హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఎంత ట్రై చేసినా జాబ్ రావడం లేదా? ఉన్న ఊళ్లోనే మంచి బిజినెస్.. భారీగా ఆదాయం

Business Ideas: ఎంత ట్రై చేసినా జాబ్ రావడం లేదా? ఉన్న ఊళ్లోనే మంచి బిజినెస్.. భారీగా ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas| Mineral Water Plant Business: గంటకు 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పితే.. కనీసం రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సులభంగా సంపాదించవచ్చు.

  ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం కంటే బిజినెస్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బాగా చదివినా.. ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. అదే మంచి వ్యాపారం మొదలు పెడితే.. ఎవరి మీదా ఆధారపడకుండా బతకవచ్చని భావిస్తున్నారు. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది? పెట్టుబడికి ఎంతవుంది? ఆదాయం ఎంత వస్తుందని.. ఇంటర్నెట్లో వెతుకుతుంటారు. మిత్రులతో చర్చిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ రోజుల్లో స్వచ్ఛమైన నీటికి డిమాండ్ పెరుగుతోంది. అందుకని మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే మంచి లాభాలు వస్తాయి.

  మనదేశంలో మినరల్ వాటర్ బిజినెస్  (Mineral Water Business) ఏటేటా పెరుగుతోంది. బాటిల్ వాటర్ వ్యాపారం ఏటా 20% చొప్పున వృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. వాటర్ ప్యాకెట్ల, బాటిళ్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి. కొన్ని కంపెనీలు 20 లీటర్ల వాటర్ బాటిళ్లను ఇంటింటికీ సరఫరా చేస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయవచ్చు. పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఉన్న ఊళ్లో కూడా దీనిని ప్రారంభించి... ఇంటింటికీ బాటిళ్లతో నీటి సరఫరా చేయవచ్చు.

  Multibagger Stock: 6 రూపాయల స్టాక్.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగాా లాభాలు వచ్చే ఛాన్స్.!

  ఎలా ప్రారంభించాలి..?

  మీరు మినరల్ వాటర్ (Mineral water plant) వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందుగా ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి. కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేయాలి. పాన్ నంబర్, GSTనంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి. అధికార యంత్రాంగ నుంచి లైసెన్స్, ISI నంబర్ తీసుకోవాలి. కొందరు ఇవేమీ లేకుండా.. జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం రిస్క్. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్‌వో ఫిల్టర్‌తో పాటు పలు యంత్రాలు అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసేందుకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

  Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు..ఎక్కడ ఎంత రేటుందో ఇక్కడ చూడండి

  వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్‌ని అందించవచ్చు. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ ఓ ప్లాంట్లను తయారుచేస్తున్నాయి. వాటికి రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాలి. అన్ని ఖర్చులు కలిపి.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత డబ్బు మీ వద్ద లేకుంటే.. బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చు.

  ఆదాయం ఎంత?

  గంటకు 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పితే.. కనీసం రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సులభంగా సంపాదించవచ్చు. మీకు 200 మంది కస్టమర్లు ఉడి.. వారికి రోజుకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.25. అంటే రోజుకు రూ.5వేలు వస్తాయి. నెలకు లక్షా రూ.50వేలు ఆదాయం వస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, డీజిల్, సిబ్బంది జీతం ఖర్చులు లక్ష రూపాయల వరకు పోయినా.. మీకు రూ.50వేల నికర లాభం వస్తుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ.. లాభం కూడా పెరుగుతుంది. ఇది ఎండాకాలం. ఈ టైమ్‌లో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు ఒకవేళ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించాలని అనుకుంటే... అందుకు ఇదే మంచి సమయం.


  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance, Water

  ఉత్తమ కథలు