హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రైతులను లక్షాధికారులను చేస్తున్న పంట.. ప్రతి నెలా భారీగా ఆదాయం

Business Ideas: రైతులను లక్షాధికారులను చేస్తున్న పంట.. ప్రతి నెలా భారీగా ఆదాయం

Business Ideas | Lemon Farming: ఎకరం భూమిలో నిమ్మ సాగు చేయడం ద్వారా రైతు ప్రతిఏటా సులువుగా రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఎండకాలంలో బాగా డిమాండ్ ఉంటుంది. మంచి రేటు కూడా వస్తుంది.

Business Ideas | Lemon Farming: ఎకరం భూమిలో నిమ్మ సాగు చేయడం ద్వారా రైతు ప్రతిఏటా సులువుగా రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఎండకాలంలో బాగా డిమాండ్ ఉంటుంది. మంచి రేటు కూడా వస్తుంది.

Business Ideas | Lemon Farming: ఎకరం భూమిలో నిమ్మ సాగు చేయడం ద్వారా రైతు ప్రతిఏటా సులువుగా రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఎండకాలంలో బాగా డిమాండ్ ఉంటుంది. మంచి రేటు కూడా వస్తుంది.

  మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? సొంతంగా వ్యాపారం (Business Ideas) చేయాలనుకుంటున్నారా? మీ ఊళ్లో మీకు కొంచెం భూమి ఉంటే అందులో బంగారం లాంటి పంటలు పండించవచ్చు. ఎంతో మంది విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలను వదిలేసి.. గ్రామాలకు వెళ్లి.. వ్యవసాయం చేస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా.. వాణిజ్య పంటలు పండిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. వాటిలో నిమ్మ సాగు ఒకటి. ఈ మధ్య దేశవ్యాప్తంగా నిమ్మ సాగు పెరిగింది. నిమ్మకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు నిమ్మసాగు (Lemon Farming) చేస్తున్నారు. ఇతర రైతులతో పోల్చితే మంచి లాభాలు గడిస్తున్నారు.

  నిమ్మలో ఎన్నో ఉపయోగకరమైన (Lemon Health Benefits) లక్షణాలు ఉన్నాయి. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో నిమ్మపండును వినియోగిస్తారు. కూరల్లో వేయడంతో పాటు నిమ్మరసం, నిమ్మ షర్బత్ వంటి పానీయాలు చేసుకుంటారు. నిమ్మ పచ్చళ్ల కోసం ఎక్కువ మంది వీటిని వినియోగిస్తారు. అందుకే నిమ్మ పళ్లకు ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌లో నిమ్మ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేసవిలో నిమ్మకాయలు పంట ఎక్కువగా వస్తే.. ఆ రైతు పంట పడినట్లే..! లక్షలు సంపాదించవచ్చు. ప్రస్తుత సీజన్‌లో నిమ్మకాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో నిమ్మకాయలు విక్రయం (Business Tips) చేపడితే భారీగా లాభాలు వస్తాయి.

  సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ.. కొత్త ఇంట్రస్ట్ రేట్స్ ఇవే

  lemon price in india, lemon price memes, why lemon price is increasing, funny memes on lemons, nimbu price latest, నిమ్మకాయల ధరలపై మీమ్స్, నిమ్మకాయల ధరలు, నిమ్మ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
  ప్రతీకాత్మక చిత్రం

  నిమ్మ మొక్కను ఒకసారి నాటితే 10 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. నిమ్మ మొక్కను నాటిన తర్వాత.. సుమారు 3 సంవత్సరాల తర్వాత బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఏడాది పొడవునా దిగుబడిని ఇస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా నిమ్మకాయలను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. మనదేశంలో తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలలో నిమ్మను సాగు చేస్తారు. చాలా మంది రైతులు నిమ్మసాగుతో లక్షలు సంపాదిస్తున్నారు.

  నిమ్మ సాగు కోసం ఇసుక, లోమీ నేలలు ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. రెడ్ లేటరైట్, ఆల్కలీన్ నేలలు, కొండ ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. 4 నుంచి 9 pH విలువ కలిగిన నేలలో నిమ్మ సాగు చేయవచ్చు. నిమ్మ గింజలను నేలలో విత్తవచ్చు. లేదంటే నేరుగా నిమ్మ మొక్కలను కూడా నాటవచ్చు. మొక్కలు నాటితే తక్కువ ఖర్చువుతుంది. నర్సరీల్లో నిమ్మ మొక్కలు లభిస్తాయి. కనీసం ఒక నెల రోజుల వయసున్న నాణ్యమైన మొక్కలు తీసుకుంటే మంచిది. ఒక నిమ్మ చెట్టు నుంచి 30-40 కిలోల నిమ్మకాయలు వస్తాయి. మందపాటి తొక్క ఉంటే 50 కిలోల వరకు ఉంటుంది. నిమ్మకాయలకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుంది.

  Business Idea - Farming: ఈ పండును సాగు చేస్తే ఎకరానికి అరకోటికి పైగా ఆదాయం.. ఎలానో తెలుసుకోండి

  నిమ్మకాయ మార్కెట్‌లో కిలో ధర 40 నుంచి 70 రూపాయల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఎకరం భూమిలో నిమ్మ సాగు చేయడం ద్వారా రైతు ప్రతిఏటా సులువుగా రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఎండకాలంలో బాగా డిమాండ్ ఉంటుంది. మంచి రేటు కూడా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు భగ్గుమంటున్నాయి. యాపిల్ కంటే ఎక్కువ రేటు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిమ్మకాయల ధర కిలోకు రూ.400 దాటింది. ఒక్క నిమ్మకాయ ధర రూ.10కి లభిస్తోంది. ఇలా ఎక్కువ రేటు ఉన్నప్పుడు రైతులకు మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది.

  First published:

  Tags: Business, Business Ideas, Lemon, Personal Finance

  ఉత్తమ కథలు