా ఏవీ అవసరం ఉండవు. 100 చదరపు అడుగుల స్థలం కావాలి. ఇంట్లోనే చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ నీరు అవసరం. నీటి లాగే కరెంటు సరఫరా ఉండాలి. మీరు స్థానిక చెత్త షాపుల నుంచి రా-మెటీరియల్ కొనవచ్చు. అక్కడ చదివేసిన న్యూస్ పేపర్లు ఇతరత్రా వాడిన పేపర్లు తక్కువ ధరకు లభిస్తాయి. 1000 కేజీల పేపర్లను మీరు రూ.5000 నుంచి రూ.7000కు పొందగలరు.
నెక్ట్స్ మీకు కావాల్సింది... ప్లేట్ల తయారీ యంత్రం. ఈ యంత్రం గంటకు 1000 నుంచి 2000 ప్లేట్లను తయారుచెయ్యగలదు. కొన్ని 4000 నుంచి 7000 ప్లేట్లను చెయ్యగలవు. డిజైన్, టైపు, సైజ్ అన్నీ మీరే డిసైడ్ చెయ్యవచ్చు. రకరకాల సైజుల్లో ప్లేట్లు తయారుచేస్తుంది. ఈ యంత్రాల రేటు రూ.75,000 నుంచి రూ.5,00,000 దాకా ఉంటుంది. ఈ వ్యాపారానికి మీకు కనీసం ఇద్దరు వ్యక్తులు అవసరం. ఇంట్లో సభ్యులు ఉంటే... అందరూ కలిసి చేసుకోవచ్చు.
తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చెయ్యాలి అనుకునేవారు... తక్కువ ధర యంత్రాన్ని కొనుక్కోవచ్చు. కాస్త ఎక్కువ ధరైనా పర్వాలేదు అనుకునేవారు ఎక్కువ ధర యంత్రం కొనవచ్చు. ఇక రా మెటీరియల్, కరెంటు, వాటర్, టాక్సులు, జీతాలు.. అన్నింటికీ కలిపి పెట్టుబడి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అవుతుంది.
రిజిస్ట్రేషన్ ఇలా:
ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి... రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే... లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు.
ముద్ర రుణాలు:
మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. పేపర్ ప్లేట్లు తయారుచేశాక... వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి. షాపుల్లో, షామియానా షాపుల వారితో డీల్ కుదుర్చుకోవచ్చు. అలాగే... పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్స్ వారితో డీల్ కుదుర్చుకోవచ్చు. అలాగే... గ్రామాల్లో వేడుకలప్పుడు మీ ద్వారా ప్లేట్లు సప్లై అయ్యేలా చేసుకోవచ్చు. అలాగే... క్యాటరింగ్ సర్వీసు వారితో డీల్ కుదుర్చుకోవచ్చు. హోటళ్లకు తక్కువ ధరకే ఇస్తే... మీ దగ్గరే కొంటారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటికీ మీ ఉత్పత్తిని చేరవేసేందుకు ప్రయత్నిస్తే... త్వరగానే డెవలప్ అవ్వవచ్చు. ప్రతిచోటా... మీ విజిటింగ్ కార్డు, మొబైల్ నంబర్ వంటివి ఇస్తే... మీకు కనెక్ట్ అయిపోతారు.
ఈ ప్లేట్లు త్వరగా పాడవ్వవు కాబట్టి... ఈ వ్యాపారంలో నష్టాలు చాలా తక్కువే. మొదట్లో చిన్నగా ప్రారంభించి... తర్వాత ప్లేట్లతోపాటూ... టీ కప్పులు ఇతరత్రా కూడా చేయవచ్చు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.