హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రూ.25వేల పెట్టుబడి.. నెలకు రూ.50వేల ఆదాయం.. నిరుద్యోగులకు మంచి అవకాశం

Business Ideas: రూ.25వేల పెట్టుబడి.. నెలకు రూ.50వేల ఆదాయం.. నిరుద్యోగులకు మంచి అవకాశం

Business Ideas | Car Washing Business: కార్ వాషింగ్ ఛార్జీలు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. సాధారణంగా చిన్న నగరాల్లో రూ.150 -450 వరకు వసూలు చేస్తారు. పెద్ద నగరాల్లో దీని ధర రూ. 250 వరకు ఉంటుంది.

Business Ideas | Car Washing Business: కార్ వాషింగ్ ఛార్జీలు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. సాధారణంగా చిన్న నగరాల్లో రూ.150 -450 వరకు వసూలు చేస్తారు. పెద్ద నగరాల్లో దీని ధర రూ. 250 వరకు ఉంటుంది.

Business Ideas | Car Washing Business: కార్ వాషింగ్ ఛార్జీలు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. సాధారణంగా చిన్న నగరాల్లో రూ.150 -450 వరకు వసూలు చేస్తారు. పెద్ద నగరాల్లో దీని ధర రూ. 250 వరకు ఉంటుంది.

  ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారులో మనలో చాలా మందే ఉన్నారు. ఐతే వారిలో కొందరు... నిరాశ నిస్పృహలకు లోనవకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ప్రారంభించి బాగా సంపాదిస్తున్నారు. మీరు కూడా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అలాంటి వారికి కార్ వాషింగ్ మంచి అవకాశం. దీనిని రూ.25వేల తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. త్వదారా నెలనెలా రూ.50వేల వరకు సంపాదించవచ్చు.

  కార్ వాషింగ్ (Car Washing Business) అంటే.. కొందరికి చాలా చీప్‌గా అనిపించవచ్చు. కానీ ఇది ప్రొఫెషనల్ బిజినెస్. కార్ వాషింగ్ చేస్తూ బాగా సంపాదిస్తున్న వారు బోలెడు మంది ఉన్నారు. ఈ వ్యాపారం బాగా లాభసాటిగా ఉంటే.. దానిని మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఒక మెకానిక్‌ని నియమించి.. కారు రిపేర్ సర్వీస్‌ను కూడా ప్రారంభంచవచ్చు. అప్పుడు ఆదాయం ఇంకా పెరుగుతుంది.

  Business Ideas: మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమా..? ఇలా వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం

  కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్లు అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.12,000 నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న స్థాయితో ప్రారంభించాలనుకుంటే.. తక్కువ ఖర్చుతోనే యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ వ్యాపారం బాగా పుంజుకున్న తర్వాత అప్పుడు పెద్ద యంత్రాలకు వెళ్లవచ్చు. మొదట రూ.14వేలతో యంత్రాన్ని కోనుగోలు చేస్తే సరిపోతుంది. మెరుగ్గా పని చేసే 2 హార్స్ పవర్ ఉన్న యంత్రాలు, పైపులు, నాజిల్స్ అన్ని ఇందులోనే వస్తాయి. పొందవచ్చు. ఇవి కాకుండా దాదాపు 9,000-10,000 రూపాయలకు అందుబాటులో ఉండే 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను తీసుకోవాలి. ఇక షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డ్యాష్‌బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ ఐటమ్స్ అన్నీ కలిపి దాదాపు రూ.1700 వరకు వస్తాయి.

  కార్ వాషింగ్ షెడ్‌ని నీటి లభ్యత బాగా ఉన్న చోట ఏర్పాటు చేసుకోవాలి. రద్దీలోని ప్రాంతంలో.. అంటే పట్టణ శివార్లలో ఉండాలి. ఎందుకంటే బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. షెడ్‌కు వచ్చే కార్లతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగవవచ్చు. అప్పుడు ట్రాఫిక్ సిబ్బంది నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా మెకానిక్ షాప్ అందుబాటులో ఉంటే.. వారికి సగం అద్దె చెల్లించి.. అక్కడే కార్ వాషింగ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది. గిరాకీ కూడా పెరుగుతుంది. రిపేర్ చేయించుకునేందుకు వచ్చే కార్లు.. మరమ్మత్తుల అనంతరం మీ షెడ్‌లో వాషింగ్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది.

  Multibagger Stock: లక్ష పెట్టుబడితో 1.64 కోట్ల లాభం.. సామాన్యులను కోటీశ్వరులు చేసిన స్టాక్

  కార్ వాషింగ్ ఛార్జీలు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. సాధారణంగా చిన్న నగరాల్లో రూ.150 -450 వరకు వసూలు చేస్తారు. పెద్ద నగరాల్లో దీని ధర రూ. 250 వరకు ఉంటుంది. స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లపై రూ.350, ఎస్‌యూవీలపై రూ.450 వరకు వసూలు చేస్తున్నారు. మీరు రోజుకు 7-8 కార్లు వాష్ చేస్తే.. ఒక్కో కారుకు సగటున రూ. 250 సంపాదిస్తే.. ఒక రోజులో రూ. 2000 వరకు సంపాదించవచ్చు. కార్లతో పాటు బైక్ వాషింగ్ కూడా చేయవచ్చు. కార్లు, బైక్‌ల వాషింగ్ చేస్తూ.. అన్ని ఖర్చులు పోగా.. మీరు నెలకు ఈజీగా రూ. 40-50 వేల వరకు సంపాదించవచ్చు.

  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు