BUSINESS IDEAS IN TELUGU START CUCUMBER FARMING WITH LOW INVESTMENT EARN 50 THOUSAND RUPEES PER ACRE SK
Business Ideas: గ్రామీణ యువతకు చక్కటి అవకాశం..ఈ పంటలో భారీగా ఆదాయం
ప్రతీకాత్మక చిత్రం
Business Ideas | Cucumber Farming: ఇది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తుంది. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించవచ్చు. అదే దోస పంట. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఎంతో మంది యువత తమ జాబ్స్ని వదిలిపెట్టి సొంతూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అందులోనూ వ్యవసాయానికి (Agriculture Ideas) సంబంధించి బిజినెస్ (Business Ideas) చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఇవాళ ఓ పంట గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తుంది. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించవచ్చు. అదే దోస పంట. ఎండాకాలంలో కీరదోసకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రెస్టారెంట్లలో కూడా దీనిని అధికంగా వినియోగిస్తారు. దోసకాయలతో సలాడ్లు చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనికి మంచి రేటు లభిస్తోంది.
దోసకాయలు (Cucumber Farming) నీరు పుష్కలంగా ఉన్న ఇసుక, లోమీ నేలల్లో బాగా పండుతుంది. నేల pH విలువ 6-7 మధ్య ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలో సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువుల పక్కన ఉండే భూముల్లో పండించవచ్చు. ఈ పంటను గ్రామాలతో పాటు నగరాల్లో కూడా సాగు చేయవచ్చు. దోస పంట సాగుకు ప్రభుత్వాలు సైతం సాయం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరమైన విధానం ఉంటుంది. మీ సమీపంలోని వ్యవసాయ కేంద్రానికి వెళ్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలస్తాయి. దోసకాయ పంట కేవలం 60 నుంచి 80 రోజుల్లోచే చేతికి వస్తుంది. ఆ తర్వాత దోసకాయలను కోసి మార్కెట్లో విక్రయించవచ్చు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు దోసకాయ సాగుతో లక్షల ఆదాయం పొందుతున్నాడు. కేవలం 4 నెలల్లో రూ. 8 లక్షలు సంపాదించాడు. దుర్గా ప్రసాదర్ నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేక రకమైన కీరదోస విత్తనాలను తీసుకొచ్చాడు. ఇందులో విత్తనాలు ఉండవు. అందువల్ల హోటల్స్, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. నేరుగా వాటికి విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు దుర్గాప్రసాద్.
ఇది తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పంట. సగటున ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేస్తే.. సుమారు 70 క్వింటాళ్ల దోసకాయ పంట చేతికి వస్తుంది. మండీలలో దీని ధర క్వింటాల్‌కు 1000 నుండి 2000 రూపాయల వరకు ఉంటుంది. క్వింటాల్‌కు సగటున రూ.1500 ధర పలికినా ఎకరా రూ.లక్షకుపైగానే వస్తుంది. తద్వారా ఎకరాకు రూ.50 ఆదాయం వస్తుంది. ఎక్కువ భూమిలోసాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సూపర్ మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్స్‌తో మాట్లాడి ఒప్పందం చేసుకుంటే.. మరింత ఆదాయం వస్తుంది.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.