హోమ్ /వార్తలు /business /

Business Ideas: రైతులకు వరం.. పచ్చని పొలాల్లో పసందైన వ్యాపారం.. రూ.10 లక్షల ఆదాయం

Business Ideas: రైతులకు వరం.. పచ్చని పొలాల్లో పసందైన వ్యాపారం.. రూ.10 లక్షల ఆదాయం

Business Ideas : Beekeeping business| నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా.. సొంతూరిలో ఉంటూ నామమాత్రపు ఖర్చుతో నెలకు రూ. 70వేల నుంచి లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు. పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య హాయిగా బిజినెస్ చేయవచ్చు.

Business Ideas : Beekeeping business| నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా.. సొంతూరిలో ఉంటూ నామమాత్రపు ఖర్చుతో నెలకు రూ. 70వేల నుంచి లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు. పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య హాయిగా బిజినెస్ చేయవచ్చు.

Business Ideas : Beekeeping business| నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా.. సొంతూరిలో ఉంటూ నామమాత్రపు ఖర్చుతో నెలకు రూ. 70వేల నుంచి లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు. పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య హాయిగా బిజినెస్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...

  ఈ మధ్య ఎక్కువ మంది ఉద్యోగాల కన్నా వ్యాపారంవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చెందిన వారు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. మీరు పల్లెల్లో ఉండి.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలిచ్చే వ్యాపారం (Business Ideas) కోసం చూస్తున్నట్లయితే.. తేనెటీగల పెంపకం (Beekeeping) మంచి ఆప్షన్. దీనికి దేశవిదేశాల్లో అధిక డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆత్మనిర్భర్ నినాదంతో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి సారించింది. తేనెటీగల పెంపకం కూడా దీని కిందకే వస్తుంది. నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా.. సొంతూరిలో ఉంటూ నామమాత్రపు ఖర్చుతో నెలకు రూ. 70వేల నుంచి లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు. పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య హాయిగా బిజినెస్ చేయవచ్చు.

  ఔషధాల నుంచి మొదలుకొని.. ఆహార ఉత్పత్తుల వరకు చాలా చోట్ల తేనె (Honey for Health) ను ఉపయోగిస్తారు. మార్కెట్లో నాణ్యమైన తేనెకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు తేనెటీగల పెంపకం వల్ల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంది. తేనెటీగలు పుప్పొడి రేణువులను మోసుకెళ్లి.. పరపరాగ సంపర్కానికి కారణమై.. పంట దిగుబడిని బాగా పెంచుతాయి. అందుకే అనేక రాష్ట్రాల్లో రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి తేనెటీగల పెంపకంలోకి దిగారు. దీని ద్వారా బాగా డబ్బు సంపాదిస్తున్నారు. వీరికి ప్రభుత్వం కూడా అనేక విధాలుగా సాయం చేస్తోంది.

  Multibagger stock: ఒక్క షేర్ 20 పైసలే.. లక్ష పెట్టుబడి పెడితే... ఏకంగా రూ. 20 లక్షల లాభం

  పంట పొలాల మధ్య తేనెటీగల పెంపకాన్ని 'బీ కీపింగ్' అంటారు. 'పంట ఉత్పాదకత పెంపు కోసం తేనెటీగల పెంపకం' పేరుతో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ పథకాన్ని తీసుకొచ్చింది. తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, పంట ఉత్పాదకతను పెంచడం, శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించడం ఈ పథక ఉద్దేశ్యం. నేషనల్ బీ బోర్డ్ (NBB) నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తేనెటీగల పెంపకం వ్యాపారానికి ప్రభుత్వం 80 నుండి 85 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది.

  తేనెటీగల పెంపకం

  తేనెటీగల పెంపకాన్ని మొదట 10 పెట్టెలతో ప్రారంభివచ్చు. ఒక బాక్సులో 40 కిలోల తేనె దొరికితే.. మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టెకు ఖర్చు రూ.3500 వస్తే మొత్తం ఖర్చు రూ.35,000 అవుతుంది. ఖర్చులు పోనూ.. నికర లాభం రూ.1,05,000 వరకు ఉంటుంది. తేనెటీగల సంఖ్య పెరుగుదలతో ప్రతి సంవత్సరం ఈ వ్యాపారం 3 రెట్ల మేర పెరుగుతుంది. అంటే 10 పెట్టెలతో ప్రారంభించిన వ్యాపారం ... ఏడాదికి 25 నుంచి 30 బాక్సుల వరకు ఉంటుంది. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. తేనెటీగల పెంపకంతో కేవలం తేనె, మైనం మాత్రమే కాదు.. బీస్వాక్స్, రాయల్ జెల్లీ, పుప్పొడి లేదా బీ గమ్, పుప్పొడి వంటి ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పత్తులన్నింటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

  Business Ideas: జాబ్ గురించి టెన్షన్ వద్దు.. ఉన్న ఊళ్లోనే వ్యాపారం.. నెలకు రూ.లక్ష ఆదాయం

  ఒకవేళ మీరు తేనెటీగల పెంపకం పెద్ద ఎత్తున చేయాలనుకుంటే.. 100 పెట్టెలను తీసుకొని ప్రారంభించవచ్చు. ఒక పెట్టెలో ఏడాదికి 40 కిలోల తేనె వస్తుందనుకంటే.. మొత్తం తేనె 4000 కిలోలు అవుతుంది. 400 కిలోల తేనెను కిలో రూ.350కి విక్రయిస్తే రూ.14,00,00,000 వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వస్తే మొత్తం ఖర్చు రూ.3,40,000 అవుతుంది. కూలీ, ప్రయాణం వంటి ఇతర ఖర్చులకు రూ. 1,75,000 పోగా.. నికర లాభం రూ.10,15,000 వస్తుంది. పంటు పూత దశలో ఉన్న సమయంలో తేనె ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది. తేనెను నెలకోసారి అమ్ముతూ.. నెలనెలా రూ.70వేల నుంచి లక్షల వరకు డబ్బులు సంపాదించవచ్చు.

  First published:

  ఉత్తమ కథలు