Home /News /business /

BUSINESS IDEAS LOCKDOWN WEDDINGS MARRIAGE IN THE TIME OF A PANDEMIC MK

Business Ideas: లాక్‌డౌన్ వివాహాలతో చక్కటి వ్యాపార అవకాశం...లాభాల పంటే...

తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలనేది మరో కండిషన్. అందుకు భార్య కూడా ఓకే చెప్పింది. నడిరోడ్డు మీద భర్తను నిలబెట్టి ఇద్దరు మహిళలు డీల్ మాట్లాడుకున్నారు. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. తాజాగా, మరోసారి ఆ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలనేది మరో కండిషన్. అందుకు భార్య కూడా ఓకే చెప్పింది. నడిరోడ్డు మీద భర్తను నిలబెట్టి ఇద్దరు మహిళలు డీల్ మాట్లాడుకున్నారు. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. తాజాగా, మరోసారి ఆ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లిళ్లు ఆగిపోవడంతో పురోహితులు, సన్నాయి మేళం, అలంకరణ చేసేవాళ్లు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్ చేసేవారు.. ఇలా వేలాది కుటుంబాలపైనా ప్రభావం పడింది. అయితే ఈ అవకాశాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చు.

    లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ శుభకార్యాలపైనా పడింది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లపై బాగా పడింది. లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన వివాహాలు అగిపోయాయి. దీంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న వారు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. అంతేకాదు, పెళ్లి చేసుకోవాలని అనుకునే మరో ముహూర్తం కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    లాక్ డౌన్ దెబ్బకు ఏప్రిల్ లో జరగాల్సిన వివాహాలు వాయిదా పడ్డాయి. అయితే లాక్ డౌన్ 5.0లో పెళ్లిళ్లకు అనుమతి ఉన్నా.. 50 మందికి మించి బంధువులు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ క్రమంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోరికకు బ్రేక్ పడింది. అటు ఆగస్టు వరకూ వేలాది వివాహాలకు ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు చేశారు. దీంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా పెళ్లిల్లను ఓ వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఆల్రెడీ ఉన్న వారు అయితే...ఈ లాక్ డౌన్ పెళ్లిల్లను మేనేజ్ చేసి ఆదాయం గడించవచ్చు...

    వివాహ ముహూర్తాలు వైశాఖ, జ్యేష్ఠ మాసాలు (ఏప్రిల్, మే నెల) ఉన్నాయి. ఆపై మూఢం వస్తుంది. జూన్ చివర్లో మొదలయ్యే ఆషాఢం జులై వరకు ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్లు ఉండవు. ఆగస్టు(శ్రావణం)లో ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వివాహాలు వాయిదా వేసుకున్న వారు ఆగస్టు వరకు వేచిచూడక తప్పదు. పెళ్లిళ్లు ఆగిపోవడంతో పురోహితులు, సన్నాయి మేళం, అలంకరణ చేసేవాళ్లు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్ చేసేవారు.. ఇలా వేలాది కుటుంబాలపైనా ప్రభావం పడింది. అయితే ఈ అవకాశాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చు.

    లాక్‌డౌన్ వివాహాలతో చక్కటి బిజినెస్ ప్లాన్...

    లాక్ డౌన్ పెళ్లిల్ల కోసం ఇప్పటికే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు నడిపేవారితో పాటు...కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చే వారికి ఇదొక అవకాశం అనే చెప్పాలి. కేవలం 50 మంది అటెండ్ అయ్యే పెళ్లి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా పెళ్లి మోడల్ కోసం, ప్రస్తుతం కొన్ని వెడ్డింగ్ మేనేజ్ మెంట్ సంస్థలు 2 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఈ ప్యాకేజీలో ఈ-ఇన్విటేషన్ కార్డ్, బ్రైడల్ మేకప్, మెహందీ ఆర్టిస్ట్, ఫోటో బూత్, డెకొరేషన్, సన్నాయి మేళం, 50 మందికి వెజ్, నాన్ వెజ్ క్యాటరింగ్, ఫోటో గ్రాఫర్, థర్మల్ స్క్రీనింగ్ బూత్ లు, టచ్ లెస్ హ్యండ్ సానిటైజర్ డిస్పెన్సర్స్ ఏర్పాటు, N95 మాస్కులు సంఖ్య 50, అతిథులకు 50 మినీ హ్యాండ్ సానిటైజర్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ సహా పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై లైవ్ బ్రాడ్ కాస్టింగ్ అలాగే స్థానిక పర్మిషన్స్ అన్నీ కలిపి రూ. 2 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ తరహా బిజినెస్ ను సమర్థవంతంగా, జాగ్రత్తగా నిర్వహిస్తే, మరింత ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాపారంలో పెట్టుబడిపై 40 శాతం వరకూ లాభం పొందే అవకాశం ఉంది.

    వెడ్డింగ్ ప్యాకేజ్
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Business Ideas, Lockdown, Lockdown relaxations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు