హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: కేజీ మాంసం ధర రూ.1200.. కడక్‌నాథ్ కోళ్లతో రైతులు కోటీశ్వరులయ్యే ఛాన్స్..

Business Ideas: కేజీ మాంసం ధర రూ.1200.. కడక్‌నాథ్ కోళ్లతో రైతులు కోటీశ్వరులయ్యే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kadaknath chicken Business: వెయ్యి కోడి పిల్లలతో కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం చేస్తే.. మీకు రూ.4 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కాస్త శ్రద్ధ పెట్టి.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కోడిపిల్లలను పెంచితే.. అవి మూడు నాలుగు నెలల్లో అమ్మకానికి వస్తాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ రోజుల్లో ఉద్యోగం కన్నా.. సొంత వ్యాపార చేసుకోవడమే మేలన్న ధోరణి యువతలో పెరుగుతోంది. ఉద్యోగం రాని వారు... ప్రైవేట్ జాబ్ చేయడం ఇష్టం లేని వారు.. వ్యాపారం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. సొంత గ్రామంలోనే కింగ్‌లా బతకాలని కలలు కంటుంటారు. అందులోనూ లక్షల్లో లాభాలిచ్చే వ్యాపారాల గురించి తెలుసుకుంటున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే.. మీకోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. అదే కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం (Kadaknath Chicken Business). ఈ మధ్య ఈ కడక్ ‌నాథ్ కోళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇవి నలుపు రంగులో ఉంటాయి. రక్త మాంసాలు కూడా నల్లగానే ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్ల మాసంలో అనేక ఔషధ (Kadaknath for Health) గుణాలున్నాయి. ఇందులో ఐరన్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. కడక్‌నాథ్ కోళ్ల మాంసం హార్ట్, షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా వినియోగిస్తే శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. అందువల్లే కడక్‌నాథ్ మాంసానికి . మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. రేటు కూడా బాగా లభిస్తోంది.

  Business Idea: ఇంటి నుంచే చేసే వ్యాపారం.. నెలకు రూ. 20 వేలకు పైగా ఆదాయం.. లుక్కేయండి

  మన దేశంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల్లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఎక్కువగా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల ప్రజలు కోడక్‌నాథ్ కోళ్లను కాలీమాసీ అని పిలుస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు కడక్‌నాథ్ కోడి పిల్లలను సకాలంలో అందించలేకపోతున్నాయంటే.. అక్కడ ఏ స్థాయిలో దీని వ్యాపారం ఉందో.. ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నారు. ఆయన కూడా మధ్యప్రదేశ్ నుంచే కోడి పిల్లలను కొనుగోలు చేసి.. తమ కోళ్ల ఫారమ్‌లో పెంచుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో కడక్‌నాథ్ కోళ్లు పుట్టినందున.. జిఐ ట్యాగ్ కూడా వచ్చింది.

  New Business Idea: ప్రతి నెలా రూ. లక్ష సంపాదన.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. ఆ బిజినెస్ ఏంటంటే..

  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు దానిని ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కేవలం రూ. 53,000 రూపాయలతోనే కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం ప్రారంభింవచ్చు. ఈ డబ్బును డిపాజిట్ చేస్తే.. ప్రభుత్వమే 1000 కోడిపిల్లలు, 30 కోళ్ల జాలీ, 6 నెలల పాటు ఉచిత దాణాను మూడు విడతలుగా ఇస్తుంది. టీకా, ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం భరిస్తుంది. అంతే కాదు కోళ్లు పెద్దయ్యాక మార్కెటింగ్ పరంగానూ ప్రభుత్వం సాయం చేస్తుంది.


  మీరు కూడా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం వ్యాపారం చేయాలనుకుంటే కృషి విజ్ఞాన కేంద్రం నుండి కోడిపిల్లలను తీసుకోవచ్చు. ఒక్క కడక్‌నాథ్ కోడిపిల్ల ధర ధర రూ.70-100 మధ్య ఉంటుంది.  గుడ్డు ధర రూ.20-30కి లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో అక్కడి ప్రభుత్వ సబ్సిడీ ఇస్తున్నందన అక్కడి ప్రజలకు పెట్టుబడి తక్కువే అవుతుంది. కానీ ఏపీ, తెలంగాణలో అలాంటి పథకాలు లేవు. మనమే సొంత డబ్బులతో కోడి పిల్లలను కొనుగోలు చేసి.. వాటిని పెంచాల్సి ఉంటుంది. మీరు 1000 వెయ్యి కోడి పిల్లలను రూ.70 చొప్పున కొంటే.. రూ.70వేల ఖర్చవుతుంది. షెడ్ నిర్మించుకుంటే ఎక్కువ ఖర్చవుతుంది. అందువల్ల ప్రారంభంలో.. కేజ్‌లల్లో పెంచవచ్చు. దాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటే.. మీకు మరో 3 లక్షల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వెయ్యి కోడి పిల్లలతో కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం చేస్తే.. మీకు రూ.4 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కాస్త శ్రద్ధ పెట్టి.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కోడిపిల్లలను పెంచితే.. అవి మూడు నాలుగు నెలల్లో అమ్మకానికి వస్తాయి.

  మీరు తీసుకున్న వెయ్యి కోడి పిల్లల్లో మోర్టాలిటీ పోను.. రూ.900 వరకు ఉందాయనుకుందాం. అవి ఒక్కొక్కటి రెండు కిలోల చొప్పున పెరిగితే.. మొత్తం 1800 కేజీలు. మార్కెట్లో కిలో కడక్ నాథ్ మాంసం 1000-1200 వరకు ఉంటుంది. అదే లైవ్ కోడి అయితే.. రూ.800 వరకు పలుకుతుంది. కానీ మీరు సొంతంగా మార్కెంటింగ్ చేసుకోలేకపోతే.. ఏదైనా కంపెనీకి విక్రయించవచ్చు. కిలోకు రూ.500 చొప్పున అన్ని కోళ్లను ఒకేసారి విక్రయించవచ్చు. ఈ లెక్కన 1800 కేజీలకు.. రూ.9 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోతే.. రూ.5 లక్షలు మిగులుతాయి. అంటే మూడు నాలుగు నెలల్లోనే ఇంత ఆదాయం వస్తుందన్నమాట. మీరు షెడ్ వేసి.. ఇంకా ఎక్కువ పిల్లలను పెంచితే.. ఆదాయం భారీగా పెరుగుతుంది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas

  ఉత్తమ కథలు