హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రూ.50వేల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు 70వేల ఆదాయం వచ్చే అద్భుతమైన వ్యాపారం..

Business Ideas: రూ.50వేల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు 70వేల ఆదాయం వచ్చే అద్భుతమైన వ్యాపారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: ఉద్యోగం రావట్లేదా? ఒకవేళ ఉద్యోగం ఉన్నా.. బోర్ కొడుతోందా? సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. రూ.50వేల పెట్టుబడితే ప్రారంభిస్తే.. నెలకు రూ.70వేల ఆదాయం వస్తుంది.

  ఈ రోజుల్లో అందరు డబ్బు సంపాదన (Money Earnings) గురించే ఆలోచిస్తున్నారు.  నెలానెలా జీతం వచ్చే ఉద్యోగాలకన్నా.. సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అందుకే కొందరు ఉద్యోగంతో పాటు ఇతర పనులు చేస్తారు. మరికొందరేమో ఉద్యోగాలను మానేసి.. పూర్తి సమయాన్ని వ్యాపారానికే కేటాయిస్తున్నారు. మీరు కూడా దీర్ఘకాలిక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. ఈ వ్యాపారాన్ని కేవలం 50వేల రూపాయలతో ప్రారంభిచవచ్చు. మీకు ప్రతి నెలా రూ.70వేల వరకు ఆదాయం వస్తుంది.

  వచ్చే వారం నుంచి అమల్లోకి కొత్త ఇన్సూరెన్స్‌ రేట్‌లు.. పెరగనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు

  రోడ్డు మీదకు వెళ్తే మనకు ఎన్నో టీ స్టాల్స్ కనిపిస్తాయి. కానీ ప్రత్యేకంగా కాఫీ (Coffee) మాత్రమే ఉండే.. అందులోనూ రకరకాల వెరైటీలను అందించే.. దుకాణాలు తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి. అచ్చం టీ స్టాల్‌లానే.. కాఫీ షాప్‌ (Coffee Business) ప్రారంభిస్తే.. ఆ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒక మంచి ప్రాంతంలో.. జనాలను ఆకట్టుకునే విధంగా.. షాప్‌ను ప్రారంభిస్తే.. బాగా ఆదాయం వస్తుంది. కాఫీ షాప్‌ను ప్రారంభించాలంటే మీకు.. ముందుగా కాఫీ మెషీన్ అవసరం. అయితే మార్కెట్‌లో లభించే సాధారణ కాఫీ మెషీన్‌లను తీసుకోకుండా.. అదునాతన టెక్నాలజీ ఉన్న లేటెస్ట్ మోడల్ కాఫీ మెషీన్లను తీసుకోవాలి. ఈ యంత్రం మీ కాఫీ షాప్‌ను ప్రత్యేకంగా చేస్తుంది.

  Coffee, Coffee Benefits, Diabetic Retinopathy, Nature Scientific Journal‌, కాఫీ, కాఫీ ప్రయోజనాలు, డయాబెటిక్ రెటినోపతి, నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌
  ప్రతీకాత్మక చిత్రం

  కాఫీ తయారీ చేసే యంత్రం పేరు ఎస్ప్రెస్సో వెండింగ్ మెషిన్ (Espresso machine). భారత మార్కెట్‌లో వీటి ధర 20 వేల రూపాయల వరకు ఉంది. మీ షాపు జనాలను ఆకర్షించి.. వ్యాపారం బాగా జరగాలంటే... కాఫీ మెషీన్‌తో పాటు మరో యంత్రాన్ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మెషీన్ (Selfie coffee printing Machine). ఈ యంత్ర సాయంతో మీరు కాఫీ పైభాగంలో మీకు నచ్చిన వారి ముఖాన్ని ప్రింటింగ్ చేయవచ్చు. అంటే కాఫీపై ఫొటో కనిపిస్తుందన్నమాట.  కేవలం ఫొటోలే కాదు.. రకరకాల డిజైన్ల రూపంలో కాఫీని అందించవచ్చు. ఇలాంటి వాటిని యువత ఎక్కువగా ఇష్టపడతారు. కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో.. ఇలాంటి కాఫీ షాప్‌ని ఏర్పాటు చేస్తే.. గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కాఫీ యంత్రాలతో పాటు ఇతర ఖర్చులు కలిపితే.. కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీకు 50 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.

  Bank FDs: PNB vs ICICI vs HDFC బ్యాంక్.. మూడు బ్యాంకుల తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను చెక్ చేయండి..


  మార్కెట్లో కాఫీ ధర వెరైటీని బట్టి రూ. 50 నుంచి రూ. 100 వరకు ఈజీగా ఉంటుంది. మీరు రోజుకు 100 కాఫీలు విక్రయిస్తే.. అటూ ఇటూగా రూ.7 వేల రూపాయలు వస్తాయి. అంటే నెలలో 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో దుకాణం అద్దె, సిబ్బంది జీతం, ఇతర ఖర్చులన్నీ కలిపి లక్షా 30 వేల వరకు వస్తుందని అనుకుందాం. అప్పుడు అన్నీ పోను మీకు ప్రతి నెలా రూ.70వేలు మిగులుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బిజినెస్ అంతగా వర్కవుట్ కాదు. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ప్రారంభిస్తే.. బాగా లాభాలు వచ్చే అవకాశముంది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు