హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఈ పంట పండిస్తే.. రైతులకు లాభాలే లాభాలు.. ఊహించనంత ఆదాయం

Business Ideas: ఈ పంట పండిస్తే.. రైతులకు లాభాలే లాభాలు.. ఊహించనంత ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas | Gul Khaira Farming: భారత్‌లోనూ గుల్ ఖైరాను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రైతులు దీని వైపు మొగ్గుచూపుతున్నారు. కన్నౌజ్, హర్దోయ్, ఉన్నావ్ వంటి జిల్లాల్లో కొందరు రైతులు గుల్ ఖైరాను సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.

ఇంకా చదవండి ...

  మన దేశంలో ఇంకా చాలా మంది రైతులు సంప్రదాయ పంటలనే పండిస్తున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, మిరప.. ఇవి మాత్రమే ఎక్కువగా పండిస్తారు. కానీ సంప్రదాయ పంటలను వదిలి.. వాణిజ్య పంటల వైపు వెళ్తే.. భారీగా డబ్బు సంపాదించవచ్చు. అనేక రెట్ల అధిక ఆదాయం వస్తుంది. ఈ రోజుల్లో మార్కెట్లో ఔషధ మొక్కలకు (Medicinal Plant) డిమాండ్ పెరుగుతోంది. వివిధ మందుల తయారీలో వాడే మొక్కలకు రేటు బాగా పలుకుతోంది. గుల్ ఖైరా మొక్క (Gul Khaira Farming) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇందులో ప్రతి భాగమూ పనికొస్తుంది. వేరు, కాండం, ఆకులు, గింజలన్నీ అమ్ముడవుతాయి. అందుకే ఆ పంటను పండించే రైతులు ధనవంతులవుతున్నారు.

  Business Ideas: కిలో రూ.1000.. రైతులను కోటీశ్వరులు చేసే అద్భుతమైన పంట.. డబ్బే డబ్బు

  గుల్ ఖైరా మొక్కను ప్రత్యేకంగా పంటను వేయాల్సిన పనిలేదు. ఏదైనా పొలంలో అంతర పంటగానూ పండించవచ్చు. దీనిని ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు. అందువల్ల దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రేటు కూడా బాగా పలుకుతుంది. మీరు ఈ పువ్వుల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. మీడియా కథనాల ప్రకారం.. గుల్ ఖైరా క్వింటాల్‌కు రూ.10,000 వరకు పలుకుతోంది. ఒక ఎకరంలో 7 క్వింటాళ్ల వరకు పండించవచ్చు. తద్వారా మీరు రూ.70-80వేల వరకు సులభంగా సంపాదించవచ్చు. గుల్ఖేరా ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి విత్తిన తర్వాత.. రెండోసారి మార్కెట్‌లో విత్తనాలను కొనాల్సిన పనిలేదు. మీరు పండించిన పంటల నుంచే విత్తనాలను సేకరించి.. వాటితో మళ్లీ పంటను వేయవచ్చు.


  గుల్ ఖైరా ఆరు నెలల పంట. నవంబరు నెలలో సాగు చేయడం ఉత్తమం. నవంబరు నెలలలో విత్తనాలు వేస్తే.. ఏప్రిల్-మేలో పంట చేతికి వస్తుంది. పంట పూర్తిగా సిద్ధమైన తర్వాత.. మొక్కల కాండం, ఆకులు ఎండిపోయి కిందపడిపోతాయి. వాటిని సేకరించి విక్రయించవచ్చు. గుల్ ఖైరా పువ్వులు, ఆకులు, కాండాన్ని ఎక్కువగా యునాని ఔషధాల్లో వినియోగిస్తారు. పురుష లైంగిక సమస్యలకు వాడే మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ పువ్వుల నుంచి తయారు చేసిన మందులు జ్వరం, దగ్గుతో పాటు అనేక ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని రుజువయింది.

  Oil Prices: వచ్చే నెలలో భారీగా పెరగనున్న వంటనూనె ధరలు.. సామాన్యులకు బిగ్ షాక్ తప్పదా?

  మనదేశంలో గుల్ ఖైరాను సాగు చేసే వారు చాలా తక్కువ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ గుల్ ఖైరాను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రైతులు దీని వైపు మొగ్గుచూపుతున్నారు. కన్నౌజ్, హర్దోయ్, ఉన్నావ్ వంటి జిల్లాల్లో కొందరు రైతులు గుల్ ఖైరాను సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే అనేక రెట్లు అధిక ఆదాయం వస్తుంది. మీరే ప్రాసెసింగ్ చేసి..ప్యాకెట్ల రూపంలో ఆన్‌లైన్‌లో విక్రయిస్తే.. మరింత ఎక్కువగా లాభాలు వస్తాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు