హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: కుందేళ్ల పెంపకంతో ఇంత లాభముంటుందా? ఈజీగా లక్షల ఆదాయం!

Business Idea: కుందేళ్ల పెంపకంతో ఇంత లాభముంటుందా? ఈజీగా లక్షల ఆదాయం!

కుందేళ్ల సాగు

కుందేళ్ల సాగు

Business Ideas: కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. మరి ఈ వ్యాపారంతో ఎంత లాభం వస్తుందో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా? ఇంట్లో పిల్లి, కుక్క, కుందేళ్లు వంటి జంతువులను పెంచుకోవడమంటే ఆసక్తా? ఐతే మీరు వీటికి సంబంధించిన వ్యాపారాన్ని  (Business Ideas) ప్రారంభించవచ్చు. ఇలా చేస్తే పెంపుడు జంతువుల పట్ల మీ అభిరుచి నెరవేరుతుంది. దానితో పాలు లక్షల రూపాయల సంపాదన కూడా వస్తుంది. ప్రస్తుతం దేశంలో కుందేళ్ల పెంపకం బాగా వృద్ధి చెందుతోంది. ఉన్నత చదువులు చదివిన యువత కూడా పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాన్ని మానేసి.. సొంతూరికి వెళ్తున్నారు. తమ గ్రామంలోనే కుందేళ్ల పెంపకం (Rabbit farm) చేపట్టి లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా అలాంటి కోవలోకి వస్తే.. ఎంచక్కా కుందేళ్ల పెంపకం ప్రారంభివచ్చు.

కుందేళ్ల పెంపకాన్ని 10 యూనిట్లతో ప్రారంభిస్తే రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. కుందేళ్ల పెంపకానికి టిన్ షెడ్ కోసం మరో 1.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేజ్‌ విలువ మరో రూ.1-1.25 లక్ష వరకు ఉంటుంది. కుందేలు పెంపకానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కుందేలు బోనులను శుభ్రం చేయడానికి, వాటికి మేత వేయడానకి ఒక సహాయకుడిని పెట్టుకుంటే సరిపోతుంది. ఏడాది కాలంలోనే మీరు పెట్టుబడిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

Gold: మార్కెట్ ధర కన్నా రూ.5,000 తక్కువకే బంగారం... కొనండి ఇలా

ఒక ఆడ కుందేలు 30 రోజుల గర్భధారణ కాలం తర్వాత 6-7 పిల్లలకు జన్మనిస్తుంది. మనం ఐదు పిల్లలకు జన్మనిస్తుందని అనుకుందాం. అలాగే ఏడాదికి ఒక కుందేలు ఏడుసార్లు గర్భం దాల్చుతుంది. ఇలా ఏడు ఈతల్లో 5 చొప్పున లెక్క వేసుకుంటే.. ఒక కుందేళ్లు ప్రతి ఏటా 35 పిల్లలకు జన్మనిస్తుంది. మీ యూనిట్‌లో ఉండే మొత్తం 7 కుందేళ్లు కలిపి 235 పిల్లలు జన్మనిస్తాయి. పుట్టిన తర్వాత కుందేలు పిల్ల 45 రోజులలో 2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఆ తర్వాత మీరు వాటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఒక బ్యాచ్ కుందేలు పిల్లలను అమ్మి దాదాపు రూ.2 లక్షల వరకు సంపాదించవచ్చు.

కుందేళ్లను కొందరు మాంసం కోసం కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు పెంచుకునేందుకు కొనుక్కుంటారు. పట్టణాలు, నగరాల్లో కుందేళ్లను పెంచుకునే వారు ఎక్కువగా కనిపిస్తారు. పెంచుకునే కుందేళ్లు కాస్త అధిక ధర పలుకుతాయి. మాంసం కోసం వాడేవి తక్కువ ధరకు అమ్ముడవుతాయి. అంతేకాదు కుందేళ్ల ఉన్నిని కూడా అమ్ముకోవచ్చు. ఇలా ఏడాదిలో కుందేళ్ల పిల్లలను అమ్మడం ద్వారా దాదాపు 10 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. పశుగ్రాసం, నిర్వహణకు 2 నుంచి 3 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏటా రూ.8 లక్షల వరకు నికర లాభం పొందవచ్చు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business Ideas, BUSINESS NEWS, Rabbit Farming

ఉత్తమ కథలు