హోమ్ /వార్తలు /business /

Business Ideas: 6 నెలల్లో రూ.10 లక్షలు.. ఈ పంటతో రైతులకు భారీగా ఆదాయం

Business Ideas: 6 నెలల్లో రూ.10 లక్షలు.. ఈ పంటతో రైతులకు భారీగా ఆదాయం

Business Ideas: మార్కెట్లో క్వింటాల్ వెల్లుల్లి రూ. 10000 నుంచి 21000 వరకు పలుకుతుంది. ఒక ఎకరాలో వెల్లుల్లిని సాగు చేయాలంటే రూ.40000 వరకు ఖర్చవుతుంది.

Business Ideas: మార్కెట్లో క్వింటాల్ వెల్లుల్లి రూ. 10000 నుంచి 21000 వరకు పలుకుతుంది. ఒక ఎకరాలో వెల్లుల్లిని సాగు చేయాలంటే రూ.40000 వరకు ఖర్చవుతుంది.

Business Ideas: మార్కెట్లో క్వింటాల్ వెల్లుల్లి రూ. 10000 నుంచి 21000 వరకు పలుకుతుంది. ఒక ఎకరాలో వెల్లుల్లిని సాగు చేయాలంటే రూ.40000 వరకు ఖర్చవుతుంది.

  ఈ రోజుల్లో చాలా మంది యువత జాబ్ వదిలిపెట్టి పొలంలోకి దిగుతున్నారు.  వ్యవసాయం చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. సంప్రదాయ పంటలు కూడా వాణిజ్య పంటలను పండిస్తూ జాబ్ కన్నా ఎక్కువ ఆదాయ పొందుతున్నారు. అలాంటి వాణిజ్య పంటల్లో వెల్లుల్లి ఒకటి.  వెల్లుల్లి సాగు ద్వారా.. మీరు  మొదటి పంటలోనే... అంటే ఆరు నెలల్లోనే ఏకంగా రూ.10లక్షల వరకు సంపాదించవచ్చు. మనదేశంలో ఎంతో మంది రైతులు వెల్లుల్లిని సాగు చేస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు.

  వెల్లుల్లి వాణిజ్య పంట. దీనికి మనదేశంలో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అల్లం, వెల్లుల్లి లేనిదే భారతీయ వంటకాలు పూర్తి కావు. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో దీనిని వినియోగిస్తారు. కేవలం  సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు...ఔషధంగానూ ఉపయోగిస్తారు. వెల్లుల్లిని కూరగాయగా, ఊరగాయగా, మసాలాగాను వాడుతారు. అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, కీళ్లనొప్పులు, నపుంసకత్వము వంటి వ్యాధులను నయం చేసేందుకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.  యాంటీ బ్యాక్టీరియల్,  క్యాన్సర్ నిరోధక గుణాల కారణంగా పలు రకాల మందుల్లోనూ వినియోగిస్తారు.

  Multibagger Stock: రూ.2 స్టాక్.. రూ.10వేల పెట్టుబడికి రూ.1.30 కోట్ల రాబడి.. ఇన్వెసర్లపై కో

  వెల్లుల్లిని నేరుగా వాడడంతో పాటు  పౌడర్, పేస్ట్, చిప్స్‌తో సహా అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అందుకే ఈ పంటను పండించే రైతులకు భారీగా ఆదాయం వస్తుంది. తక్కువ సమసంలో ధనవంతులయ్యే అవకాశముంది.

  వెల్లుల్లిని ఎలా పండించాలి..?

  వెల్లుల్లి సాగుకు వానాకాలం అనుకూలం కాదు.  వానాకాలం ముగిసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి సాగు ప్రారంభించాలి.  అదంటే అక్టోబర్,  నవంబర్ నెలల్లో సాగు చేయవచ్చు. వెల్లుల్లిని దాని మొగ్గల నుంచి పండిస్తారు. 10 సెంటీమీటర్ల దూరంలో మొగ్గలను నాటుతారు. దీనిని ఏ నేలలోనైనా సాగు చేయవచ్చు. కానీ నీరు ఎక్కువగా నిలచిపోతే పంట దెబ్బతింటుంది. అందుకే నీరు ఎక్కువగా నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ పంట 5-6 నెలల్లో  కోతకు వస్తుంది.

  Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250 పెన్షన్ ఇచ్చే పథకం

  వెల్లుల్లిలో చాలా రకాలు ఉన్నాయి. ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాల్ వెల్లుల్లి  రూ. 10000 నుంచి  21000 వరకు పలుకుతుంది. ఒక ఎకరాలో వెల్లుల్లిని సాగు చేయాలంటే  రూ.40000 వరకు ఖర్చవుతుంది.  వెల్లుల్లిలో చాలా రకాలు ఉన్నాయి.   ఇందులో రియావాన్ రకం చాలా మంచిదనే పేరుుంది.  మీడియా నివేదికల ప్రకారం.. ఇతర వెల్లుల్లి రకాల కంటే రియా వన్  రకానికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీని నాణ్యత బాగుటుంది. ఒక్కో గడ్డ  100 గ్రాముల వరకు ఉంటుంది. అందులో 6 నుండి 13 వెల్లుల్లి మొగ్గలు ఉంటాయి.  ఈ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా రైతులు ఒక పంటకాలంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

  First published:

  ఉత్తమ కథలు