Home /News /business /

BUSINESS IDEAS IN TELUGU YOU CAN START PAPER CUPS MAKING UNIT YOU WILL EARN 70000 PER MONTH SK

Business Idea: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్.. ప్రభుత్వం లోన్ కూడా ఇస్తుంది.. నెలకు 70వేలు పక్కా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas | Paper cups making unit: తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారం చేయవచ్చు. స్థానిక మార్కెట్లోనే విక్రయాలు జరిపి.. ప్రతి నెలా మంచి ఆదాయం పొందవచ్చు.

    ఉద్యోగం చేయాలన్న ఆసక్తి మీలో తగ్గిందా? సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తున్నారా? మీరు తక్కువ పెట్టుబడితో చేయలగలిగే వ్యాపారాల గురించి శోధిస్తున్నారా? ఐతే మీ కోసం ఓ మంచి బిజినెస్ ఐడియా (Business Ideas) తీసుకొచ్చాం. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారం చేయవచ్చు. స్థానిక మార్కెట్లోనే విక్రయాలు జరిపి.. ప్రతి నెలా మంచి ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ప్రజల్లో కూడా ప్లాస్టిక్ గురించి అవగాహన పెరిగింది. పర్యావరణంపై ప్రజల్లో ఉన్న అవగాహన వల్ల పేపర్ కప్పులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు పేపర్ కప్పుల తయారీ యూనిట్ (Paper cups making Unit) ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి.

    Buying a House: కొత్త ఇల్లు కొంటున్నారా? ఇంటిని సెలక్ట్‌ చేసే ముందు ఈ పది విషయాలు తెలుసుకోండి

    పేపర్‌కప్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోంది. తక్కువ డబ్బు పెట్టుబడితోనే పేపర్ కప్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే.. పెద్ద యూనిట్ ప్రారంభించవచ్చు. కాగితం కప్పుల తయారీకి ముడి పదార్థాలు, యంత్రాలు మార్కెట్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. పేపర్ కప్పులను తయారు చేసేందుకు పేపర్ రీల్, బాటమ్ రీల్, ఇతర యంత్రాలు అవసరం. మార్కెట్‌లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంప్రదించి ఢిల్లీ, జైపూర్ వంటి పెద్ద నగరం నుంచి కూడా పేపర్ రీల్, బాటమ్ రీల్‌లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. పేపర్ రీల్ ధర కిలో రూ.90 నుంచి మొదలవుతుంది. బాటమ్ రీల్ ధర కూడా కిలోకి రూ.80 వరకు ఉంటుంది. పేపర్ కప్ ఫ్రేమింగ్ మెషిన్ 5 లక్షల రూపాయలలో వస్తుంది.



    దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల పెట్టుబడితో అన్ని రకాల సైజుల్లో కప్పులు, గ్లాసులను ఉత్పత్తి చేయవచ్చు. పేపర్ కప్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రుణసాయం చేస్తుంది. ముద్ర యోజన పథకం కింద మీరు ఈ రుణం తీసుకోవచ్చు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 25% మీ స్వంతంగా పెట్టుబడి పెట్టాలి. ముద్ర పథకం కింద ప్రభుత్వం 75 శాతం రుణం ఇస్తుంది.సాధారణంగా పేపర్ కప్పుల తయారీ యంత్రంతో ప్రతి నెలా 15 లక్షలకు పైగా కప్పులను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్క కప్పును 30 పైసలకు విక్రయించినా... మీకు దాదాపు రూ.4,70,000 ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులకు రూ.4 లక్షలు పోయినా.. మీకు దాదాపు 70వేల వరకు మిగులుతుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే.. మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Business Ideas

    తదుపరి వార్తలు