Business Idea: కుందేళ్ల పెంపకంలో సక్సెస్ స్టోరీ.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం

ఎవరైనా యువతకు కుందేళ్ల వ్యాపారంపై ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలని.. కుందేళ్ల పెంపకతో పాటు మార్కెటింగ్‌పైనా మెలకువలు నేర్పుతామని చెబుతున్నారు.

news18-telugu
Updated: September 7, 2020, 8:29 PM IST
Business Idea: కుందేళ్ల పెంపకంలో సక్సెస్ స్టోరీ.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం
కుందేళ్ల పెంపకంలో రాణిస్తున్న అన్నాదమ్ముళ్లు
  • Share this:
(పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్ న్యూస్18 తెలుగు ప్రతినిధి)

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడ్డారు. వేరే దారిలేక దిక్కుతోచని స్థితిలో మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. ఎక్కడ పనిచేసినా అరకొర జీతంతో బ్రతుకు ఇడ్చడం కష్టమని భావించి సొంత వ్యాపారం ప్రారంభించాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి.. త‌మ్మునితో క‌లిసి.. కుందేళ్ళ పెంపకం ప్రారంభించారు.  అనుకున్నదే తడవుగా 60 కుందేళ్ళ తో ప్రారంభించిన ఫామ్.. ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వీటితో పాటు లవ్ బర్డ్స్, పావురాలు పెంచుతూ లాభాలు గ‌డిస్తున్నారు. కుందేళ్ల పెంపకంలో రాణిస్తున్న కామారెడ్డి జిల్లాలో  సక్సెస్ స్టోరీ ఇది.

కామారెడ్డి జిల్లా మ‌చారెడ్డి మండ‌లం భావ‌ని పేట్ కు చెందిన ఉమ శంక‌ర్, క్రాంతి కుమారు ఇద్దరు అన్న‌ద‌మ్ములు. అన్న ఉమ శంక‌ర్ గ‌ల్ఫ్ దేశం వెళ్లాడు. అక్క‌డ ఉపాధి లేక తిరిగి స్వాదేశాన‌కి వ‌చ్చాడు. ఉన్న చోటే ఎదైన చేసుకోవాల‌ని ఆలోచించారు.  త‌క్కువ పెట్టుబ‌డితో కుందేళ్ల పెంపకం ప్రారంబించారు.. మొద‌ట క‌ష్ట‌మైన ఇష్టంగా చేసుకోని క‌ష్టాప‌డ్డారు.  60 కుందేళ్ల‌తో మొద‌లైన ఫాం ఇప్పుడు 500 కుందేళ్ల‌కు చేరింది.. వీటికి మార్కెటింగ్ పరంగా అధిక ప్రయాస ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కడ ఉందో పసిగట్టి వాణిజ్యపరంగా కుందేళ్లను పెంచేందుకు యువరైతులు ఆసక్తిని చూపిస్తున్నారు.

చాలా సున్నితమైన ఈ కుందేళ్ల పెంపకంలో నూత‌న ప‌ద్ద‌తులు ఆవ‌లంబిస్తు లాభాదాయకమైన ఆదాయాన్ని ఒడిసిపడుతున్నారు.. నేడు అది హైదరాబాద్, రాజమంద్రిలకు కుందేళ్ళను తరలించెంతగా ఎదిగారు.. వీరు కొన్ని ఫాంల‌కు కుందేళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.. కుందేళ్ల పెంప‌క రంగంలో అడుగు పెట్టాల‌ను కునే వారికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారు.. కుందేళ్ల‌తో పాటు దేశీ కోళ్ల‌ను కూడా పెంచుతున్నారు.  తాము స్థిరపడడమే గాక.. మ‌రో ఇద్ద‌రికి ఉపాధి క‌ల్పిస్తున్నారు.  కుందేళ్ల మంసంలో ప్రోటిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో కుందేళ్ల మంసానికి మంచి డిమాండ్ ఉండంతో వారి కుందేళ్ల ఫాం ముడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంది.

మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చంటున్నారు ఈ అన్నాదమ్ముళ్లు. తన దగ్గర 30 నుంచి 40 రకాల కుందేళ్ల బ్రీడ్‌లు ఉన్నాయని చెప్పారు. అందులో చిన్చిల్లా, న్యూజిల్యాండ్ వైట్ , కాలిఫోర్నియన్ వైట్, సోవియట్, చిన్‌చిల్లా వంటి వెరైటీలు ఉన్నాయి. కుందేళ్లకు మేత కచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి. ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు పగటిపూట ఆహారం తీసుకోవు. సాయంకాలం, రాత్రిపూట మాత్రం చురుగ్గా ఉంటాయి. అందుకే సాయంత్రం పూట దాణాను అందిస్తే సంపూర్ణంగా తింటాయి. కుందేళ్లు సామాన్యమైన మేతను తిని దాన్ని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటాయని చెప్పారు.


ఎవరైనా యువతకు కుందేళ్ల వ్యాపారంపై ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలని.. కుందేళ్ల పెంపకతో పాటు మార్కెటింగ్‌పైనా మెలకువలు నేర్పుతామని చెబుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 7, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading